
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లోని ఈరోజు ఎపిసోడ్ లో బాలు తన బుద్ధిమత్తంతో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాడు. సురేంద్ర సత్యాన్ని అవమానించడంతో పాటు, రోహిణి మనోజ్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఉత్కంఠభరితమైన ఈ ఎపిసోడ్‌ని మిస్ చేసుకోకండి.
Key Points
బాలు బుద్ధిమత్తంగా వ్యవహరించి గొడవలను నివారిస్తాడు.
సురేంద్ర సత్యాన్ని అవమానించి వివాదాన్ని రేకెత్తిస్తాడు.
రోహిణి మనోజ్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
శోభన, రోహిణి బాలును ఉపయోగించి గొడవలు చేయాలని ప్రయత్నిస్తారు.
బాలు యొక్క బుద్ధిమత్తం
బాలును అడ్డుపెట్టుకొని ఫంక్షన్‌లో గొడవలు చేయాలని శోభన, రోహిణి స్కెచ్ వేస్తారు. బాలుకు కోపం తెప్పించేందుకు శోభన మనుషులు ప్రయత్నిస్తారు. బాలును కొడతారు. మీనాకు ఇచ్చిన మాట కోసం వారిని ఏం అనకుండా వదిలేస్తాడు బాలు. బుద్దిగా బాలు కూర్చోవడం చూసి రంగా ఆశ్చర్యపోతాడు. వంద మందిని కొట్టేవాడు కూడా ఒక్క నీ మాటకు కట్టుబడి సైలెంట్ అయిపోయాడు…వీడు నీ అసలైన కొడుకు అని సత్యం తో అంటాడు రంగా.
ఫంక్షన్‌లో పనులు చేయడానికి మీనాను తన రూమ్ లోపలికి రమ్మని అంటుంది ప్రభావతి. మీనా వెళ్లడానికి బాలు ఒప్పుకోడు. తనను వదిలిపెట్టి వెళ్లొద్దని, ఫంక్షన్‌తో నాతో గొడవ పడాలని కొందరు చూస్తున్నారని, నువ్వు పక్కన ఉంటేనే నాకు ధైర్యం అంటాడు. తాను వెంటనే వచ్చేస్తానని మీనా వెళ్లిపోతుంది.
బాలు ఇరిటేట్ చేయడానికి మళ్లీ శోభన మనుషులు వస్తారు. వారి నుంచి తప్పించుకోవడానికి సత్యం , రంగా మధ్యలో కూర్చుంటాడు బాలు. ఏ గొడవ జరగకుండా తన నోరు మూయించారని బాలు ఫైర్ అవుతాడు. తమకు పని ఉందని సత్యం, రంగా వెళ్లిపోతారు. ఒంటరిగా ఉన్న బాలు పక్కన రోహిణితో డీల్ కుదుర్చుకున్న రౌడీ వచ్చి కూర్చుంటాడు. పదే పదే బార్ అనే మాట వాడుతూ బాలు తనకు పరిచయం ఉన్నట్లుగా మాట్లాడుతాడు. బాలును ఇరిటేట్ చేస్తాడు.
తాను ఓ విల్లా కడుతున్నానని, ఉండటానికి డూప్లెక్స్ హౌజ్ ఉందని, కొంతమంది అగ్గిపె్ట్టె లాంటి ఇంట్లో ఉంటారని, వాటిలో అడుగుపెట్టడానికి కూడా అసహ్యం అంటూ సత్యాన్ని అవమానిస్తూ మాట్లాడుతాడు సురేంద్ర. వాడి డూప్లెక్స్ హౌజ్‌లో భార్య తప్ప సురేంద్రకు ఎవరూ లేరు.. సురేంద్ర కూతురు కూడా వాడిని వదిలిపెట్టి నా అగ్గిపెట్టె లాంటి ఇంట్లోనే ఉంటుందని సత్యం అంటాడు. తనను అవమానించడానికే భారీగా ఖర్చు చేసి సురేంద్ర ఈ ఫంక్షన్ చేస్తున్నాడని సత్యం కనిపెడతాడు.
