|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిన్న ప్రాజెక్ట్ అనుకోకుండా మా సినిమా స్థాయిని పెంచారు.. గెటప్ శ్రీను ఎమోషనల్ ట్వీట్

Published: 31-05-2025, 6:41 AM
చిన్న ప్రాజెక్ట్ అనుకోకుండా మా సినిమా స్థాయిని పెంచారు.. గెటప్ శ్రీను ఎమోషనల్ ట్వీట్

గద్దర్ అవార్డులలో గెటప్ శ్రీను నటించిన ‘రాజు యాదవ్’ సినిమాకు అవార్డు లభించింది. ఈ విషయంపై గెటప్ శ్రీను ఎమోషనల్ ట్వీట్ చేస్తూ చిన్న సినిమాకు అవార్డు రావడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Key Points

1

గెటప్ శ్రీను నటించిన ‘రాజు యాదవ్’ సినిమాకు గద్దర్ అవార్డు.

2

సినిమాలోని పాటకు ఉత్తమ గేయ రచయిత అవార్డు లభించింది.

4

చిన్న ప్రాజెక్ట్ అయినప్పటికీ, సినిమాకు అవార్డు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు.

‘రాజు యాదవ్’ సినిమాకు గద్దర్ అవార్డు

గద్దర్ ఫీచర్ ఫిల్మ్ అవార్డులు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో చిన్న, పెద్ద అని తేడా లేకుండా పలు సినిమాలకు అవార్డులు దక్కాయి. అయితే ఇందులో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను(Getup Srinu) నటించిన సినిమా ‘రాజు యాదవ్‌’(Raju Yadav)లోని పాటకు కూడా అవార్డు వచ్చింది. సాయి వ‌రుణ‌వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రశాంత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కృష్ణమాచారి ద‌ర్శక‌త్వం వహించాడు. ఇక ఈ మూవీకి ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్‌కు అవార్డు వచ్చింది. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ గెటప్ శ్రీను ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘‘చంద్రబోస్(Chandra Bose) గారిని ‘రాజు యాదవ్’ సినిమా గురించి రెండు పాటలు రాయాలి అని అడగ్గానే చిన్న సినిమా అని ఏ మాత్రం చూడకుండా ఆయన ప్రతిభను పాట రూపంలో మా ‘రాజుయాదవ్’ కి అందించారు.

ఉత్తమ గేయ రచయిత అవార్డు

మా సినిమా స్థాయిని పెంచి నేడు ఉత్తమ గేయ రచయితగా (లేదే లేదే ప్రేమే లేదసలే) పాట గద్దర్ తెలంగాణ అవార్డ్ పొందడం చాలా ఆనందంగా ఉంది. చంద్రబోస్ గారికి మనస్పూర్తి అభినదనలతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే కొత్త దర్శకుడు కొత్త ప్రయోగాత్మక కథతో మీకు చెప్పగానే మాకు సినిమాకి కావాల్సిన అన్ని సమకూర్చి ప్రేక్షకులకు వరకు మమ్మల్ని తీసుకువెళ్లిన మా మంచి నిర్మాతలకు.. స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంటున్నదుకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మా టాలెంటెడ్ డైరెక్టర్ కిట్టుకు థాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లుఅర్జున్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

గెటప్ శ్రీను ఎమోషనల్ ట్వీట్

అన్ని విభాగాల్లో తమ ప్రతిభతో #GaddarAwards2025 అందుకుంటున్న అందరికీ అభినందనలు. ఈచిన్న సినిమా పెద్ద సినిమా వ్యత్యాసం లేకుండా ప్రతిభకు తగిన గుర్తింపు ఇచ్చిన జ్యూరీ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు. కళకి,కళాకారులకి ప్రేక్షకుల మన్ననలతో పాటు అవార్డులు మరింత భాద్యతను, ఉత్సాహాన్ని నింపుతాయి. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఆగిన అవార్డ్స్‌ను విప్లవ కవి గద్దర్ గారి పేరుతో గద్దర్ అవార్డ్స్ గా మరలా ప్రారంభించిన గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చాడు.

చిన్న సినిమా అయినా, ప్రతిభకు గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని గెటప్ శ్రీను తెలిపారు. అవార్డు ఇచ్చిన జ్యూరీ సభ్యులకు, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.