
గుండె నిండా గుడి గంటలు నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి ప్లాన్‌లు బెడిసికొట్టాయి. చింటూ రహస్యం బయటపడే పరిస్థితి ఏర్పడింది. బాలు, రవిల అనుమానాలు బలపడగా, రోహిణి ఇంట్లోవాళ్ల ముందు దొరికిపోయే పరిస్థితికి చేరుకుంది. ఈరోజు ఎపిసోడ్‌లో ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుందో చూడాలి.
Key Points
రోహిణి ప్లాన్‌లు తలకిందులై ఇంట్లోవాళ్ల ముందు దొరికిపోయే పరిస్థితికి చేరుకుంది.
చింటూను 'అమ్మ' అని పిలవొద్దని రోహిణి చెబుతుంది, తన రహస్యాన్ని దాచే ప్రయత్నం చేస్తుంది.
ట్రిప్ క్యాన్సిల్ కావడంతో బాలు అనుకోకుండా ఇంటికి వచ్చి రోహిణిని షాక్ చేశాడు.
మీనా సహనం చూసి విద్య ఎంతో నేర్చుకోవాలని లోపల అనుకుంటుంది, రోహిణి తప్పులను గుర్తిస్తుంది.
రోహిణి ప్లాన్‌లు తలకిందులు.. బాలు ఎంట్రీ
గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 521వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంట్లో వాళ్ల ముందు రోహిణి దొరికిపోయే పరిస్థితి వస్తుంది. తాను వేసిన ప్లాన్స్ అన్నీ తలకిందులవడంతో రోహిణి పూర్తిగా ఇరుక్కుపోతుంది. బాలుతోపాటు రవిలోనూ రోహిణిపై అనుమానం మొదలవుతుంది.
అమ్మ అని పిలవొద్దని చింటుకి చెప్పిన రోహిణి
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ చింటూని రోహిణి దగ్గరకు తీసుకొని నీ అమ్మను నేనే అని చెప్పే సీన్ తో మొదలవుతుంది. అత్తను కాదు అమ్మను.. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను.. ఈ ఇంట్లో ఉన్నప్పుడు తనను అమ్మ అని పిలవొద్దు అని చింటూకి చెబుతుంది. ఆ పసి మనసుకు నీ పరిస్థితి ఎలా అర్థమవుతుందమ్మా అని రోహిణితో సుగుణ అంటుంది.
తప్పదమ్మా.. ఈ ఇంట్లో నేను కోటీశ్వరుడి కూతురు అని అనుకున్నన్ని రోజులే విలువ ఉంటుంది.. మీనా పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నావు కదా.. నాకు కొడుకు ఉన్నాడని తెలిస్తే మా అత్తగారు ఎలా రియాక్ట్ అవుతుందో ఊహించడమే భయంగా ఉంది అని రోహిణి ఏడుస్తుంది. ఇంట్లో వాళ్లు అందరూ వచ్చేలోపు మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. హోటల్లో రూమ్ బుక్ చేశానని అంటుంది.
మీనాను వెళ్లకుండా అడ్డుకున్న విద్య
చింటూ రహస్యంపై బాలు, రవిల అనుమానం
అటు మీనా ను వెళ్లకుండా రోహిణి ఫ్రెండ్ విద్య అడ్డుకుంటుంది. ఆమెతో మటన్ వండిస్తుంది. ఆ తర్వాత నువ్వు వండింది తినకుండా వెళ్తే ఎలా అని ఆమెను బలవంతంగా మరింతసేపు అక్కడే ఉండేలా చేస్తుంది. ఆ తర్వాత తింటూ కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. మీ అత్తగారు అన్ని మాటలు అంటారు కదా.. మీకు కోపం రాదా అని మీనాను అడుగుతుంది.
ఆవిడ వల్లే ఉమ్మడిగా కలిసి ఉన్నాం.. మా మామయ్య దేవుడు.. ఆయన ముందు ఈ గొడవలు వద్దనే కోపం వచ్చినా సహనంతో ఉంటున్నా.. సహనం పిరికితనం కాదు అని మీనా అంటుంది. మీనాను చూసి విద్య తాను ఎంతో నేర్చుకోవాలని లోపల అనుకుంటుంది. ఆమె ఒక్క తప్పు చేయదు.. రోహిణి అన్నీ తప్పులే చేస్తుందని కూడా అనుకుంటుంది.
