|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు: పాటతో కుక్కలు పరార్ – తల్లి కాబోతున్న మౌనిక – బాలు ముద్దుతో షాక్!

Published: 26-02-2026, 11:36 PM
గుండె నిండా గుడి గంటలు: పాటతో కుక్కలు పరార్ - తల్లి కాబోతున్న మౌనిక - బాలు ముద్దుతో షాక్!
  • గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో బాలు అతి ప్రవర్తనతో సంజు షాక్!
  • ప్రభావతి పాటతో కుక్కలు పారిపోయాయి, సెట్‌లో నవ్వులు!
  • మౌనిక త్వరలో తల్లి కాబోతుందనే వార్త, కుటుంబంలో ఆనందం!
  • మీనా బుగ్గపై బాలు ముద్దు, రోహిణి అసూయతో రగిలిపోయింది!

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో సరికొత్త సంచలనం! ఎపిసోడ్‌లో ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. బాలు ప్రవర్తన, మౌనిక వార్త, ప్రభావతి పాట అన్నీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ప్రభావతి పాటకి కుక్కలు పారిపోయిన సీన్ వైరల్!

Gunde Ninda Gudi Gantalu Serial February 27th Episode: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 27 ఎపిసోడ్‌లో యాగం, బొమ్మల కొలువు జరుగుతుంది. సంజుకు బావగా బాలు బాగా మర్యాదలు చేస్తుంటాడు. యాగం తర్వాత మౌనిక తల్లి కాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభావతి పాటకు అంతా దడుసుకుంటారు. మీనా బుగ్గపై బాలు ముద్దు పెడతాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు ఫోన్‌కు మీనా కాల్ చేస్తుంది. రోహిణి కట్ చేస్తుంది. ఇంతలో మౌనిక వాళ్లు వస్తారు. దాంతో అటు చూసి వాళ్ల దగ్గరికి వెళ్తారు. సంజుతో బాగా ఉండమని బాలుకు చెబుతుంది మీనా. సత్యం, ప్రభావతి పరామర్శిస్తే వెటకారంగా మాట్లాడుతాడు సంజు.

బాలు గదిలోకి వెళ్లి అద్దం ముందు సంజుతో ఎలా మర్యాదగా మాట్లాడాలో ప్రాక్టీస్ చేస్తాడు. ఏది వర్కౌట్ కాదు. ఇంతలో బాలు అంతరాత్మ వచ్చి నీతో ఏది కాదంటుంది. నువ్వు చేసింది మీ బావ ఎందుకు మర్చిపోతాడు. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసిన నువ్వు సారీ చెప్పలేవు. నీ మొహంలో అది కనిపించదు. నీ బావ ఏం చేసినా కొట్టకుండా పంపించు అది చాలు అని బాలు అంతరాత్మ అంటుంది.

మరోవైపు బాలు ఫోన్ ప్రభావతి డ్యాన్స్ స్కూల్ స్టూడెంట్ మయూకకు దొరుకుతుంది. అందులో వీడియోలు చేస్తుంది. మరోవైపు యాగంలో జంటలు అంతా కూర్చొంటారు. పాప దగ్గర ఫోన్ చూస్తారు రోహిణి, విద్య. నేను వెళ్లి తీసుకొస్తానని విద్య వెళ్తుంది. హోమంలో సమిధలు వేయమని పంతులు చెబితే.. ముందుగా మా బావ గారెతో వేయించండి అని బాలు అంటాడు.

మౌనిక తల్లి కాబోతుందనే వార్తతో కుటుంబంలో ఆనందం!

ఇన్ని రోజులు చేసిన తప్పులను క్షమించండి. ఈ జ్యూస్ తాగండి అని బాలు అంటాడు. సంజు తీసుకుంటాడు. మౌనిక వచ్చి మా అన్నయ్య నిజంగానే మర్యాద ఇస్తున్నాడని మౌనిక అంటుంది. ఫోన్ కోసం రోహిణి వెళ్తే.. ఇంటికి పెద్ద కోడలివి. నువ్వు కూడా వడ్డించాలని ప్రభావతి చెబుతుంది. అంతా భోజనం చేస్తుంటారు. మయూక ఫోన్ చూస్తూ తింటుంది.

