|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలయ్య ‘అఖండ 2’ OTT వచ్చేస్తోంది! ఎప్పుడో తెలుసా? డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?

Updated: 05-01-2026, 11:02 PM
బాలయ్య 'అఖండ 2' OTT వచ్చేస్తోంది! ఎప్పుడో తెలుసా? డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
  • నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ డిసెంబర్ 12న విడుదలై భారీ విజయాన్ని సాధించింది.
  • ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
  • సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
  • ‘అఖండ 2’ OTT విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ OTT రిలీజ్ డేట్ ఖరారైంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో అఖండ 2 స్ట్రీమింగ్ కానుంది. దీనిపై పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

అఖండ 2: బాక్సాఫీస్ వద్ద భారీ విజయం

నందమూరి బాలయ్య లేటెస్ట్ గా నటించిన సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను, నందమూరి బాలయ్య కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చింది. డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. నందమూరి బాలయ్య ఈ మూవీలో హీరోగా చేయగా సంయుక్త మీనన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆది పినిశెట్టి విల‌న్ గా మెరిశారు. హిందుత్వం, సనాతన ధర్మం చుట్టూ ఈ కథాంశం ఉన్న నేపథ్యంలో జనాలకు బాగానే నచ్చింది.

అంతేకాదు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు కూడా రాబట్టిందట‌ ఆఖండ 2. అయితే అలాంటి అఖండ 2 సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైందట. జనవరి 9వ తేదీన ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారట. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు టాక్ నడుస్తోంది.

OTT రిలీజ్ డేట్, ప్లాట్‌ఫారమ్ వివరాలు

అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందంటే?

అఖండ 2 OTT రిలీజ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. జనవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అందుబాటులోకి వస్తుందని వార్తలున్నాయి. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూద్దాం. బాలయ్య అభిమానులకు ఇది గొప్ప సంక్రాంతి కానుక అవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.