
📌 Key Points
- ‘ఘూస్‌ఖోర్ పండిట్’ టైటిల్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నెటిజన్లు, బ్రాహ్మణ సంఘాలు!
- టైటిల్ ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని ఆరోపణలు, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు!
- స్పందించిన దర్శకుడు నీరజ్ పాండే.. మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలుపుతూ ప్రకటన విడుదల!
- వివాదాస్పద టీజర్, ప్రమోషనల్ కంటెంట్‌ను సోషల్ మీడియా నుండి తొలగిస్తున్నట్లు ప్రకటన!
మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నీరజ్ పాండే దర్శకత్వంలో వస్తున్న ‘ఘూస్‌ఖోర్ పండిట్’ చిత్రం టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదం కారణంగా మూవీ టీమ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
టైటిల్‌పై అభ్యంతరం తెలిపిన నెటిజన్లు, బ్రాహ్మణ సంఘాలు
మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee)ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే (Neeraj Pandey)తెరకెక్కిస్తున్న పవర్‌ఫుల్ పోలీస్ డ్రామా ‘ఘూస్‌ఖోర్ పండిట్’(Ghuskhor Pandit). నీరజ్ పాండే మార్క్ గ్రిప్పింగ్ నరేషన్, మనోజ్ బాజ్‌పాయ్ అద్భుతమైన నటనతో రూపొందుతున్న ఈ చిత్రంపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌తో ఈ సినిమా టైటిల్ చుట్టూ అనూహ్యంగా వివాదం చెలరేగింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ఈ సినిమా టైటిల్‌లో ‘ఘూస్‌ఖోర్’ (లంచగొండి) అనే పదానికి ‘పండత్’ అనే పదాన్ని చేర్చడం ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ నెటిజన్లు, బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో నీరజ్ పాండే స్పందిస్తూ.. ‘‘మా సినిమా ఒక కల్పిత పోలీస్ డ్రామా. ఇందులో ‘పండత్’ అనేది కేవలం ఒక కల్పిత పాత్రకు పెట్టిన వాడుక పేరు మాత్రమే.
క్షమాపణలు చెప్పిన దర్శకుడు నీరజ్ పాండే
ఈ కథ ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాలు, అతని ప్రవర్తన చుట్టూ తిరుగుతుంది తప్ప, ఏ కులాన్ని, మతాన్ని లేదా వర్గాన్ని కించపరచేలా ఉండదు. బాధ్యతాయుతమైన ఫిల్మ్ మేకర్‌గా ఎవరినీ కించపరచాలనే ఉద్దేశ్యం మాకు లేదు. ఎవరి మనోభావాలైనా దెబ్బతీసేలా ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా వివాదాస్పదంగా మారిన టీజర్‌తో పాటు అన్ని రకాల ప్రమోషనల్ కంటెంట్‌ను సోషల్ మీడియా, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ హ్యాండిల్స్ నుంచి ప్రస్తుతానికి తొలగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సినిమాను దాని పూర్తి నేపథ్యంలో చూసినప్పుడే అసలు ఉద్దేశ్యం అర్థమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.మొత్తానికి ఈ వివరణతో వివాదం సర్దుమణుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ప్రమోషనల్ కంటెంట్ తొలగిస్తున్నట్లు ప్రకటన
A post shared by Neeraj Pandey (@neerajpofficial)
‘ఘూస్‌ఖోర్ పండిట్’ టైటిల్ వివాదం సద్దుమణుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


