|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Global Summit 2025: సినిమా రైజింగ్‌ సెషన్‌.. సీఎం రేవంత్‌ రెడ్డితో సినీ ప్రముఖుల భేటి!

Published: 09-12-2025, 7:48 AM
Global Summit 2025: సినిమా రైజింగ్‌ సెషన్‌.. సీఎం రేవంత్‌ రెడ్డితో సినీ ప్రముఖుల భేటి!
  • గ్లోబల్ సమ్మిట్ 2025లో సీఎం రేవంత్‌ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ.
  • ‘సినిమా రైజింగ్’ సెషన్ ‌లో తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చ.
  • ఫ్యూచర్ సిటీలో స్టూడియోల ఏర్పాటు, స్థానిక నైపుణ్యాల శిక్షణకు సీఎం సూచన.
  • అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, జెనిలియా తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ 2025లో ‘సినిమా రైజింగ్’ సెషన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించి, ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

గ్లోబల్ సమ్మిట్‌లో సినీ ప్రముఖుల భేటీ

Tolllywood Meets CM Revanth Reddy: ‘ తెలంగాణ రైజింగ్’ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్‌ సమ్మిట్‌లో పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు . సోమ , మంగళ వారాలు రెండు రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్ ‌ లో రెండో రోజు ( మంగళవారం ) రైజింగ్ ‌ సినిమా పేరుతో ప్రత్యేక సెషన్ ‌ నిర్వహించారు . ఇందులో భాగంగా మంగళవారం జరిగిన సమ్మట్ లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు సమ్మిట్లో సమావేశం అయ్యారు.

సినిమా రైజింగ్ పేరుతో నిర్వహించిన ఈ సెషన్ లో అల్లు అరవింద్ ‌, సురేష్ ‌ బాబు , దిల్ ‌ రాజు , నటి జెనిలియా , అక్కినేని అమల , సుప్రీయ , రాహుల్ ‌ రవింద్రలు పాల్గొనని సీఎంతో చర్చించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ ‌ రెడ్డిలు కూడా పాల్గొన్నారు . ఇందులో రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు . సినీ పరిశ్రమకు తెలంగాణను ఒక గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

తెలంగాణలో సినీ పరిశ్రమకు సీఎం హామీ

సమ్మిట్‌కు వచ్చిన సినీ సెలబ్రెటీలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, భట్టి, ఉత్తమ్ #TelanganaRisingGlobalSummit2025 #TelanganaGlobalSummit #TelanganaRisingGlobalSummit #TelanganaRising #globalsummit2025 #CMRevanthreddy pic.twitter.com/CIDqoUnfAK

— BIG TV Cinema (@BigtvCinema) December 9, 2025

ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు, శిక్షణపై చర్చ

సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా, 24 క్రాఫ్ట్స్‌లో స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సినీ ప్రముఖులకు సీఎం సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సినీ బృందాలు స్క్రిప్ట్‌తో వస్తే, సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తానికి ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చేసేందుకు, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక నైపుణ్యాలను పెంచే విషయంలో ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించగలదని భావిస్తున్నారు. ఇక ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హెలికాఫ్టర్ లో రావడం విశేషం.

ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందేందుకు, మౌలిక సదుపాయాలు, స్థానిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించగలదని, భవిష్యత్తులో పరిశ్రమకు కొత్త దిశానిర్దేశం చేస్తుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.