|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఘాటి రివ్యూ.. గంజాయి స్మగ్లర్‌గా అనుష్క క్రైమ్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Published: 05-09-2025, 9:45 AM
ఘాటి రివ్యూ.. గంజాయి స్మగ్లర్‌గా అనుష్క క్రైమ్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘ఘాటి’ సినిమా గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో అనుష్క శెట్టితో పాటు విక్రమ్ ప్రభు, చైతన్య రావు నటించారు.

Key Points

1

అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన క్రైమ్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్.

2

గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగే కథ.

4

ఊహించని ట్విస్టులు లేకపోవడం ఒక లోటు.

కథా నేపథ్యం

నటీనటులు: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతి బాబు, రవీంద్ర విజయ్ తదితరులు

కథ: చింతకింది శ్రీనివాసరావు

దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి

సంగీతం: నాగవెళ్లి విద్యాసాగర్

సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి కాటసాని

ఎడిటింగ్: చాణక్య రెడ్డి, వెంటక్ ఎన్ స్వామి

సినిమా ప్రతిబింబం

నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి, వంశీకృష్ణరెడ్డి, ప్రమోద్ కుమార్

విడుదల తేది: సెప్టెంబర్ 5, 2025

అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతి బాబు , రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించిన లేటెస్ట్ తెలుగు సినిమా ఘాటి. చాలా కాలం తర్వాత హీరోయిన్ సెంట్రిక్ సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఘాటికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.

ప్రమోషనల్ కంటెంట్‌తో ఎన్నో అంచనాలు పెంచేసిన ఘాటి సినిమా సెప్టెంబర్ 5న అంటే ఇవాళ థియేటర్లలో విడుదలైంది. డైరెక్టర్ క్రిష్ స్నేహితుడు రాజీవ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ఘాటి రివ్యూ లో తెలుసుకుందాం.

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని తూర్పు కనుమల్లో గంజాయి సామ్రాజ్యం నడుస్తుంటుంది. దానిని కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), కుందల నాయుడు (చైతన్య రావు పాలిస్తుంటారు. వారికింద పని చేస్తూ గంజాయి తరలించే కూలీలను ఘాటీలు అంటారు. ఆ ఘాటీలుగా దేశీ రాజు (విక్రమ్ ప్రభు), శీలావతి (అనుష్క శెట్టి) ఇద్దరు చేరుతారు.

ఆ తర్వాత ఏం జరిగింది? దేశీ రాజు, శీలావతికి కాష్టాల నాయుడు, కుందల నాయుడు వల్ల జరిగిన నష్టం ఏంటీ? గంజాయిని అరికట్టాలనుకున్న దేశీ రాజు, శీలావతి అదే వృత్తిలోకి ఎందుకు దిగారు? బాధితురాలు అయిన శీలావతి క్రిమినల్‌గా ఎలా మారింది? చివరికి ఏమైంది? వంటి విషయాలు తెలియాలంటే ఘాటి చూడాల్సిందే.

బలాలు మరియు బలహీనతలు

ఘాటి ట్రైలర్ చూస్తే గంజాయి స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ అని తెలిసిపోతుంది. ఘాటి మూవీ కూడా అలాగే ఉంటుంది. పెద్దగా ఊహకందని సీన్లు, సర్‌ప్రైజ్ చేసే ట్విస్టులు ఏం కనిపించవు. అయితే, పాత్రల పరిచయంతో సినిమా ప్రారంభం బాగానే ఉంది. ఘాటిలు, వారు చేసే పని అంతా ఇంట్రెస్టింగ్‌గానే చూపించారు.

అయితే, వీటికి కాస్తా టైమ్ కూడా తీసుకున్నారు. దాంతో కథలోకి వెళ్లేందుకు చాలా సమయం తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ అంతా జనజీవన స్రవంతిలోకి వచ్చి సాధారణ పనులు చేసుకునే దేశీ రాజు, శీలావతి మళ్లీ గంజాయ్ స్మగ్లింగ్ బారిన ఎందుకు పడ్డారు అనేది ఇంట్రెస్టింగ్‌గా చూపించారు.

విలన్‌తో ఏర్పడై వైరం, ప్రతినాయకులు క్రూయాలిటీ అంతా బాగా చూపించారు. అయితే, ఇదంతా ఒక రెగ్యులర్ ఫార్మాట్‌లోనే సాగుతుంది. అనుష్క కనిపించే సీన్స్ తప్పా పెద్దగా హై ఇచ్చే మూమెంట్స్ కనిపించవు. పెద్దగా ట్విస్టులు ఉండవు. ఊహించినట్లుగానే సినిమా అంతా సాగిపోతుంది. క్లైమాక్స్ పర్వాలేదు.

పుష్ప, పుష్ప 2 సినిమాలు స్మగ్లింగ్‌తో ఎలా రాజు అయ్యాడు అని చూపిస్తే ఘాటి గంజాయి వల్ల జరిగే అనార్థాలను చూపించింది. ఇక అనుష్క పర్ఫామెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. యాక్షన్, ఎమోషన్ సీన్లలో అదరగొట్టింది. ఆమెకు తోడు విక్రమ్ ప్రభు యాక్టింగ్ హైలెట్‌గా నిలిచింది. రవీంద్ర విజయ్ విలనిజం బాగా పండింది.

మరో విలన్‌గా చైతన్య రావు పర్వాలేదనిపించాడు. మిగతా నటీనటులు పరిధి మేర మెప్పించారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సాంకేతి నిర్మాణ విలువలు బాగున్నాయి. డైరెక్టర్ క్రిష్ టేకింగ్ పర్వాలేదు. సాయి బుర్రా మాధవ్ డైలాగ్స్, బీజీఎమ్ మెప్పించేలా ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే అనుష్క ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చే ఘాటి.

ఘాటి సినిమాలో అనుష్క శెట్టి నటన బాగుంది, కానీ కథలో కొత్తదనం లేకపోవడం, ఊహించని ట్విస్టులు లేకపోవడం లోటు. అయినా, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.