|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

G.O.A.T: G.O.A.T మూవీ నుంచి “ఒడియమ్మ” సాంగ్.. లవ్ మెలోడీతో అదరగొట్టేసిన సుధీర్

Published: 29-11-2025, 10:07 PM
G.O.A.T: G.O.A.T మూవీ నుంచి “ఒడియమ్మ” సాంగ్.. లవ్ మెలోడీతో అదరగొట్టేసిన సుధీర్

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న G.O.A.T చిత్రం నుంచి “ఒడియమ్మ” అనే మొదటి సాంగ్ విడుదలైంది. జీవీ ప్రకాష్ కుమార్ లాంచ్ చేసిన ఈ లవ్ మెలోడీ సాంగ్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Key Points

1

సుడిగాలి సుధీర్ హీరోగా, దివ్యభారతి హీరోయిన్‌గా G.O.A.T సినిమా వస్తోంది.

2

క్రికెట్ నేపధ్యంలో కామెడీ ప్రధాణంగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది.

4

లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు.

G.O.A.T మూవీ విశేషాలు

G.O.A.T: సుడిగాలి సుధీర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ G.O.A.T(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం)(G.O.A.T). జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్ లో మొగుళ్ళ చంద్రశేఖర్ గారి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తోంది. క్రికెట్ నేపధ్యంలో కామెడీ ప్రధాణంగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ “ఒడియమ్మ” అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ తమిళ సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ ఈ పాటను అదిరిపోయే లవ్ మెలోడీ గా కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ వాయిస్ ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. సురేష్ బనిసెట్టి లిరిక్స్ హీరో ఎమోషన్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాయి. దీంతో ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి లేట్ ఎందుకు ఆ లవ్ మెలోడీ సాంగ్ విని మీరు కూడా ఎంజాయ్ చేయండి.

Varanasi: వారణాసి నుంచి క్రేజీ న్యూస్.. హనుమంతుడిగా తమిళ హీరో.. తెలుగులో ఎవరు చేయలేరా..

“ఒడియమ్మ” సాంగ్ విడుదల వివరాలు

పాటకి వస్తున్న స్పందన

మొత్తంగా, G.O.A.T సినిమా నుంచి వచ్చిన “ఒడియమ్మ” లవ్ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సుధీర్ ఎమోషన్స్, అనురాగ్ కులకర్ణి వాయిస్ పాటకు మరింత వన్నె తెచ్చాయి. ఈ పాట సినిమాపై అంచనాలను పెంచింది అనడంలో సందేహం లేదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.