
కరోనా తర్వాత ఓటీటీలు ప్రజలకు వినోదాన్ని అందిస్తున్నాయి. కానీ కొన్ని ఓటీటీలు అశ్లీల కంటెంట్ ప్రసారం చేయడంతో ప్రభుత్వం 24 ప్లాట్‌ఫామ్‌లను బ్యాన్ చేసింది. ఈ నిర్ణయంపై విస్తృత చర్చ జరుగుతోంది.
Key Points
24 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ప్రభుత్వం నిషేధం విధించింది.
శృంగార కంటెంట్ ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలతో ఈ చర్య.
ప్రైమ్ లైట్‌తో సహా అనేక ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు బ్యాన్ లిస్ట్‌లో ఉన్నాయి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం మరియు భారతీయ న్యాయ సంహిత ప్రకారం చర్యలు తీసుకోబడ్డాయి.
24 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రభుత్వం నిషేధం
కరోనా తర్వాత ఆడియెన్స్‌కు యమ ఎంటర్ట్‌టైన్‌మెంట్‌ను అందించిన ఏకైక ప్లాట్‌ఫామ్ ఓటీటీ . ఈ ఓటీటీలో విభిన్న జోనర్లలో, హద్దులు దాటిన భాషలతో ఎన్నో రకాల కంటెంట్ ప్రేక్షకులు ఇంట్లోకి వచ్చి చేరింది. ఓటీటీలకు అలవాటు పడిన భాషా బేధం లేకుండా కంటెంట్‌ను ఆదరించారు.
అయితే, కొన్ని ఓటీటీలు మాత్రం విచ్చలవిడిగా శృంగార కంటెంట్‌ను ప్రసారం చేయడం సాగాయి. అలా కుప్పలుతెప్పలుగా బోల్డ్ కంటెంట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎక్కువయ్యాయి. అలాగే, ఓటీటీల్లో కూడా శృంగార సీన్లు ఎక్కువగా ఉండే కంటెంట్ ఇటీవల కాలంలో అధికంగా స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి.
శృంగార కంటెంట్ ఆరోపణలు
ఇలా సాఫ్ట్ పోర్న్, అశ్లీల, బోల్డ్ కంటెంట్ ను ప్రసారం చేసే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఏకంగా 24 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఓటీటీల్లో సాఫ్ట్ పోర్న్, అశీల, అడల్ట్, సెమీ న్యూడ్ కంటెంట్ స్ట్రీమింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు అధికమయ్యాయి.
ఈ ఆరోపణ నేపథ్యంలో చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యాప్స్, వెబ్‌సైట్స్‌తో కలిపి 24 ఓటీటీలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఇవాళ శుక్రవారం (జూలై 25) దేశంలోని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అందరికీ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
చట్టపరమైన చర్యలు
కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 67, 67ఏ, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 294, మహిళలను అసభ్యకరంగా చూపించడాన్ని తప్పు బడుతూ సెక్షన్ 4 కింద ఈ 24 ఓటీటీ సైట్స్‌ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ 24 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఏఎల్ టీ (ఆల్ట్) బాలాజీ, యూఎల్ ఎల్ యూ (ఉల్లు), బిగ్ షాట్స్ యాప్ , దేశిఫ్లిక్స్ , బూమెక్స్ , నవరస లైట్ , గులాబ్ యాప్, ప్రైమ్ లైట్, హిట్ ప్రైమ్, కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, లుక్ ఎంటర్‌టైన్‌మెంట్, షోఎక్స్, అడ్డా టీవీ, హాట్ఎక్స్ వీఐపీ, హల్‌చల్ యాప్, మూడ్ఎక్స్, ట్రిఫ్లిక్స్, ఫెనియో, నియోన్ఎక్స్ వీఐపీ, ఫుగీ, మోజ్‌ఫ్లిక్స్ ఉన్నాయి.
అశ్లీల కంటెంట్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్య ఇది. ఇది భవిష్యత్తులో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.


