
నటి గౌరీ కిషన్, యూట్యూబర్ కార్తీక్ మధ్య ‘బాడీ షేమింగ్’ వివాదం ఇంకా సద్దుమణగలేదు. తన బరువు గురించి అడిగినందుకు కార్తీక్ క్షమాపణ చెప్పినా, దానిని అంగీకరించడానికి గౌరీ నిరాకరించింది. తన ప్రశ్నకు గౌరీ తప్పుగా అర్థం చేసుకుందని కార్తీక్ అనడం సరికాదని గౌరీ స్పష్టం చేసింది. ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశం ఉంది.
Key Points
గౌరీ కిషన్ బరువెంత అని యూట్యూబర్ కార్తీక్ ప్రశ్నించడంతో వివాదం చెలరేగింది.
కార్తీక్ క్షమాపణ చెప్పినా, 'తప్పుగా అర్థం చేసుకుంది' అనడంపై గౌరీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
'నా ఈ సారీని అంగీకరించట్లేదు' అంటూ కార్తీక్ వీడియోని రీట్వీట్ చేసిన గౌరీ.
మూవీ అసోసియేషన్ చర్యలు తీసుకునే వరకు గౌరీ ఈ వివాదాన్ని వదిలిపెట్టేలా లేదు.
గౌరీ కిషన్ బరువు వివాదం: అసలేం జరిగింది?
తమిళ హీరోయిన్ గౌరీ కిషన్‌ని ‘మీ బరువెంత?’ అని ఓ యూట్యూబర్ అడగడం, దానికి గౌరీ రిటర్న్ కౌంటర్ ఇవ్వడం మీకు తెలిసే ఉంటుంది. మూడు నాలుగు రోజుల క్రితం ఈ వివాదం జరగ్గా.. గౌరీ ఓ నోట్ రిలీజ్ చేయడం, దీనికి ప్రతిగా సదరు యూట్యూబర్ కార్తీక్ క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేయడంతో సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ ఈ విషయాన్ని గౌరీ ఇంకా వదలట్లేదు. తాజాగా చేసిన ట్వీట్ ఇందుకు ఉదాహరణ.
‘జవాబుదారీతనం లేని క్షమాపణ అసలు క్షమాపణే కాదు. మరీ ముఖ్యంగా.. ఆమె నా ప్రశ్నని తప్పుగా అర్థం చేసుకుంది. ఇది కేవలం సరదాగా అడిగాను. నేను ఎవరినీ బాడీ షేమింగ్ చేయలేదు’ లాంటి మాటలు మాట్లడటం అస్సలు కరెక్ట్ కాదు. ఈ సారీని నేను అంగీకరించట్లేదు’ అని గౌరీ కిషన్.. యూట్యూబర్ కార్తీక్ వీడియోని రీట్వీట్ చేసింది. ఇదంతా చూస్తుంటే సదరు యూట్యూబర్‌పై మూవీ అసోసియేషన్ ఏదైనా చర్య తీసుకునే వరకు గౌరీ విచిచిపెట్టదేమో అనిపిస్తుంది.
యూట్యూబర్ క్షమాపణను అంగీకరించని గౌరీ
గౌరీ కిషన్ విషయానికొస్తే.. ’96’ సినిమాలో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్ర తెలుగు రీమేక్ ‘జాను’లోనూ నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు మూవీస్‌లో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ బాడీ షేమింగ్ వివాదం కూడా గౌరీ లేటెస్ట్ మూవీ ‘అదర్స్’ ప్రెస్ మీట్ సందర్భంగానే జరిగింది.
తదుపరి చర్యలకు సిద్ధమవుతున్న గౌరీ కిషన్?
మొత్తానికి, గౌరీ కిషన్ ఈ వివాదాన్ని సీరియస్‌గా తీసుకుంది. యూట్యూబర్ కార్తీక్ వ్యాఖ్యలపై సినిమా అసోసియేషన్ చర్యలు తీసుకునే వరకు ఆమె వదిలిపెట్టేలా లేదు. ఈ అంశం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయంశంగా మారింది, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.

