|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భర్తకు 11 కఠిన షరతులు: నెటిజన్లను షాక్ చేసిన యువతి డిమాండ్లు!

Published: 07-07-2026, 12:21 AM
భర్తకు 11 కఠిన షరతులు: నెటిజన్లను షాక్ చేసిన యువతి డిమాండ్లు!
  • నెలకు కనీసం రూ.2 లక్షలు సంపాదించాలి.
  • 6 అడుగుల ఎత్తు, అందంగా ఉండాలి, వంట చేయడం తప్పనిసరి.
  • సోషల్ మీడియా, మహిళా స్నేహితులు అస్సలు ఉండకూడదు.
  • లైవ్ లొకేషన్ షేర్ చేయాలి, ఫారిన్ ట్రిప్పులకు తీసుకెళ్లాలి.

ఈ రోజుల్లో పెళ్లి అనేది యువతకు పెద్ద సవాలుగా మారింది. తమకు కాబోయే భాగస్వామి గురించి యువతీయువకులు కొన్ని అంచనాలు పెట్టుకుంటారు. అయితే, ఒక యువతి పెళ్లి కోసం పెట్టిన 11 షరతులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె డిమాండ్లను చూసి నెటిజన్లు షాక్‌కు గురయ్యారు.

యువతి పెట్టిన 11 షరతులు

ఈ రోజుల్లో సరైన సంబంధం దొరికి పెళ్లి కావడం అంటేనే యువతకు పెద్ద టాస్క్‌లా మారిపోయింది. తమకు కాబోయే భాగస్వామి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని యువకులు, యువతులు కొన్ని అంచనాలు పెట్టుకోవడం సహజమే. కానీ, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక యువతి పెళ్లి కోసం వరుడికి పెట్టిన రూల్స్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆమె డిమాండ్ల లిస్ట్ చూసి ‘ఇలాంటి వాడు భూమ్మీద దొరకడు.. వేరే గ్రహం మీద వెతుక్కోవాల్సిందే’ అని సెటైర్లు వేస్తున్నారు.

ఎక్స్ (ట్విట్టర్)లో (Vedhika) ‘వేదిక’ (@Crustology_) అనే యూజర్ తన కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి ఒక పోస్ట్ పెట్టింది. ‘నేను ఇలాంటి వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను’ అంటూ ఏకంగా 11 కండిషన్స్ ఉన్న ఒక జాబితాను షేర్ చేసింది.

*నెలకు కనీసం రూ.2 లక్షలు సంపాదించాలి.

*సహజంగానే అందంగా (Handsome) ఉండాలి.

*సరిగ్గా 6 అడుగుల (6’0″) ఎత్తు ఉండాలి.

నెటిజన్ల షాకింగ్ స్పందన

*వంట చేయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

*మహిళలను గౌరవించేవాడై ఉండాలి (Non-misogynist).

*సోషల్ మీడియా అస్సలు వాడకూడదు.

*అతనికి ఎలాంటి మహిళా స్నేహితులు (Female friends) ఉండకూడదు.

సోషల్ మీడియాలో వైరల్ డిమాండ్లు

*ఎక్కడికి వెళ్లాలన్నా ముందుగా నా పర్మిషన్ అడగాలి.

*రోజుకు 24 గంటల పాటు తన లైవ్ లోకేషన్ నాకు షేర్ చేస్తూనే ఉండాలి.

*నన్ను ఫారిన్ ట్రిప్పులకు తీసుకువెళ్లాలి.

ఈ షరతులన్నీ విధించిన ఆ యువతి, చివర్లో ‘ఇలాంటి అబ్బాయి నాకు ఎక్కడ దొరుకుతాడు?’ అంటూ అమాయకంగా ఒక ప్రశ్న కూడా వేసింది. జూలై 1, 2026న పోస్ట్ చేసిన ఈ ట్వీట్‌కు క్షణాల్లోనే వేలాది వ్యూస్ (75.3K Views), లైక్స్, రిట్వీట్లు వస్తున్నాయి. యువతి పెట్టిన షరతులు చూసిన నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా వాడకూడదు అంటున్నావు.. మరి నీ పోస్ట్ ఆ అబ్బాయికి ఎలా రీచ్ అవుతుంది?’ అని ఒకరు ప్రశ్నించగా.. ‘నువ్వు అడిగిన క్వాలిటీస్ ఉన్నవాడు మనిషి అయి ఉండడు, ఎందుకంటే అలాంటి వ్యక్తులు దొరకడం కష్టం అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఈ యువతి పెట్టిన షరతులు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇలాంటి డిమాండ్లు ఎంతవరకు సమంజసం, ఆచరణీయం అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది నేటి యువత ఆలోచనలకు అద్దం పడుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.