
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ప్రభావతి తన క్రూరత్వాన్ని చూపుతుంది. మీనా తండ్రి మరణం గురించి గుర్తు చేసుకుని కన్నీళ్లు పెడుతుంది. రోహిణి మరియు మనోజ్ మధ్య గొడవ జరుగుతుంది.
Key Points
ప్రభావతి, మీనా కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతుంది.
మీనా తండ్రి మరణం గురించి గుర్తు చేసుకుని మీనా, పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటారు.
సత్యం తన తప్పును ఒప్పుకుంటూ, తన నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతాడు.
ప్రభావతి, మీనా, పార్వతి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరుగుతుంది.
ప్రభావతి యొక్క కోపం
మీనా ఇంటికొస్తారు పార్వతి, సుమిత్ర. వారిపై మాటలతో విరుచుకుపడుతుంది ప్రభావతి.అసలు ఏంటి గొడవ…మీ వాడు ఏ తప్పు చేశాడని బాలు చేయి విరగొట్టాడని పార్వతిని అడుగుతుంది ప్రభావతి. రాజేష్ కోసం జరిగిన గొడవలో శివ చేయిని బాలు విరిచేశాడని సుమతి అంటుంది.
ఇది నమ్మేటట్లు ఉందా ప్రభావతి బదులిస్తుంది. శివనే చేయకూడని పని ఏదో చేసి ఉంటాడని అంటుంది. వాడు ఏ తప్పు చేయడని, చదువుకునే పిల్లాడిమీద లేనిపోని నిందలు వేయద్దని కొడుకును వెనకేసుకొస్తుంది పార్వతి. శివ గురించి ఇక్కడేం మాట్లాడొద్దని, మీరు ఎందుకొచ్చారో అది చెప్పమని తల్లితో అంటుంది మీనా.
నాకు బొట్టు పెట్టుకునే రాత లేదని వదిన అన్నారుగా…ఆ రాత చెరిగిపోయి ఏడాది అవుతుందని, సంవత్సరీకం చేస్తున్నామని సత్యంతో పార్వతి చెబుతుంది. ఆ సంవత్సరికానికి పిలవడానికే వచ్చానని కన్నీళ్లతో చెబుతుంది పార్వతి.
మీనా తండ్రి యాక్సిడెంట్‌లో ఎలా చనిపోయాడో గుర్తుచేసుకుంటాడు సత్యం. ఆ సంఘటన నుంచి తాను కోలుకోవడానికి చాలా టైమ్ పట్టిందని అంటాడు. మీనాను ఇంటి కోడలిగా తెచ్చుకునేవరకు ఆ తప్పు నన్ను వెంటాడిందని చెబుతాడు. ఆ రోజు బస్సు నేను సరిగ్గా నడిపి ఉంటే మీరు ఈ రోజు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చేది కాదని సత్యం అంటాడు. సత్యం మాటలతో మీనా, పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటారు.
ఏంటి నట్టింట్లో మీ శోకాలు…మేము క్షేమంగా ఉండటం ఇష్టం లేదా ఆపండి అని ప్రభావతి విరుచుకుపడుతుంది. చనిపోయింది మా నాన్న…ఆయన గుర్తొస్తే ఏడవకుండా ఎలా ఉంటామని అత్తకు సమాధానమిస్తుంది మీనా. నువ్వే మా ఇంటికి అరిష్టం…ఆయన చావడం వల్లే కదా..అరిష్టం నీ రూపంలో మా ఇంట్లో అడుగుపెట్టింది అని ప్రభావతి అంటుంది.
మీరు కొంచెం మర్యాదగా మాట్లాడుతారా అని సుమతి అంటుంది. ఏంటి నీకు మర్యాద ఇచ్చేది..ఈ మాత్రం ఇంట్లోకి రానిస్తున్నాం అదే గొప్ప. అలగజనానికి సత్రం అయిపోయింది నా ఇళ్లు అంటూ మాటలతో అవమానిస్తుంది.