సురేంద్ర యొక్క అవమానకరమైన ప్రవర్తన
పెద్ద ఆఫీసర్ ఫంక్షన్‌కు వస్తాడు. సత్యం దగ్గరకు వచ్చి గౌరవించి మాట్లాడుతాడు. నా సర్వీస్‌లో నిజాయితీగా పనిచేసే మీ లాంటి ఎంప్లాయ్‌ని చూడలేదని అంటాడు. సత్యం ఇంటికి కోడలిగా వెళ్లడం మీ అమ్మాయి శృతి అదృష్టం అని ఆ ఆఫీసర్ అంటాడు.
ఆఫీసర్ మాటలను సురేంద్ర తట్టుకోలేకపోతాడు. అర్హత లేని వారికి మర్యాద ఇవ్వాల్సివస్తుందని అంటాడు. సురేంద్ర మాట తీరు చూసి గొడవ పెట్టుకోవడానికే అతడు ప్రయత్నిస్తున్నాడని సత్యం టెన్షన్ పడతాడు.
రోహిణి కోసం నా కూతురు ఫంక్షన్‌కు ఆపుకోవాల్సివస్తుందని, ఏదో ఒకటి ఇప్పుడే తేల్చాలని ప్రభావతికి ఆర్డర్ వేస్తుంది శోభన. సురేంద్రకు ఇష్టం లేకపోయినా శృతితో కలిసి రోహిణికి ఫంక్షన్ చేయడానికి ఒప్పుకున్నామని, ఇలాగే ఆలస్యం చేస్తే గొడవలు జరుగుతాయని అంటుంది. శృతికే మొదట ఫంక్షన్ చేయాలని సత్యం, ప్రభావతి నిర్ణయించుకుంటారు. తన తండ్రి వచ్చిన తర్వాతే తాళిబొట్టు మార్చే వేడుకను జరిపించాలని ప్రభావతి అనుకుంటుందని తెలిసి రోహిణి కంగారు పడిపోతుంది.
మీ నాన్న ఎప్పుడు, ఏ ఫ్లైట్‌కు వస్తున్నారో తనకు డీటెయిల్స్ కావాలని, అసలు వస్తున్నాడో లేదో తనకైనా నిజం చెప్పమని రోహిణిని అడుగుతాడు మనోజ్. ఫ్లైట్ డిలే అయ్యి రావడం ఆలస్యం కావచ్చు…చదువుకున్నావు…అంత మాత్రం తెలియదా , ఆయన వచ్చేది మలేషియా నుండి అని భర్తపై విరుచుకుపడుతుంది రోహిణి.
రోహిణి యొక్క కోపం
మలేషియా నుంచి వియ్యంకుడు వస్తే కాస్తో కూస్తో బంగారం తెచ్చిపెడతాడని ఆశపడ్డానని, ఆ ఆశ తీరేలా లేదని ప్రభావతి బాధపడుతుంది. శోభన కూల్ చేయడానికి మీరు భారీగా ఖర్చు చేసి ఫంక్షన్ చేస్తున్నారు కాబట్టి ముందు శృతికే చేయడం కరెక్ట్ అని మాట మారుస్తుంది ప్రభావతి.
శోభన నేరుగా రోహిణి రూమ్‌కు వచ్చి ఇంటి పెద్ద కోడలివి నువ్వే కదా…ముందు నీకు కాకుండా శృతికి చేయడం ఏం బాధగా లేదా అని రోహిణిని అడుగుతుంది. తనకు ఏ బాధ లేదని రోహిణి బదులిస్తుంది.
రోహిణి నుంచి అన్ని విషయాలు కూపీ లాగి గొడవలు చేయాలని ప్లాన్ చేస్తుంది ప్రభావతి, బాలు మందేసి గొడవ చేస్తే తప్ప తన తండ్రి గొడవ వదిలిపోయేలా లేదని రోహిణి అనుకుంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
ఈ ఎపిసోడ్ లోని సంఘటనలు అన్నిటికీ కేంద్రంగా బాలు ఉన్నాడు. అతని బుద్ధిమత్తం, సురేంద్ర యొక్క దురుద్దేశాలు, రోహిణి కోపం ఈ ఎపిసోడ్‌కు ఉత్కంఠను అందించాయి.