అది చూసిన రోహిణి వెళ్లి ఫోన్ అడుగుతుంది. మయూక ఇవ్వదు. నేను దొంగలకు ఇవ్వనంటుంది. సంజుకు అది వేసుకో ఇది వేసుకో అని మర్యాదలు చేస్తుంటాడు బాలు. అవి తట్టుకోలేకపోతాడు సంజు. ఇంతలో పాప వేరే చోటుకు వెళ్లి కూర్చొంటుంది. నీ దగ్గర ఫోన్ ఉండే కదా ఏది అని రోహిణి అడిగితే.. ఒక అంకుల్ తీసుకున్నాడు. నాకు ఐస్ క్రీమ్ ఇచ్చి తీసుకున్నాడని మయూక చెబుతుంది.

అతన్ని బాలు పంపించేస్తాడు. ఇంతలో బాలు తల్లిని ఆపి.. సత్యంతో ఇంత బీభత్సం జరుగుతుంటే వన్స్ మోర్ అంటావేంటీ నాన్న అని అంటాడు. చెవిలో దూది తీసి ఏంట్రా అని సత్యం అంటాడు. దాంతో అందరికి అర్థమై నవ్వుతారు. నీకున్న తెలివి మాకు లేక బలి అయిపోయామని బాలు అంటాడు. ఒకరినొకరు పాడమంటారు. పాడు పార్లరమ్మా అని బాలు అంటాడు.

అది పాడు పార్లరమ్మ అని తిట్టినట్టుందని మనోజ్ అంటాడు. ఇలాంటి వాటిలో మా మీనా బాగా పాడుతుందని పార్వతి అంటుంది. పోయి పోయి అదే పాడాలని ప్రభావతి అంటుంది. ప్రభావతి పాట వల్ల అందరి చెవుల్లో రక్తం వచ్చింది, కుక్కలు పారిపోయాయి, పిల్లలకు జ్వరం వచ్చిందని బాలు చెబుతాడు. మీనాతో బాలు పాట పాడిస్తాడు.

మీనా బుగ్గపై బాలు ముద్దు, సీరియల్‌లో కొత్త ట్విస్ట్!

మీనా చేసిన ప్రసాదం వల్లే ఇదని ప్రభావతి అంటుంది. కామాక్షి కోప్పడుతుంది. సుశీల మౌనికకు గాలి ఆడనిచ్చేలా విషయం అడుగుతుంది. దాంతో సత్యం నువ్వు తాతవి కాబోతున్నావురా అని మౌనిక ప్రెగ్నెంట్ అని, తల్లి కాబోతున్నట్లు చెబుతుంది సుశీల. దాంతో అంతా సంతోషిస్తారు. ప్రభావతిని అమ్మమ్మ గారు అంటూ కామాక్షి, సత్యం అంటారు.

నీలకంఠం చెప్పిన ప్లాన్ ఫెయిల్ అవుతుందని సంజు భయపడతాడు. అందరం గ్రూప్ ఫొటో తీసుకుందామని తీస్తాడు బాలు. ఇంతలో మయూక వచ్చి రోహిణితో నాకు ఐస్‌క్రీ ఇచ్చి ఫోన్ తీసుకుంది ఆ అంకులే అని బాలును చూపిస్తుంది. తన ఫోన్ బాలుకే తిరిగి వెళ్తుంది. సంజు, మౌనిక వెళ్తుంటారు. సంజుకు బావ మొదటిసారిగా థ్యాంక్స్ చెబుతున్నా. చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని ఎమోషనల్‌గా చెబుతాడు బాలు.

మౌనిక తల్లి కాబోతున్నందుకు సంతోషంగా ఉందని మీనా చెబుతుంది. మౌనిక కొడుకును నేనే ఆడిస్తాను, నా కారులో బుల్లి సీటు పెట్టుకుని తిప్పుతాను అని బాలు అంటాడు. మరి ఇంత చేసిన నాకు ఏమిస్తారు అని మీనా అంటుంది. నీకు డైమండ్ ఇస్తాను. వజ్రం లాంటి కూతురును అని బాలు అంటాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో రోజుకో ట్విస్ట్! బాలు ప్రవర్తన ఎటు దారి తీస్తుందో చూడాలి. మౌనిక తల్లి కాబోతుండటం శుభపరిణామం. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.