మీనా యొక్క శోకం
తన మాటలను అడ్డుకోబోయిన సత్యంపై విరుచుకుపడుతుంది ప్రభావతి . దిక్కుమాలిన సంతనంతా నా ఇంటికి తెచ్చిపెట్టారని కోపంగా అంటుంది. మీ ఏడుపు ఏదో ఇంట్లో ఏడవకుండా ఇక్కడికొచ్చి ఇన్ని మాటలు అనిపించుకోవడం బాగుందా అని తల్లితో అంటుంది మీనా. ఇంకోసారి మా ఇంటికొస్తే గుమ్మం నుంచి మీ అమ్మను వెళ్లగొడతానని, నీకు నచ్చితే ఉండు…లేదంటే నువ్వు కూడా వాళ్లతో పాటు వెళ్లిపొమ్మని మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి.
మా అమ్మ ఏం తప్పు చేసిందని ప్రభావతిని నిలదీస్తుంది మీనా. గతిలేక ఏమన్నా మీ ఇంటికొచ్చి అడుక్కుందా అని ప్రశ్నిస్తుంది. శృతి వాళ్ల అమ్మ వస్తే, రోహిణి మావయ్య వస్తే హడావిడి చేస్తారు…కానీ మా అమ్మను మాత్రం గుమ్మం నుంచి ఎలా వెళ్లగొడతారని ప్రభావతిని నిలదీస్తుంది. సంస్కారం అంటే తెలియని వాళ్ల ఇంటికి రావొద్దని చాలా సార్లు చెప్పాను…మా అత్త మిమ్మల్ని వెళ్లగొడతానని అంటుంది. ఆ సన్మానం కూడా కావాలా అని తల్లితో అంటుంది మీనా. వెళ్లిపొమ్మని చెబుతుంది.
సభ్యత సంస్కారం లేని మనిషి మాటలు పట్టించుకోవద్దని మీనాతో అంటాడు సత్యం. ఏం మాట్లాడిన ఊరుకుంటున్నానని కదా కోడలి తల్లిని అవమానించిన చూస్తూ ఊరుకుంటే నా అంత చవట ఉండడని సత్యం అంటాడు. నలుగురి ఎదుట నీ మొగుడిని దద్దమ్మను చేయాలని అనుకుంటున్నావా అని ప్రభావతిపై కోప్పడుతాడు సత్యం. యాక్సిడెంట్ చేసి ఈ దద్దినాన్ని తెచ్చిపెట్టింది మీరు…నన్ను అంటారేంటి సత్యాన్ని కసురుకుంటూ వెళ్లిపోతుంది ప్రభావతి.
తనను అరిష్టం అంటూ ప్రభావతి అన్న మాటలు మీనా తట్టుకోలేకపోతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీ అత్తయ్య డబ్బున్న చోటే మర్యాద కురిపిస్తుందని మీనాను ఓదార్చుతాడు సత్యం. మా కోసం నువ్వు ఎవరితో గొడవ పడొద్దని మీనాతో పార్వతి అంటుంది. మీనాకు తల్లైనా, తండ్రైనా మీరే అని, దాని కాపురం నిలబడేలా చూడమని సత్యంతో చెబుతూ ఎమోషనల్ అవుతుంది పార్వతి. తాను బతికి ఉన్నంత వరకు మీనాకు కంటికి రెప్పలా కాపాడుతానని మాటిస్తాడు. బాలును సంవత్సరికానికి తాను పంపిస్తానని పార్వతితో చెబుతాడు సత్యం.
తల్లికి జరిగిన అవమానం గుర్తొచ్చి మీనా బోరున ఏడుస్తుంది. నీ ధైర్యం ఏమైపోయిందని కూతురితో పార్వతి అంటుంది. ఈ గుమ్మం ముందే సమాధి కట్టేసారని మీనా బదులిస్తుంది. నా గురించి వదిలేయమని చెబుతుంది. కనీసం మీ బాధను అర్థం చేసుకోలేక ప్రభావతి అన్న మాటలను మాత్రం తట్టుకోలేకపోయానని మీనా అంటుంది. నువ్వైనా సుఖంగా ఉంటావని అనుకుంటే నీ బతుకు అలాగే తగలబడిందని, అత్త పెడుతున్న కష్టాన్నికళ్లారా చూసి తట్టుకోలేకపోతున్నానని పార్వతి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. తల్లిని ఓదార్చుతుంది మీనా. నేను బాగానే ఉన్నానని అంటుంది.
అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. మీనా, పార్వతి కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తాడు. అల్లుడుగారు బాగున్నారా అంటూ బాలును పలకరిస్తుంది పార్వతి. కానీ బాలు సమాధానం చెప్పకుండా ఇంట్లోకి వెళ్లిపోతాడు. ఏంటక్కా కనీసం సమాధానం చెప్పకుండా బావ వెళ్లిపోతున్నాడని సుమతి అంటుంది.నేను సంవత్సరికానికి బాలును తీసుకొస్తానని తల్లికి మాటిస్తుంది ప్రభావతి.
రోహిణి మరియు మనోజ్ మధ్య గొడవ
బాలు ఇంట్లో అడుగుపెట్టగానే…పార్వతి ఎందుకొచ్చిందో కొడుకుకు చెబుతాడు సత్యం. ఒకసారి మీనా పుట్టింటికి వెళ్లిరమ్మని బాలుతో చెబుతాడు సత్యం . నేను వెళ్లలేని, వెళితే ఎవరిదో మొహం చూడాల్సివస్తుందని బాలు బదులిస్తాడు. ఆ ఇంటికి ఉన్న మొగదిక్కు నువ్వే…నువ్వు కాకపోతే ఎవరు చూసుకుంటారని బాలుకు క్లాస్ ఇస్తాడు సత్యం. నేను చెబుతున్నాను…నువ్వు వెళుతున్నావు అంతేనని అంటాడు.
సత్యం బయటకు వెళ్లగానే…మీకు కోపం వస్తే మీ దగ్గరే ఉంచుకొని…మరొకరిపై చూపించొద్దని బాలుతో అంటుంది మీనా. మా అమ్మ చెల్లి ఏం చేశారని వారితో మాట్లాడలేదని నిలదీస్తుంది. నేను మాట్లాడితే గొడవలు అవుతాయి. అందుకే సైలెంట్‌గా ఉన్నానని బాలు బదులిస్తాడు. మీరు ఏం చేశారన్నది పక్కనపెట్టి నాన్న సంవత్సరికానికి పిలవడానికి మా అమ్మ వచ్చిందని మీనా అంటుంది.
డబ్బింగ్ స్టూడియోకు వచ్చి శృతిని కలుస్తుంది శోభన. శృతి ఆర్థిక పరిస్థితి గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది శోభన. మీకు ఏమైనా మనీ ప్రాబ్లెమ్స్ ఉన్నాయా? కారులో తిరగాల్సిన నువ్వు సైకిల్‌పై ఎందుకు తిరుగుతున్నావని నిలదీస్తుంది. సైకిల్ మీద వెళితే కష్టాలు ఉన్నట్లేనా…శ్రీమంతుడు మూవీ మహేష్‌బాబు కూడా సైకిల్‌పైనే వెళతాడని లాజికల్‌లు మాట్లాడుతుంది శృతి.
సరదా కోసమే రవితో కలిసి సైకిల్ జర్నీ చేశామని తల్లితో చెబుతుంది శృతి. మిమ్మల్ని సైకిల్‌పై చూసి నాన్న కోప్పడ్డారని శృతితో అంటుంది శోభన. మేము కారు కొనే ప్రయత్నంలో ఉన్నామని తల్లితో అంటుంది శృతి. మీరేం మాపై జాలి చూపించొద్దని అంటుంది. మీ అత్తారింట్లో నీకు ఏం సమస్య వచ్చినా మన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని శృతి అంటుంది శోభన. అత్లింట్లో తాను సంతోషంగా ఉన్నానని శృతి బదులిస్తుంది.
మనోజ్ టెన్షన్‌గా కనిపిస్తాడు. ఏమైందని రోహిణి అడుగుతుంది. తన జాబ్ పోయిన సంగతి రోహిణికి చెబుతాడు. అతడు ఫ్రాంక్ చేస్తున్నాడని రోహిణి అనుకుంటుంది. జోకులు వేయద్దని అంటుంది. నిజంగానే జాబ్ పోయిన ప్రామిస్ చేస్తాడు. నువ్వు రెండు వారాలు మించి ఎక్కడ పనిచేయలేవా? నీ ప్రాబ్లెమ్ ఏంటి భర్తపై చిరాకుపడుతుంది రోహిణి. నేనేం చేయలేదని మనోజ్ సర్ధిచెప్పబోతాడు. మాట్లాడకు అంటూ కోపంగా భర్తతో అంటుంది రోహిణి అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
ఈ ఎపిసోడ్ ప్రభావతి క్రూరత్వం, మీనా శోకం, మరియు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలతో ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలని ఆసక్తిగా ఉంది.


