
మడ్డీ సినిమా విజయవంతమైన తర్వాత, దర్శకుడు డా. ప్రగభల్ ‘జాకీ’ చిత్రంతో మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. మదురైలోని సాంప్రదాయ గోట్స్ ఫైట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రియల్ లోకేషన్స్ లో సహజసిద్ధంగా చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
Key Points
డా. ప్రగభల్ దర్శకత్వంలో 'జాకీ' చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది.
మదురై సాంప్రదాయ గోట్స్ ఫైట్ నేపథ్యంలో సినిమా కథ అల్లుకుంది.
రియల్ లోకేషన్స్ లో, సహజసిద్ధంగా చిత్రీకరించినట్లు మేకర్స్ తెలిపారు.
నటీనటులు గోట్స్ సంరక్షకులతో కలిసి ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
‘మడ్డీ’ డైరెక్టర్ కొత్త ప్రయోగం
భారతీయ సినిమాలో తొలిసారిగా మట్టి రేసింగ్ నేపథ్యంలో రూపోందిన మడ్డీ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అదే విజయోత్సాహంతో మరింత ఆసక్తికరమైన కథాంశంతో, ప్రేక్షకులకు థ్రిల్ ను పంచడానికి డా. ప్రగభల్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం జాకీ. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయింది.
వినుత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోట్స్ ఫైట్ ఆసక్తికరంగా ఉండబోతుందని అర్థం అవుతుంది. ముఖ్యంగా మదురైలో సాంప్రదాయంగా కొనసాగుతున్న ఈ గోట్ ఫైట్ చుట్టు అల్లుకున్న కథ అని తెలుస్తుంది. కేవలం ఫైట్స్ మాత్రమే కాదు అద్భుతమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థం అవుతుంది. రియల్ లోకేషన్స్ లో చిత్రీకరించడమే కాకుండా 2022 నుంచి అక్కడి సాంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి అదే ప్రాంతంలో ఉన్నట్లు డైరెక్టర్ తెలిపారు.
‘జాకీ’ కథాంశం: మదురై గోట్స్ ఫైట్
సహజసిద్దంగా చిత్రీకరించేందుకు అక్కడి ప్రజలతో మమేకమై, ప్రతీది తెలుసుకొని జాగ్రత్తగా షూట్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాదు సినిమా కావాల్సిన ప్రతీ అంశాన్ని జోడించి ఎంతో గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే ను సెట్ చేసినట్లు పేర్కొన్నారు. అందుకోసం నటీనటులు గోట్స్ సంరక్షకులతో కొద్దిరోజులు సవాసం చేసి, వారితో, గోట్స్ తో అనుబంధం పెంచుకున్నట్లు మేకర్స్ తెలిపారు.
రియల్ లోకేషన్స్, నటుల సన్నద్ధత
నటీనటులు అద్భుతమైన ప్రదర్శనతో ఆద్యాంతం కట్టిపడేస్తారని, ఫైట్ సన్నివేశాలకోసం శారీరంగా, మానసికంగా రెడీ అయ్యారని అందుకే ప్రతీ సన్నివేశం అద్భుతంగా వచ్చిందని మేకర్స్ తెలిపారు. ముఖ్యంగా గోట్ సంరక్షకుల భావోద్వేగాలు కట్టిపడేస్తాయని, అలాగే మదురైలో ఉన్న ఈ సంస్కృతి ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధంచి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు.
‘జాకీ’ చిత్రం కేవలం పోరాట సన్నివేశాలు మాత్రమే కాకుండా, అద్భుతమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది. ఈ వినూత్న ప్రయోగం సినిమా రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశిద్దాం.


