
📌 Key Points
- సత్యం మాస్టర్ ప్లాన్: కోడళ్ళ మధ్య చిచ్చు పెట్టి ఫుల్ ఖుషీ!
- ఎమ్మెల్యే కాలర్ పట్టుకున్న మనోజ్: అసలు ఆ లెటర్లో ఏముంది?
- ప్రభావతికి అజీర్తి తిప్పలు: మీనా వంటలపై అనుమానాలు!
- రాధిక, ప్రేమ్ లవ్ ట్రాక్: ప్రభావతి సీరియస్ వార్నింగ్!
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అభిమానులకు ఒక అదిరిపోయే న్యూస్! నేటి ఎపిసోడ్‌లో సత్యం కామెడీతో పాటు మనోజ్ ఫైటింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇక ప్రభావతి కష్టాల గురించి తెలుసుకోవాల్సిందే!
సత్యం కామెడీతో కోడళ్ళకు చుక్కలు!
గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 5 ఎపిసోడ్‌లో మీనా, శ్రుతి ప్రేమగా మాట్లాడుకుంటుంటే సత్యం ప్రాంక్ చేసి నవ్వుతాడు. ప్రభావతి కోసం బిర్యానీ తీసుకెళ్తుంది మీనా. అది తిన్న ప్రభావతి అజీర్తితో అవస్థలు పడుతుంది. ఇది హోటల్ నుంచి తీసుకొచ్చిన బిర్యానీ అని మీనాను తిడుతుంది ప్రభావతి.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా వంటలను శ్రుతి పొగుడుతుంది. వాళ్లు మాట్లాడుకోవటం చూసి రా ప్రభా తిందాం అని సత్యం కావాలనే అంటాడు. దాంతో శ్రుతి , మీనా గొడవ పడతారు. దాంతో సత్యం నవ్వుతాడు. ప్రభ పేరు చెప్పగానే భలే గొడవ పడుతున్నారే అని సత్యం అంటే.. మీరు కూడా ప్రాంక్ చేశారా మావయ్య అని శ్రుతి అంటుంది.
మీనాను ఎందుకు ఆంటీ ఆడిపోసుకుంటుంది అని శ్రుతి అడిగితే.. మీనాను ఇంటికి తీసుకురావడం మీ ఆంటీకి ఇష్టంలేదు. అందుకే ఇలా చేస్తుందని సత్యం అంటాడు. మరోవైపు మనోజ్‌ను ఒక వ్యక్తి కలుస్తాడు. లవ్ లెటర్ అని చెప్పి ఓ లెటర్ ఇస్తాడు అతను. ఎవరు మీరు అని మనోజ్ అడిగితే ఎమ్మెల్యే అని చెప్పి మంచి లక్ష్మణాలు ఉన్న అబ్బాయి అని అంటాడు.
మనోజ్ vs ఎమ్మెల్యే: అసలు ఏం జరిగింది?
ఆ లెటర్ చదువుతాడు మనోజ్. మీ అమ్మకు గుండెపోటు వస్తుంది, తమ్ముడు హంతకుడు అవుతాడు, నువ్వు ఆత్మహత్య చేసుకుంటావ్ అని మనోజ్ చదివి షాక్ అవుతాడు. లెటర్ ఇచ్చిన వ్యక్తి కోసం వెతుకుతాడు. అతన్ని పట్టుకుని ఎవడ్రా నువ్వు, ఇదంతా ఏంటీ అని నిలదీస్తాడు మనోజ్. ఎమ్మెల్యే కాలర్ పట్టుకుని అడుగుతాడు మనోజ్ .
మీనా క్యారేజ్ పట్టుకుని వస్తుంది. బాలు రాసిన ఓ లిస్ట్ కారులో పడిపోతుంది. ఇంతలో మీనాకు పూల ఆర్డర్ వస్తుంది. మరోవైపు ప్రభావతి డ్యాన్స్ చేపిస్తుంటే ప్రేమ్ కుమార్ రాధిక వైపు చూస్తాడు. దాంతో ప్రభావతి వారిస్తుంది. మీనాను డ్రాప్ చేసి బాలు వెళ్లిపోతాడు. లేట్ ఎందుకు వచ్చావని ప్రభావతి అడిగితే.. తెలియదని మీనా కౌంటర్స్ ఇస్తుంది.
మీ అత్త మొదటి నెల జీతంతో మంచి వాచ్ కొనిపెడుతుంది. ఐదారు వేలల్లో అని కామాక్షి అంటుంది. అర్జంట్‌గా పూలు ఇవ్వాలని మీనా అంటే.. వడ్డించి వెళ్లమని వారిస్తుంది ప్రభావతి. మరోవైపు రాధిక, ప్రేమ్ కుమార్ మాట్లాడుకుంటారు. రాత్రి ఎందుకు ఫోన్ చేశావ్. మా నాన్న పేరు అసలే మంగపతి అని రాధిక అంటుంది.
ప్రభావతికి కష్టాలు: మీనా కారణమా?
ఇంతలో మీనా వస్తుంది. సత్యం వచ్చి అడిగితే.. అత్తయ్యకు తిన్నది అరగలేదట అని మీనా చెబుతుంది. ఇంట్లో అందరూ తిన్నారు వారికేం కాలేదు. నీకెందుకు అయిందని సత్యం అంటాడు. ఇది హోటల్ నుంచి తెప్పించింది. ఇదిగోండి బిల్ అని ప్రభావతి ఇస్తుంది. నేను ఇంట్లో చేసిందే ఇచ్చాను అని మీనా అంటుంది. ఇంతలో బాలు వస్తాడు.
మీనాను రోహిణి కూడా తప్పుబడుతుంది. మరి ఇంట్లోంచి తీసుకెళ్లిన క్యారేజ్ ఏం చేసి ఉంటాను అని మీనా ఎదురు ప్రశ్న వేస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రాబోయే ఎపిసోడ్‌లలో ఏం జరుగుతుందో చూడటానికి వేచి ఉండండి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


