
తాజాగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న తమిళ హీరో అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా గత నెలలో విడుదలై హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.
Key Points
అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా హిట్ అయింది.
ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.
సినిమాలో అజిత్ యొక్క పాత పాటలు, వింటేజ్ స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తెలుగులో కూడా విడుదలైనప్పటికీ, ఓటీటీలో మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది.
అజిత్ కుమార్ హిట్ మూవీ ఓటీటీలోకి
రీసెంట్ గా పద్మ భూషణ్ అవార్డ్ అందుకున్న తమిళ హీరో అజిత్. ఈయన నటించిన లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie). యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. గత నెలలో రిలీజై హిట్ అయింది. ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీ(OTT) స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. అధికారిక తేదీ కూడా ప్రకటించారు.
తమిళ హీరోల్లో అజిత్(Ajith Kumar) కాస్త డిఫరెంట్. సినిమాలు, కారు రేసింగ్ అని తన పనేదో తాను చూసుకుంటూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో అజిత్ సినిమాలు చేస్తున్నాడు హిట్ అవుతున్నాయి గానీ ఫ్యాన్స్ ఎందుకో పూర్తిగా సంతృప్తి చెందడం లేదు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు పూర్తిగా ఫ్యాన్ మూమెంట్స్ తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తీశారు.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ విడుదల తేదీ ప్రకటన
ఈ మూవీలో అజిత్ పాత సినిమా పాటలు, వింటేజ్ స్టైల్ తదితర అంశాలు అజిత్ అభిమానులకు తెగ నచ్చేశాయి. దీంతో హిట్ చేసేశారు. నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్ కావడంతో తెలుగులోనూ రిలీజ్ చేశారు. కానీ ఏమంత గొప్పగా ఆడలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్ లో మే 08 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ విషయానికొస్తే.. ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ (అజిత్) తన గ్యాంగ్ స్టర్ జీవితాన్ని వదిలేసి కుటుంబంతో హ్యాపీగా ఉండాలనుకుంటాడు. అందుకోసం జైలుకి కూడా వెళ్తాడు. కొడుకు కోసం ఏడాది ముందే జైలు నుంచి బయటకొస్తాడు. అంతలోనే కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారనే సంగతి తెలుస్తుంది. అలానే డ్రగ్స్ కేసులోనూ ఇరుక్కున్నాడనే సంగతి తెలుస్తుంది. దీంతో ఏకే మళ్లీ గ్యాంగ్ స్టర్ అవుతాడు? తర‍్వాత కొడుకుని ఎలా కాపాడుకున్నాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.
చివరగా, అజిత్ కుమార్ నటన, పాత పాటలు, వింటేజ్ స్టైల్ తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా చూడొచ్చు.


