
గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. మీనా అత్తతో గొడవపడుతుంది. శ్రుతిపై దొంగతనం ఆరోపణలు వస్తాయి. బాలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో చూడాలి.
Key Points
మీనా, అత్త ప్రభావతితో తీవ్ర వాగ్వాదం
శ్రుతిపై దొంగతనం ఆరోపణ
బాలు శ్రుతి, రోహిణిలను కాపాడటానికి ప్రయత్నించాడు
దినేష్‌కు మరో పెళ్లి సాధ్యత
మీనా-ప్రభావతి మధ్య తీవ్ర ఘర్షణ
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మలేషియా మామయ్య, రోహిణితో వెళ్లి ఆస్తులు విడిపించుర మనోజ్ అని ప్రభావతి అంటుంది. దాంతో రోహిణి సైగ చేయడంతో వద్దు, మనోజ్ రావడానికి వీళ్లేదు అని మటన్ కొట్టు మాణిక్యం అంటాడు. మనోజ్ అక్కడికి వస్తే మలేషియా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో మా బావకు సంబంధించిన వాళ్లు కనిపిస్తే అరెస్ట్ చేస్తున్నారు. నేను పారిపోయి ఇండియా వచ్చానంటాడు మాణిక్యం.
పాప ఆరోగ్యం బాగా చూసుకో. వీళ్లంతా నిన్ను బాగా చూసుకుంటారు. మీ నాన్న గురించి ఏం తెలిసిన నేను వచ్చి చెబుతాను అని మాణిక్యం వెళ్లిపోతాడు. తర్వాత బాలు డౌట్ పడితే ఇలాంటి విషయాల్లో ఎవరైనా అబద్ధం చెబుతారా. రోహిణి అసలే ఏడుస్తుందని మీనా అంటుంది. ఇంతలో ప్రభావతి వస్తే మీనా కాఫీ ఇస్తుంది. కానీ, కాఫీ తీసుకోకుండా నెట్టేస్తుంది ప్రభావతి .
ఏ దెయ్యం పట్టిందా నీకు అని సత్యం అంటాడు. ఇప్పుడు కాఫీ గ్లాస్ ఎందుకు విసరగొట్టారు అని మీనా అడుగుతుంది. నువ్ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అన్ని అశుభాలే. నువ్వు ఎవరు సంతోషంగా ఉన్న ఓర్చుకోలేవు. శ్రుతి నీ వల్లే బయటకు వెళ్లింది, ఇప్పుడు రోహిణి వాళ్ల నాన్న అరెస్ట్ అయ్యారు. నీ దృష్టే అలాంటిది అని గొడవ చేస్తుంది ప్రభావతి.
దాంతో బాలు అడ్డుకుంటాడు. నువ్ మాట్లాడకు పైసాకు పనికిరాని వాళ్లు ఇంట్లో పడి ఉంటున్నారని ప్రభావతి అంటుంది. ఎవరు పైసా పనిచేయట్లేదు. ఎవరి అనాల్సిన మాట ఎవరినంటున్నారు. నా భర్త పని చేయట్లేదా, నేను పూలమ్మట్లేదా. ఇంటి పని చేయట్లేదా. ఇప్పుడు ఎవరిని అన్నారో చెప్పాల్సిందే అని ప్రభావతిపై రివర్స్ అవుతుంది మీనా. ఇంట్లో అందరిని పంపించి మహారాణిలా కూర్చుందామనుకుంటున్నావా, ఇంటి కోడలు వెళ్తే ఎవరైనా ఏమైనా చేస్తున్నారా అని ప్రభావతి అంటుంది.
శ్రుతిపై దొంగతనం ఆరోపణ
నేను అందరు కలిసి ఉండాలనే అనుకుంటాను. మీరేం చేశారు. మీరెళ్లి శ్రుతికి నచ్చజెప్పి తీసుకురావచ్చుగా. మీ పని నేను చేశాను. శ్రుతిని వెళ్లి కలిసి నచ్చజెప్పాను. అంతా ఏం జరిగిందో అంతా చెప్పాను. అదంతా వాళ్లు చెప్పలేదట. శ్రుతి అర్థం చేసుకుంది. కచ్చితంగా మనసు మార్చుకుని ఇంటికి వస్తుందని మీనా అంటుంది. అక్కడికి వెళ్లి ఇది ఏం మాట్లాడిందో అని ప్రభావతి అంటుంది.
