
📌 Key Points
- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో ఊహించని ట్విస్ట్: ప్రభావతి మనోజ్‌ను కొట్టింది!
- సత్యంకు ఉద్యోగం ఇచ్చిన బాలు ప్లాన్: రంగ ద్వారా నిజం తెలుసుకున్న సత్యం!
- సుగుణ వేరే ఊరికి వెళ్లడం, బాలు అనుమానం: చింటు జీవితంలో రహస్యం దాగుందా?
- బాలు ఎమోషనల్ సీన్: ప్రేక్షకులను కట్టిపడేసిన ఎపిసోడ్!
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అభిమానులకు షాకింగ్ న్యూస్! ఈరోజు ఎపిసోడ్‌లో ఊహించని సంఘటనలు జరిగాయి. ప్రభావతి మనోజ్‌ను చెప్పుతో కొట్టడం, బాలు ఎమోషనల్ అవ్వడం హాట్ టాపిక్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం రండి!
ప్రభావతి ఫైర్: మనోజ్‌ను చెప్పుతో కొట్టిందా?
Gunde Ninda Gudi Gantalu Serial April 16th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 16వ ఎపిసోడ్‌లో బాలు వేసిన ప్లాన్ సత్యంకు తెలుస్తుంది. చాలా ఎమోషనల్‌గా బాలును హగ్ చేసుకుంటాడు. సుగుణ ఊరికి వెళ్లిన బాలు కాల్ చేస్తే సుగుణ కోపంగా మాట్లాడుతుంది. చింటు జీవితంలో రహస్యం ఉందని బాలు డౌట్ పడతాడు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సత్యం ఇంకా ఇంటికి రాలేదని ప్రభావతి బాధగా ఎదురుచూస్తుంటుంది. బాలు సెటైర్లు వేస్తాడు. ఇంతలో సత్యం వస్తాడు. ప్రభావతి తెగ సంతోషిస్తుంది. ఉద్యోగం దొరికిందని సత్యం చెబుతాడు. ఏం జాబ్ అని అడుగుతారు. పార్కులో పిల్లలకు నీతి కథలు చెప్పాలని సత్యం చెబుతాడు.
కట్ చేస్తే పిల్లలకు సత్యం నీతి కథలు చెబుతాడు. పంచ తంత్రం కథలు చెబుతాడు. పిల్లలకు చెబుతుంటే తల్లిదండ్రులు కూడా వచ్చి వింటారు. ఇలాంటి కథలు చెప్పేవాళ్లు కరువైపోయారు. అలాంటిది ఇంతమంది పిల్లలను పోగేసి చెబుతున్నారు. పైగా ఫ్రీగా చెబుతున్నారు అని ఒకావిడ అంటుంది. దాంతో సత్యం అనుమానిస్తాడు. ఫ్రీగానా మరి అడ్వాన్స్ ఎలా వచ్చిందని సత్యం అనుకుంటాడు.
ఇంతలో రంగా వస్తాడు. నాకు పనిపాట లేదని నాకు ఫ్రీగా డబ్బు ఇచ్చావా. స్నేహంలో దాపరికాలు ఉండవు అని సత్యం అంటాడు. నీకు బాలు లాంటి కొడుకు ఉండటం అదృష్టంరా అని ఇదంతా బాలు ప్లాన్ పని అని, నువ్ కష్టపడకూడదని ఇలా చేశాడని రంగా నిజం చెప్పేస్తాడు. చింటు వాళ్ల ఊరికి ట్రిప్ కోసం బాలు వెళ్తాడు. ప్యాసెంజర్స్‌ను దింపిన తర్వాత చింటు వాళ్ల ఇంటికి వెళ్తాడు బాలు. ఇంటికి తాళం వేసి ఉంటుంది.
బాలు ఎమోషనల్: కారణం ఏమిటి?
విద్య వెళ్లి చెక్ చేసి వస్తుంది. లేడని చెబుతుంది. ఇప్పుడు అక్కడ ఉండటం లేదు, వేరే ఊరికి వచ్చామని చెబుతుంది సుగుణ. ఏ ఊరు, ఎక్కడ అని బాలు అడిగితే.. సుగుణను కోపంగా మాట్లాడమని రోహిణి చెబుతుంది. దాంతో బాలుపై తెగ కోప్పడుతుంది సుగుణ. బాలు బాధపడుతాడు. తను అలా మాట్లాడే మనిషి కాదు. నాకు ఎక్కడో తేడా కొడుతుందని బాలు డౌట్ పడతాడు.
