
గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో, మనోజ్ మరియు బాలు మధ్య ఫర్నిచర్ షాప్ పేరు విషయమై తీవ్రమైన విభేదనం ఏర్పడుతుంది. బాలు మనోజ్‌ను బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు, మీనా బాలు తన తల్లిపై ఉన్న అపారమైన ప్రేమను బయటపెడుతుంది.
Key Points
బాలు మనోజ్‌ను ఫర్నిచర్ షాప్ పేరు విషయంలో బ్లాక్ మెయిల్ చేస్తాడు.
షాప్‌కు తన తల్లి పేరు పెట్టాలని బాలు పట్టుబడుతున్నాడు.
మీనా బాలు తన తల్లితో ఉన్న ప్రేమను బయటపెడుతుంది.
బాలు యొక్క బ్లాక్ మెయిల్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో బాలు చూపించిన ఫర్నిచర్ షాప్ సత్యం కుటుంబం మొత్తానికి నచ్చుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఫర్నిచర్ షాప్‌కి ఏ పేరు పెట్టాలో మనోజ్, రోహిణి డిస్కస్ చేసుకుంటుంటారు. మీ నాన్న పేరు పెడతాం అని రోహిణి ని మనోజ్ అంటాడు.
డబ్బులు మా నాన్న ఇవ్వలేదుగా అని రోహిణి అంటే.. అలా అయితే కల్పన పేరు పెట్టాలి అని మనోజ్ అంటాడు. దాంతో మనోజ్‌ను ఒక్కటి కొడుతుంది రోహిణి. మనోజ్ కిందపడతాడు. కల్పన పేరు పెట్టాలనడానికి సిగ్గు లేదా అని రోహిణి అంటే సరదాగా అన్నాను అని మనోజ్ అంటాడు. మనోజ్ కింద పడిన సౌండ్ విని బాలు అన్న గదికి వస్తాడు.
షాప్‌కు అత్తయ్య పేరు ప్రభావతి అని పెడదామని రోహిణి అంటుంది. వద్దు. అమ్మ పేరు పెడితే కలిసి రాదు. నీ పార్లర్, మీనా పూల కొట్టు రెండు పోయాయి. కావాలంటే మంచి చీర కొనిద్దాం. కానీ, పేరు వద్దని మనోజ్ అంటాడు. దొరికావురా అని ఆ మాటలను బాలు రికార్డ్ చేస్తాడు. వెంటనే మనోజ్ గదిలోకి వెళ్తాడు బాలు.
అది మీనా చూసి ఎప్పుడు లేనిది అన్న గదిలోకి ఈయన వెళ్తున్నారేంటీ అని మీనా వెనుక వెళ్తుంది. ఏరా లక్షలు మింగినోడా. కడుపుకు అన్నం తింటున్నావా, గాడిదలా పేపర్లు తింటున్నావా. ఊరికే మనోజ్‌ను ఎందుకు అంటున్నావ్ అని రోహిణి అంటుంది. షాప్ గురించి చెప్పావు కదా అని ఓవర్ చేయకు అని మనోజ్ అంటాడు.
ఫర్నిచర్ షాప్ పేరు వివాదం
షాప్‌కు ఏ పేరు పెట్టాలనుకుంటున్నావ్ అని బాలు అంటాడు. అది మేము చూసుకుంటాం. నీకెందుకురా అని మనోజ్ అంటాడు. నేను చెప్పిన పేరు మాత్రమే షాప్‌కి పెట్టాలని బాలు అంటాడు. ఏ పేరు పెట్టాలి అని రోహిణి అడుగుతుంది. ప్రభావతి అని పేరు పెట్టాలని తల్లి పేరు చెబుతాడు బాలు. దాంతో మనోజ్ షాక్ అవుతాడు.
అమ్మ పేరు పెట్టనని మనోజ్ అంటాడు. దాంతో మనోజ్ మాట్లాడింది రికార్డ్ చేసింది వినిపిస్తాడు బాలు. ఇంట్లో అందరికంటే ప్రేమ నీమీదే చూపిస్తుందిరా అమ్మ. మా కంటే ఎక్కువగా నిన్నే ఇష్టపడుతుంది. నువ్ ప్రయోజకుడివి కావాలని ఎంతగానో కోరుకుంది. అలాంటి అమ్మ పేరే నువ్వు వద్దంటున్నావా అని బాలు ఫైర్ అవుతాడు.
నువ్వు ఏమైనా చెప్పురా నేను అమ్మ పేరు పెట్టను. అది కలిసిరాదు అని మనోజ్ అంటాడు. నువ్ అమ్మ పేరు పెట్టకుంటే నువ్ మాట్లాడింది మొత్తం అమ్మకు వినిపిస్తాను. అప్పుడు నీకు ఉంటది అని మనోజ్‌ను బాలు బ్లాక్ మెయిల్ చేస్తాడు. మరోవైపు భోజనం చేసే సమయంలో ఫర్నిచర్ షాప్‌కు ఏ పేరు పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు తన పేరు పెట్టాలని అనలేదని ప్రభావతి ఫీల్ అవుతుంది.
మీనా ప్రతిస్పందన
తన పేరును మనోజ్ పెడతాను అని చెప్పకపోవడం, రోహిణి కూడా మాట్లాడకపోవడంతో పెద్ద కొడుకు, కోడలిపై ప్రభావతి అలుగుతుంది. మరోవైపు బాలు మాటలు విన్నట్లు చెప్పిన మీనా భర్తతో మాట్లాడుతుంది. మీకు అత్తయ్యకు క్షణం పడదు. ఆవిడ మిమ్మల్ని తిట్టడం, మీరు ఆవిడను రెచ్చగొట్టడం ఇదే కదా మీ పని. ఆవిడ మీద మీ మనసులో ఎంత ప్రేమను దాచుకున్నారో అని మీనా అంటుంది.
అమ్మ చేత్తో అన్నం తినాలని ఆశగా ఉంటుంది. కానీ, అనుకున్నవన్నీ జరగవు కదా. అప్పుడప్పుడు శత్రువులా చూస్తుంది. అంత మాత్రానా ఆమె నాకు అమ్మ కాకుండా పోతుందా. నన్ను దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకోకుండా ఉంటుందా అని ఆశతో ఎదురుచూస్తున్నాను మీనా అని బాలు అంటాడు.
తల్లి మీద బాలుకున్న ప్రేమను అలా మీనా బయటపెడుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
చివరకు, బాలు తన తల్లి ప్రేమను ఉపయోగించి మనోజ్‌ను బ్లాక్ మెయిల్ చేసి తనకు కావాల్సిన విధంగా పరిస్థితిని మార్చుకుంటాడు. ఈ సంఘటనలు సీరియల్‌కు మరింత ఉత్కంఠను జోడిస్తాయి.


