|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ: ఒక్క పరుగు తేడాతో సంచలనం!

Published: 08-04-2026, 3:05 PM
ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ: ఒక్క పరుగు తేడాతో సంచలనం!
  • గుజరాత్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఒక్క పరుగు తేడాతో విజయం
  • గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించాడు
  • KL రాహుల్ 92 పరుగులు చేసినా ఢిల్లీ ఓటమి తప్పలేదు
  • చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం

ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ భారీ స్కోరు చేసింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

IPL 2026 సీజన్లో గుజరాత్ బోణీ కొట్టింది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచులో ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలైనప్పటికీ.. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. GT కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (70), జోస్ బట్లర్ (52), వాషింగ్టన్ సుందర్ (55) హాఫ్ సెంచరీలు సాధించారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫోర్లు, సిక్సులు బాది ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు.

ఇక 211 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ.. చివరి వరకూ పోరాడి 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి, కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. KL రాహుల్(92) పరుగులు చేయగా.. చివర్లో వచ్చిన డేవిడ్ మిల్లర్ (41) మెరుపులు మెరించినా లాభం లేకుండా పోయింది. చివరి బతి వరకు టెన్షన్ గా సాగిన ఈ మ్యాచులో గుజరాత్ విజయం సాధించి, ఈ సీజన్లో తొలి గెలుపు ఖాతా తెరిచింది.

గుజరాత్ బ్యాటింగ్ విధ్వంసం: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన గిల్

చివరి వరకు పోరాడినా ఓటమిపాలైన ఢిల్లీ

చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించడం గొప్ప విషయం. ఢిల్లీ బ్యాటింగ్ లో రాణించినా ఫలితం లేకుండా పోయింది. గుజరాత్ తమ ప్రస్థానాన్ని విజయంతో ప్రారంభించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.