మరోవైపు మీనా ఇంట్లో వంట చేస్తుంది. బాలు వెళ్లి ఇంటికి నువ్వు అన్నపూర్ణ అని అంటాడు. తర్వాత సుగుణ వేరే ఊరికి వెళ్లడం గురించి, సుగుణ అన్న మాటలు అన్ని చెబుతాడు బాలు. అప్పుడే రోహిణి వస్తుంది. బాలు మాటలు వింటుంది రోహిణి. సుగుణ అలా మాట్లాడటంపై బాలు, మీనా ఇద్దరు డౌట్ పడతారు. నాకెందుకో చింటు జీవితంలో ఏదో రహస్యం ఉంది. అది మనకు తెలియకూడదని వాళ్లు అనుకుంటున్నారు. దుబాయిలో ఉన్న వాళ్ల అమ్మే ఇలా చేస్తుందనుకుంటా. ఆవిడ ఇక్కడే ఉండి ఉంటుందని బాలు అంటాడు.
అంతా వస్తారు. ఎన్నో రోజులు కథలు చెబితే 3 లక్షలు వస్తాయని ప్రభావతి అంటుంది. కథలు చెప్పడమే కదా చాలా ఈజీ పని అని మనోజ్ అంటాడు. బాలు వచ్చి సెటైర్లు వేస్తాడు. సత్యం డల్‌గా ఉండటంతో ఏమైంది అని అడుగుతాడు బాలు. నీ కష్టాన్ని నా కష్టార్జీతంగా చెప్పుకోవాలంటే చాలా కష్టంగా ఉందిరా అని బాలును చాలా ప్రేమగా హగ్ చేసుకుంటాడు సత్యం. అంతా షాక్ అవుతారు.
సుగుణ రహస్యం: బాలు డౌట్ నిజమేనా?
మా నాన్న నీ కొడుకుగా పుడుతాననేవాడురా. అప్పుడప్పుడు నీ రూపంలో నాకు నాన్న పుట్టాడనిపించేది. కానీ ఈసారి చాలా నమ్మకంగా అనిపిస్తుంది. మా నాన్న మళ్లీ పుట్టాడురా. నాన్నకే నాన్న. నాకు పని కల్పించి ఆ పనికి నువ్వే డబ్బులు ఇప్పిస్తున్నావ్. ఎందుకురా ఇంత ప్రేమ నేనంటే.. వీళ్లకే ఎక్కువ చేశాను కదరా. నీకే తక్కువ చేశాను అని సత్యం అంటాడు. అమ్మ పక్కన పెడితే అమ్మ ప్రేమ కూడా నువ్వే చూపించావుగా నాన్న అని బాలు ఎమోషనల్‌గా చెబుతాడు.
మా నాన్న పిచ్చిగానీ, ఆయనేమైనా ఐఏఎస్ చదివాడా. ఈ వయసులో సెక్యురిటీ గార్డ్ లాంటి ఉద్యోగాలు తప్పా ఇంకేం దొరుకుతాయ్ అని మనోజ్ హేళనగా అంటాడు. దాంతో ప్రభావతి వచ్చి కోపంగా మనోజ్ చెంప చెల్లుమనిపిస్తుంది. సచ్చినోడా. వాడికి నాకు ఒక్క క్షణం కూడా పడదురా. కానీ, కన్నతల్లిని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో వాడిని చూసి నేర్చుకో. నేను చేసిన అప్పును తీర్చేందుకు నా భర్త ఉద్యోగం చేస్తానంటే ఎగతాళి చేస్తావా అని తిడుతుంది ప్రభావతి.
చెప్పు తెగేదాకా కొడతా.. ఊర కుక్క అని మనోజ్ దుమ్ము దులిపి పోతుంది ప్రభావతి. సత్యం చేసినదాన్ని మంచి అనుభూతిగా అనిపించిందని మీనాతో చెబుతాడు బాలు. మీ తండ్రికొడుకుల బంధం చూసి ఒక్కసారి కుళ్లుకున్నాను. ఇంట్లో అందరు కుళ్లుకున్నారు అని మీనా చెబుతుంది. ఇద్దరు సత్యం గురించి, బంధాల గురించి మాట్లాడుకుంటారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. రాబోయే ఎపిసోడ్స్‌లో ఎలాంటి ట్విస్టులు ఉంటాయో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


