
సంగీత ప్రపంచంలో ఘంటసాల గొప్పతనం అందరికీ తెలిసిందే. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఘంటసాల ది గ్రేట్’ చిత్రం డిసెంబర్ 12న విడుదల కానుంది. ఈ మూవీ టీజర్‌ను ఆదిత్య హాసన్ లాంచ్ చేశారు. నేటి తరాన్ని ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేసింది.
Key Points
‘ఘంటసాల ది గ్రేట్’ చిత్రం ఘంటసాల వేంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందింది.
కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల సావిత్రమ్మ పాత్రలలో నటించగా, సుమన్ కీలక పాత్ర పోషించారు.
అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో, సి.హెచ్. రామారావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ముఖ్య అతిథి ఆదిత్య హాసన్ టీజర్‌ను లాంచ్ చేసి, డిసెంబర్ 12న విడుదల కానున్న చిత్రానికి శుభాకాంక్షలు తెలిపారు.
‘ఘంటసాల ది గ్రేట్’ విడుదల వివరాలు
సినీ సంగీత ప్రపంచంలో ఘంటసాల వేంకటేశ్వరరావు (ఘంటసాల) గురించి తెలియని వారు ఉండరు. ఇప్పుడు ఆయన జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ‘ఘంటసాల ది గ్రేట్’(Ghantasala the Great) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మాణ సారథ్యంలో సి.హెచ్. రామారావు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేయబోతోన్నారు.
ఈ క్రమంలో శనివారం నాడు ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను ముఖ్య అతిథిగా హాజరైన ఆదిత్య హాసన్ లాంఛ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. ‘‘ఘంటసాల’ స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ మూవీని ప్రతీ ఒక్కరూ చూడండి. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 12న రానున్న ఈ సినిమాను అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
చిత్రంలో నటీనటులు, సాంకేతిక వర్గం
టీజర్ లాంచ్: ఆదిత్య హాసన్ వ్యాఖ్యలు
సంగీత మాంత్రికుడు ఘంటసాల జీవితాన్ని చూపించనున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రం భారీ విజయం సాధించి, నేటి తరానికి ఘంటసాల గొప్పతనాన్ని తెలియజేస్తుందని ఆశిద్దాం.


