
అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘ఘాటి’ సినిమా థియేటర్లలో నిరాశపరిచిన తరువాత, ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. దసరా పండుగకు కానుకగా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
Key Points
ఘాటి సినిమా ఓటీటీ రిలీజ్ దసరా సందర్భంగా జరుగనుంది.
అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభం.
సినిమా థియేటర్లలో అనుకున్నంతగా ఆడలేదు.
అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ సినిమా ఘాటి.
ఘాటి సినిమా ఓటీటీ ప్రయాణం
ఘాటి.. భారీ అంచనాల మధ్య రిలీజైన తెలుగు యాక్షన్ డ్రామా. క్రిష్ జాగర్లమూడి, అనుష్క కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో ఫ్యాన్స్ చాలానే ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ మూవీ అసలు మెప్పించలేకపోయింది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా దసరాకే డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది.
అనుష్క శెట్టి , విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతి బాబులాంటి వాళ్లు నటించిన మూవీ ఘాటి. ఈ యాక్షన్ డ్రామా మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 2 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో ఘాటి
ఊహించినదాని కంటే ముందే డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అక్టోబర్ 2 కన్ఫమ్ అని కూడా పలు రిపోర్టులు చెబుతున్నాయి. ప్రైమ్ వీడియో కూడా త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయనుంది.
క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన సినిమా ఈ ఘాటి. అప్పుడెప్పుడో వేదం తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వచ్చింది. తూర్పు కనుమల్లో సాగే గంజాయి స్మగ్లింగ్ కథాంశం కావడం, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో మూవీపై అంచనాలు పెరిగాయి. కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.
సినిమా బాక్సాఫీస్ పనితీరు
ఘాటి ట్రైలర్ చూస్తే గంజాయి స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ అని తెలిసిపోతుంది. ఘాటి మూవీ కూడా అలాగే ఉంటుంది. పెద్దగా ఊహకందని సీన్లు, సర్‌ప్రైజ్ చేసే ట్విస్టులు ఏం కనిపించవు. అనుష్క కనిపించే సీన్స్ తప్ప పెద్దగా హై ఇచ్చే మూమెంట్స్ లేవు.
తొలి షో నుంచే మిక్స్‌డ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. తొలి వారం ఇండియా నెట్ కలెక్షన్లు రూ.7 కోట్ల లోపే ఉన్నాయి. దీంతో మూవీ మేకర్స్ కు నష్టాన్నే మిగిల్చింది. ఈ సినిమా ఫెయిల్యూర్ దెబ్బకు అనుష్క కూడా కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్లు ఈ మధ్యే అనౌన్స్ చేసింది. మరి అక్టోబర్ 2న ప్రైమ్ వీడియోలోకి రాబోతున్న ఈ సినిమాకు ఓటీటీలో అయిన ఆదరణ దక్కుతుందో లేదో చూడాలి.
ఘాటి సినిమా థియేటర్లలో నిరాశపరిచినప్పటికీ, ఓటీటీలో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. అక్టోబర్ 2 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.