రోహిణి కూడా బాలు, శ్రుతివాళ్లను అని వెళ్లిపోతారు. అందరిని పంపించి వాళ్లనే ఉండమని ఇంటిని పూలకొట్టులా ఉంచేయండి అని ప్రభావతి వెళ్లిపోతుంది. తర్వాత మీనాను వెళ్లి శ్రుతి దగ్గరికి ఎవరు వెళ్లమన్నారు అని బాలు అంటాడు. శ్రుతికి నీ మీద కోపం. శ్రుతికి నచ్చజెప్పాను. ఇద్దరిని ఇంటికి రమ్మన్నాను. అత్తయ్య గారు బెంగపెట్టుకొన్నారని అని మీనా అంటుంది.
ఇద్దరం ఇద్దరితో మాట్లాడం కాబట్టి వాళ్లే వస్తారు. అప్పటివరకు ఏ గొడవ చేయకండి అని బాలుతో మీనా అంటుంది. మరోవైపు పార్లర్‌కు విద్య ఎంత చెప్పిన అగకుండా లోపలికి వెళ్తాడు దినేష్. హాయ్ కల్యాణి అంటూ రోహిణి ని పలకరిస్తాడు దినేష్. నేను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాను. సింపుల్‌గా చేసుకుంటున్నాను. నాకు ఒక లక్ష ఇవ్వు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయికి నా మొదటిపెళ్లి గురించి చెప్పాను. కానీ, నువ్వేం చేశావ్. నువ్వు చెప్పేవి అన్ని అబద్ధాలే అని దినేష్ బ్లాక్ మెయిల్ చేస్తాడు.
బాలు యొక్క ప్రయత్నాలు
ఇంతలో పార్లర్‌కి మనోజ్ వస్తాడు. అది రోహిణి చూస్తుంది. నేను డబ్బిలిస్తాను అని రోహిణి బతిమిలాడుకుంటుంది. దాంతో దినేష్ వెళ్లిపోతాడు. మనోజ్ వచ్చి రోహిణితో మాట్లాడుతాడు. కెనడాకు వెళ్లాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. మీ మావయ్యను అడిగి అరెంజ్ చేయమని మనోజ్ అంటాడు. అందరు ఎందుకు డబ్బు డబ్బు అని టార్చర్ పెడుతున్నారు అని నోరు జారుతుంది రోహిణి.
ఇంకెవరు నిన్ను అడిగారు అని మనోజ్ అంటాడు. మొన్న బ్యాంక్ వాళ్ల గురించి అని విద్య అంటుంది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి డబ్బు అరెంజ్ చేయమని అడుగు. మీ అమ్మకు నువ్వంటే అందరికంటే ఎక్కువ ప్రేమ అని రోహిణి సలహా ఇస్తుంది. దాంతో మనోజ్ సైలెంట్ అవుతాడు. ఇంటికెళ్లి సత్యం, ప్రభావతిని కూర్చోబెట్టి ఇంటి పత్రాలు తాకట్టు పెట్టమని అడుగుతాడు.
తర్వాత శ్రుతిని వెళ్లి బాలు కలుస్తాడు. అక్కడ శ్రుతిని ఎవరో దొంగ అంటారు. దాంతో వాళ్లను కొడుతుంది శ్రుతి. వాళ్ల నుంచి శ్రుతిని బాలు కాపాడుతాడు. అప్పుడు శ్రుతి తండ్రి సురేంద్ర ప్లాన్ గురించి తనకు చెబుతాడు బాలు. రవి అవస్థలు పడుతున్నాడని, మీ అత్త, మామ బెంగ పెట్టుకున్నారని నచ్చజెబుతాడు బాలు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్‌లో అనేక ఉద్రేకపూరిత ఘటనలు చోటుచేసుకున్నాయి. మీనా, ప్రభావతి మధ్య వివాదం, శ్రుతి యొక్క సమస్యలు, మరియు దినేష్ భవిష్యత్తుపై సస్పెన్స్ నెలకొంది.


