|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Guess The Actor: హీరోగా తెలుగు సినిమాలు.. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో

Published: 18-05-2025, 8:52 AM
Guess The Actor: హీరోగా తెలుగు సినిమాలు.. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో

డాక్టర్ కావాలనుకున్న వ్యక్తి హీరో అయ్యాడు. స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సుధీర్ బాబు, ‘ఏ మాయ చేశావె’తో అడుగుపెట్టి ‘ఎస్ఎమ్ఎస్’ తో హీరో అయ్యాడు. ఇప్పుడు నటుడు, నిర్మాతగా వెలుగుచూస్తున్నాడు.

Key Points

1

సుధీర్ బాబు: బ్యాడ్మింటన్ ప్లేయర్ నుండి తెలుగు సినిమా హీరో!

2

'ఏ మాయ చేశావె' తో ఇండస్ట్రీ ఎంట్రీ, 'ఎస్ఎమ్ఎస్' తో హీరోగా!

4

మహేష్ బాబు సోదరి ప్రియదర్శినిని వివాహం చేసుకుని ఇద్దరు కొడుకులు.

బ్యాడ్మింటన్ నుండి సిల్వర్ స్క్రీన్ వరకు

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది అంటూ ఉంటారు. అయితే ఇతడు మాత్రం స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్.. స్టేట్ లెవల్ కి ఆడాడు. కానీ మరి మనసు ఎక్కడ మారిందో ఏమో గానీ హీరో అయిపోయాడు. ప్రస్తుతం నటిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఇంతలా చెప్పాం కదా ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సుధీర్ బాబు. ‘ఏ మాయ చేశావె’లో సమంతకు అన్నగా యాక్ట్ చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ‘ఎస్ఎమ్ఎస్’ మూవీతో హీరోగా మారాడు. సమ్మోహనం, ప్రేమకథాచిత్రమ్ తదితర సినిమాలతో హిట్స్ కొట్టాడు. తర్వాత నుంచి చాలా మూవీస్ చేస్తున్నాడు గానీ ప్రేక్షకుల్ని అలరించలేకపోతున్నాడు.

వ్యక్తిగత విషయానికొస్తే మహేశ్ బాబు సోదరి ప్రియదర్శినిని సుధీర్ బాబు.. సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్లలో పెద్దోడు తండ్రి బాటలో హీరో అయ్యే పనిలో బిజీ ఉన్నాడు.

సుధీర్ బాబు సినిమా ప్రయాణం

మరోవైపు సుధీర్ బాబు నటుడి కాకముందు బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ప్రముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి అప్పట్లో డబుల్స్ ఆడాడు. తన స్నేహితుడు బయోపిక్ లో సుధీర్ బాబు నటిస్తాడనే రూమర్స్ వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఎందుకో అలా ఆలస్యమవుతూ వస్తోంది.

వ్యక్తిగత జీవితం మరియు కుటుంబం

సరే ఈ ఫొటో విషయానికొస్తే.. తన తొలి ఫొటోషూట్ లో తీసుకున్న పిక్ ఇది అని సుధీర్ బాబు తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన చాలామంది ఇప్పటికి అప్పటికీ ఎంత మార్పో అని మాట్లాడుకుంటున్నారు.

సుధీర్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, భవిష్యత్తులో మరింత విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.