|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీ తెలుగు సిరీస్ నుంచి సాంగ్ రిలీజ్.. సోషల్ మీడియా ఫ్రీక్వెంట్ పదాలతో గిబిలి గిబిలి పాట.. మరో 6 రోజుల్లో స్ట్రీమింగ్!

Published: 01-08-2025, 8:47 PM
ఓటీటీ తెలుగు సిరీస్ నుంచి సాంగ్ రిలీజ్.. సోషల్ మీడియా ఫ్రీక్వెంట్ పదాలతో గిబిలి గిబిలి పాట.. మరో 6 రోజుల్లో స్ట్రీమింగ్!

అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల నటనతో తెరకెక్కిన ‘మోతెవరి లవ్ స్టోరీ’ ఓటీటీ సిరీస్ ‘గిబిలి గిబిలి’ అనే పాటను విడుదల చేసింది. సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన పదాలతో రూపొందిన ఈ పాట రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.

Key Points

1

మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ సిరీస్ నుంచి ‘గిబిలి గిబిలి’ పాట విడుదల.

2

సోషల్ మీడియాలో ఫ్రీక్వెంట్‌గా ఉపయోగించే పదాలతో పాట రచన.

4

ఆగస్టు 8న జీ5 లో సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభం.

గ్రామీణ నేపథ్యంతో మోతెవరి లవ్ స్టోరీ

అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే ఓటీటీ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మై విలేజ్ షో యూట్యూబ్ సిరీస్‌తో పాపులర్ అయిన అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు.

మోతెవరి లవ్ స్టోరీ సిరీస్‌కు మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మాత‌లుగా వ్యవహరించారు. ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోందని ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో తెలుస్తోంది.

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా శుక్ర‌వారం (ఆగస్టు 1) నాడు మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ సిరీస్ నుంచి ‘గిబిలి గిబిలి’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. హీరోయిన్‌కు త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను హీరో వ్య‌క్తం చేసే క్ర‌మంలో ‘గిబిలి గిబిలి’ పాట వ‌స్తుంది.

గిబిలి గిబిలి పాట విడుదల

సోష‌ల్ మీడియా లో ఫ్రీక్వెంట్‌గా ఉప‌యోగించే ప‌దాల‌తో ఈ పాట‌ను రాయ‌టం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. మ‌ల్లెగోడ గంగ ప్ర‌సాద్ రాసిన ఈ పాట‌ను టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. చ‌ర‌ణ్ అర్జున్ ఈ సిరస్‌కు సంగీతాన్ని అందించారు.

అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో న‌టించిన ఈ ఓటీటీ కామెడీ సిరీస్‌కు శ్రీకాంత్ అరుపుల సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా, చ‌ర‌ణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తున్నారు. అనీల్ గీల ఎడిట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇకపోతే మర ఆరు రోజుల్లో మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

జీ5 లో స్ట్రీమింగ్

ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5 ఒరిజినల్ సిరస్‌గా మోతెవరి లవ్ స్టోరీ రానుంది. ఆగస్ట్ 8న జీ5లో మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ రిలీజ్ కానుంది. కాగా, జీ5 ఓటీటీ భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది జీ5 ఓటీటీ .

జీ5 ఓటీటీలో హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ వంటి 12 భాషల్లో కంటెంట్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో భాగంగానే ఆగస్టు 8 నుంచి తెలుగులో మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

మొత్తానికి, ‘మోతెవరి లవ్ స్టోరీ’ సిరీస్ ఆకర్షణీయమైన ప్రచారంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆగస్టు 8న జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభం అవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.