|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTT Movie: ‘ద బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్

Updated: 12-11-2025, 12:12 AM
OTT Movie: 'ద బెంగాల్ ఫైల్స్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్

వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం ‘ద బెంగాల్ ఫైల్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. 1947 నాటి భారత్-పాక్ విభజన కథాంశంతో రూపొందిన ఈ సినిమా సెప్టెంబరు 21 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వివరాలను ఇప్పుడు చూద్దాం.

Key Points

1

'ద బెంగాల్ ఫైల్స్' సినిమా సెప్టెంబరు 5న థియేటర్లలో విడుదలైంది.

2

ఈనెల 21 నుంచి జీ5 ఓటీటీలో హిందీ భాషలో స్ట్రీమింగ్ కానుంది.

4

గాంధీ, జిన్నా పాత్రలు, హిందూ-ముస్లిం ఘర్షణలు ఇందులో ప్రధానాంశాలు.

‘ద బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ వివరాలు

తాష్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ సినిమాలతో వివాదాస్పద దర్శకుడిగా వివేక్ అగ్నిహోత్రి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన చివరి చిత్రం ‘ద బెంగాల్ ఫైల్స్’. 1947లో ఇండియా-పాక్ విభజన బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందే చర్చనీయాంశమైన చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

‘ద బెంగాల్ ఫైల్స్’ సినిమా సెప్టెంబరు 5న థియేటర్లలోకి వచ్చింది. దాదాపు మూడున్నర గంటల నిడివితో దీన్ని తీశారు. తొలి రెండు చిత్రాల్లానే ఇది కూడా జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ కాబోతుంది. ఈనెల 21 నుంచి హిందీ భాషలో అందుబాటులోకి రానుంది.

1947 విభజన కథాంశం: వివాదాస్పద అంశాలు

‘ద బెంగాల్‌ ఫైల్స్’ విషయానికొస్తే.. 1947వ సంవత్సరంలో భారత్-పాక్ ఎలా విడిపోయాయి. ఈ విషయంలో గాంధీ ఎలాంటి పాత్ర పోషించారు. అప్పుడు హిందువులు, ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు చేలరేగాయి. ఎవరు ఎవరిని ఎందుకు చంపారు. ఈ అనర్థాలన్నీ ఎందుకు జరిగాయనేది ఈ సినిమా స్టోరీ.

వివేక్ అగ్నిహోత్రి: వివాదాస్పద దర్శకుడిగా

ప్రధానంగా భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయే సమయంలో గాంధీ, మహమ్మద్ అలీ జిన్నాని ఇదంతా వద్దని అంటారు. జిన్నా మాత్రం.. ముస్లింలు ఎప్పుడూ ముస్లింలే, హిందూ ముస్లిం భాయ్ భాయ్ కాదు అని అంటాడు. తర్వాత జిన్నా మనుషులు అప్పటి దేశ రాజధాని అయిన కలకత్తాలో మారణహోమం సృష్టిస్తారు. హిందూ స్త్రీలని, మహిళలని, చిన్నపిల్లలని చూడకుండా దారుణంగా కాల్చి చంపేస్తారు. ఇలాంటి సమయంలో మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటీషర్లు ఏం చేశారు? ముస్లింలపై భారతీయులు ఎలా తిరుగుబాటు చేశారు? తమని తాము ఎలా కాపాడుకున్నారనే అంశాల్ని ఇందులో చూపించారు.

‘ద బెంగాల్ ఫైల్స్’ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, దాని వివాదాస్పద కథాంశం చాలామందికి ఆసక్తి కలిగిస్తోంది. ఓటీటీలో ఈ చిత్రం ఎలాంటి స్పందనను పొందుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.