అటు ట్రిప్ క్యాన్సిల్ అవడంతో బాలు త్వరగా ఇంటికి వచ్చేస్తాడు. ఇటు తల్లి, కొడుకులను ఇంట్లో నుంచి పంపించేయడానికి రోహిణి సిద్ధమవుతుండగా చింటూ అని పిలుస్తూ బాలు వస్తాడు. దీంతో రోహిణి షాక్ తింటుంది. రోహిణి గదిలోకి వచ్చిన బాలు.. నీకోసం బిర్యానీ తీసుకొచ్చానంటూ చింటూకి ఇస్తాడు. తాను రెడీ అయి వస్తానని, చింటూకి తినిపించడని సుగుణకు చెప్పి వెళ్తాడు.
ఇటు డైనింగ్ టేబుల్ దగ్గర తనకు అమ్మే తినిపించాలని చింటూ అనగానే రోహిణి కంగారుపడుతుంది. అమ్మా అని పిలవొద్దన్నా.. చింటూ మనసులోని ప్రేమను మాత్రం తీసేయలేవు కదా అని రోహిణితో సుగుణ అంటుంది. దీంతో రోహిణి అతనికి తినిపిస్తూ ఉంటుంది.
అది చూసిన బాలు పార్లరమ్మ అమ్మయిపోయిందేంటి అంటూ వస్తాడు. దీంతో రోహిణి, సుగుణ భయపడతారు. నీకూ కొడుకు ఉంటే ఇలాగే తినిపించేదానివి కదా అని బాలు అంటాడు. చింటూ, సుగుణకు రూమ్ ఇవ్వడం, ఇప్పుడిలా తినిపించడం చూసి బాలు ఆశ్చర్యపోతాడు.
మీనాను అడ్డుకున్న విద్య.. కీలక సంభాషణ
ఆ తర్వాత చింటూతో బాలు ఆడుకుంటుండగా మీనా ఇంటికి వస్తుంది. రోహిణి ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి వచ్చావు కదా.. బాగానే ఉన్నావా అంటూ మీనాను బాలు అడుగుతాడు. తాను బాగానే ఉన్నానంటూ చింటూకి కళ్లద్దాలు తీసుకొచ్చి ఇస్తుంది. అవి తీసుకొని తన ఫ్రెండ్ ముందు తాను పోజులు కొడతానని చింటూ అంటాడు. తన కట్లు విప్పిన తర్వాత అందరినీ చూస్తానా.. అమ్మను కూడా చూస్తానా అని చింటూ మీనాను అడగడంతో రోహిణి భయపడుతుంది.
దీంతో మీనా స్పందిస్తూ.. అతని తల్లి దుబాయ్ నుంచి ఎప్పుడు వస్తుంది.. ఇప్పుడైనా రమ్మనండి.. ఫోన్ కలిపి ఇవ్వండి తాను మాట్లాడతానని సుగుణతో అంటుంది. దీంతో సుగుణ కంగారు పడుతూ ఇప్పుడు ఆమెకు మాట్లాడటం కుదరదు.. తర్వాత ఫోన్ చేసినప్పుడు ఇస్తానని అంటుంది.
ఇంతలోనే రవి, శృతి కూడా ఇంటికి వస్తారు. చింటూకి కట్లు విప్పిన తర్వాత వారం ఇక్కడే ఉండొచ్చు కదా.. మేమందరం మీకు తోడుగా ఉంటామని మీనా అంటుంది. అది విని రోహిణి కావాలని టేబుల్ పై ఉన్న పాల గిన్నెను కింద పడేస్తుంది. ఆమె కావాలని అలా చేయడం చూసిన రవిలోనూ రోహిణిపై అనుమానం మొదలవుతుంది.
అటు ఇంట్లో నుంచి వెళ్లడానికి సిద్ధమవుతూ వెళ్లొస్తామమ్మా అని ప్రభావతితో సుగుణ అంటుంది. వెళ్లండి కానీ రాకండి అంటూ నానా మాటలు అంటుంది ప్రభావతి. దీంతో అత్తయ్యా అంటూ రోహిణి గట్టిగా అరుస్తుంది. ఇంట్లో నుంచి అందరినీ పంపించి.. వాళ్లను వెళ్లగొడతానన్నావ్ అని ఎందుకన్నావ్ అంటూ రోహిణిని ప్రభావతి నిలదీయడంతో అందరూ షాకవుతారు. తనకు పూర్తిగా అర్థమైందంటూ బాలు అంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
గుండె నిండా గుడి గంటలు నేటి ఎపిసోడ్‌లో రోహిణికి కష్టాలు, ప్లాన్‌ల విఫలం ఉత్కంఠను పెంచాయి. బాలు, రవి అనుమానాలు కథను కీలక మలుపు తిప్పాయి. రాబోయే ఎపిసోడ్‌లో ఆమె ఏం చేస్తుందో చూడాలి.


