|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు: శివ అరెస్ట్! పార్వతి షాక్! గుణ కుట్ర!!

Published: 26-03-2026, 12:35 AM
గుండె నిండా గుడి గంటలు: శివ అరెస్ట్! పార్వతి షాక్! గుణ కుట్ర!!
  • గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో షాకింగ్ ట్విస్ట్: శివ దొంగతనం వీడియో వైరల్!
  • ప్రభావతి ఆగ్రహం: శివను చెప్పుతో కొట్టిన సీన్, మీనా ఫైర్!
  • గుణ ప్లాన్: శివ మనసులో బావపై విషం నింపే ప్రయత్నం!
  • పార్వతి కుప్పకూలింది: దొంగతనం గురించి తెలిసి షాక్!

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అభిమానులకు ఇది ఒక షాకింగ్ న్యూస్! కథలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. శివ అరెస్ట్ అవ్వడం, పార్వతి కుప్పకూలిపోవడం, గుణ కుట్రలు పన్నడంతో కథ ఉత్కంఠగా మారింది.

శివ దొంగతనం వీడియో లీక్!

Gunde Ninda Gudi Gantalu Serial March 26th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 26 ఎపిసోడ్‌లో ప్రభావతికి శివ దొంగనతనం వీడియో రోహిణి చూపిస్తుంది. దాంతో పార్వతి ఇంటికి వెళ్లి శివతాండవం చేస్తుంది ప్రభావతి. మీనా వాళ్లకు కూడా దొంగతనం గురించి చెబుతుంది ప్రభావతి. దాంతో పార్వతి కుప్పకూలిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ్‌కు ప్రభావతి పనిష్‌మెంట్ ఇస్తే గుంజీలు తీస్తాడు. ఇంతలో రోహిణి వచ్చి పిలుస్తుంది. మీరు మోసపోయారని రోహిణి చెబుతుంది. మీనా, బాలు మోసం చేశారని రోహిణి అంటే.. వాళ్లు మోసం చేయరని రాసిస్తానంటుంది కామాక్షి.

ఇవాళ నా ప్రళయతాండవం చూస్తావని రోహిణిని పార్వతి ఇంటికి తీసుకెళ్తుంది ప్రభావతి. మరోవైపు శివను గుణ ఆపుతాడు. లవ్ శివ, నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా. ఇప్పుడు నువ్వు సెలబ్రిటీవి అని దొంగతనం చేసిన వీడియోను శివకు చూపిస్తాడు గుణ. ఎంత పని చేశావ్ గుణ అని కాలర్ పట్టుకుంటాడు శివ. ఈ విధంగా రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్నావా అని శివ అంటాడు.

ప్రభావతి విధ్వంసం, మీనా ఆగ్రహం

నా మొహం ఉంది. నేనేలా చేస్తాను. మీ బావే వీడియో రిలీజ్ చేశాడని గుణ చెబుతాడు. మా బావ అలా చేయడు. ఫోన్ తన దగ్గర లేదు. ఎవరో దొంగతనం చేసి లీక్ చేశారు. ఇదంతా నువ్వే చేశావనిపిస్తుందని శివ అంటాడు. నేను కూడా దొరికిపోతానుగా. మీ బావ నిన్ను మోసం చేస్తున్నాడు. ఎలాంటి దురుద్దేశం లేకుండా వీడియో డిలీట్ చేసి ఉండొచ్చుగా అని శివ మనుసులో విషం నింపుతాడు గుణ .

ఇంతలో శివ వస్తాడు. తండ్రిని చూసి బాధపడుతాడు. ఇంతలో పార్వతి ఇంటికి ప్రభావతి, రోహిణి వస్తారు. నీ ఇంట్లో ఎంతమంది దొంగలు ఉన్నారు. నీ తమ్ముడు ఎక్కడ అని ప్రభావతి అడుగుతుంది. శివను చూసి కోపంతో రగిలిపోయిన ప్రభావతి లాక్కొస్తుంది. శివను దారి కాసి దొంగతనం చేస్తావా అని తిడుతుంది, కొడుతుంది ప్రభావతి. శివ తాండవం చేస్తుంది ప్రభావతి. మీనా, పార్వతి ఆపుతారు.

నాకు వచ్చే కోపానికి చెంపదెబ్బ సరిపోదు, చెప్పుతో కొట్టాలని ఎడా పెడా చెప్పుతో కొడుతుంది ప్రభావతి. నా పుట్టింటివాళ్లను అవమానిస్తే ఊరుకోను అని మీనా తిరగబడుతుంది. లక్ష రూపాయలు కొట్టేశాడు. ఇందులో మీ వాటా ఎంత అని ప్రభావతి అంటుంది. ఏ తప్పు చేయనిదే కిక్కురుమనకుండా ఉంటాడా నీ తమ్ముడు అని రోహిణి అంటుంది.

గుణ పన్నాగాలు, విషం నింపే కుట్ర

శివను మీనా కూడా కొడుతుంది. తిన్న తినకున్నా ఇంట్లో ఉండమని నాన్న, కారం వేసుకుని తిన్నా తప్పు చేయొద్దని అమ్మా ఎంత చెప్పారురా. అయినా ఇలా చేశావేంటీ అని తిడుతుంది మీనా. మీకోసమే కదరా అక్కడ అన్ని అవమానాలు పడుతున్నాను అని మీనా అంటుంది. సుమతి కూడా శివను కొడుతుంది.

మీరు కొడితే ఊరుకుంటానని అనుకుంటున్నారా. వీన్ని జైలుకు పంపించందే నేను ఊరుకోను అని బయటకు లాక్కొస్తుంది ప్రభావతి. ఇలా దొంగతనం చేసిన డబ్బుతోనే సుమతి పెళ్లి చేస్తారని అందరిలో పార్వతి పరువు తీస్తుంది ప్రభావతి. మరోవైపు సత్యం ఇంటికి బాలు వస్తాడు. మీనా గురించి అడుగుతాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.