|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు తప్పు చేయలేదని నిరూపించిన మీనా.. అన్నయ్యను కాపాడిన మౌనిక.. గుణ కుట్ర బట్టబయలు

Published: 19-08-2025, 11:22 PM
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు తప్పు చేయలేదని నిరూపించిన మీనా.. అన్నయ్యను కాపాడిన మౌనిక.. గుణ కుట్ర బట్టబయలు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. బాలు తాగినట్లు అందరూ అనుకుంటారు. కానీ మీనా బాలు తప్పు చేయలేదని నిరూపిస్తుంది. మౌనిక కూడా అన్నయ్యను కాపాడే ప్రయత్నం చేస్తుంది.

Key Points

1

మీనా బాలు తప్పు చేయలేదని నిరూపించే ప్రయత్నం

2

మౌనిక తన అన్నయ్యను కాపాడటానికి చేసిన ప్రయత్నాలు

4

సత్యం మరియు ఇతర కుటుంబ సభ్యుల ప్రతిచర్యలు

మీనా, బాలుకు మద్దతు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 492వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు తాగాడంటూ ఇంట్లో వాళ్లు అందరూ నిందిస్తారు. మీనా, సత్యం కూడా అతడు చెప్పిన మాట వినరు. అయితే బాలుని కాపాడుతుంది చెల్లి మౌనిక. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఆగస్టు 20) ఎపిసోడ్ మీనాను ప్రభావతి నిలదీసే సీన్ తో మొదలవుతుంది. భార్యగా అతన్ని కంట్రోల్ చేయలేదు కాబట్టే ఇలా తాగుబోతుగా మారాడని అంటుంది. దీంతో మీనా కోపం కట్టలు తెంచుకుంటుంది. ప్రభావతిపై విరుచుకుపడుతుంది. నేను తాగుబోతు భార్యనైతే మీరు తాగుబోతు తల్లా అని అడుగుతుంది. తాను ఇంట్లోకి వచ్చి కొంతకాలమే అయిందని, మీ కొడుకు తాగకుండా పెంచడం మీకు చేతకాలేదా అని నిందిస్తుంది. అటు సత్యం కూడా మీనాకు సపోర్ట్ చేస్తాడు. తప్పు చేసింది బాలు అయితే మీనాను ఎందుకు నిలదీస్తున్నావని ప్రభావతిని తిడతాడు.

ప్రభావతిని దెప్పిపొడిచిన శృతి తల్లి

అప్పుడే ప్రభావతికి శృతి తల్లి శోభ ఫోన్ చూసి దెప్పిపొడుస్తుంది. బాధలో ఉన్నారా? ఆనందంలో ఉన్నారా? ఆందోళనలో ఉన్నారా? అలాంటి కొడుకును ఎలా భరిస్తున్నారు? మీరే కాదు.. మీ ఇంటికి అమ్మాయిని ఇచ్చినందుకు తాము కూడా మాటలు పడాల్సి వస్తోందని శోభ నానా మాటలు అంటుంది. ఏం చేస్తాం.. అంతా నా తలరాత వదిన అంటూ ప్రభావతి బాధపడుతుంది. దీంతో శృతి ఫోన్ తీసుకొని తల్లికి క్లాస్ పీకుతుంది. ఇప్పటి వరకూ ఇంట్లో అయిన పంచాయితీ చాలదా నువ్వు ఫోన్ చేశావ్.. పెట్టెయ్ అంటూ సీరియస్ అవుతుంది.

బాలుపైకి చెయ్యెత్తిన సత్యం

మౌనిక యొక్క కీలక పాత్ర

ఆ తర్వాత బాలు ఇంటికి వస్తాడు. అందరూ అదోలా ఉండటం చూసి ఎవరు పోయారని తనదైన స్టైల్లో అడుగుతాడు. నువ్వు నా పార్క్ సీన్ చూపించినట్లే నీ బారు, కారు సీన్ చూపించినట్లు మనోజ్ చెబుతాడు. మనోజ్, రోహిణి కలిసి బాలుతో ఆడుకుంటారు. దీంతో బాలు కోపంగా అతన్ని కొట్టబోగా.. సత్యం అడ్డుకొని బాలుపైకి చెయ్యెత్తుతాడు. తాను తాగలేదని చెబుతున్నా ఎవరూ వినరు.

చిన్నప్పటి నుంచే వీడిని మీరు కొట్టి ఉంటే ఇలా అయి ఉండేవాడు కాదని ప్రభావతి రెచ్చగొడుతుంది. అందరి ముందూ నా పరువు తీశావంటూ బాలును సత్యం కూడా నానా మాటలు అంటాడు. కొట్టు నాన్న.. నీ మాటలతో నా గుండెల్లో అయిన గాయం కంటే ఇదేమీ ఎక్కువ కాదు అని బాలు అంటాడు. అటు మీనాకు కూడా తాను తాగలేదని చెప్పినా వినదు. రవి, శృతి కూడా చెప్పింది నమ్మకుండా వెళ్లిపోతారు. దీంతో బాలు ఒంటరి వాడైపోతాడు.

మౌనికకు వీడియో చూపించిన సంజూ

అటు బాలు ఎదుర్కొంటున్న పరిస్థితి చూసి సంజూ తెగ ఆనందిస్తాడు. ఆ వీడియోను మౌనికకు కూడా చూపిస్తాడు. మీ అన్నయ్య ఏదో ఉత్తముడు అని చెబుతావు కదా.. చూడు ఏం చేశాడో అని అంటాడు. అయినా మౌనిక మాత్రం నమ్మదు. కళ్లతో చూసేవన్నీ నిజం కాదు అని వాదిస్తుంది. తన అన్నయ్య ఎలాంటి తప్పు చేయడు అని సంజూతో స్పష్టం చేస్తుంది.

ఇటు మీనా దగ్గరికి మరోసారి వెళ్లి బాలు తాను తాగలేదని చెబుతాడు. అయినా మీనా నమ్మదు. అన్ని విషయాల్లో మారినా.. ఈ విషయంలో మాత్రం మీరు మారలేదని మీనా అంటుంది. అబద్ధాలు చెప్పొద్దని బాలుని నిందిస్తుంది. అప్పుడు శివ చేయి విరగ్గొట్టినప్పుడు కూడా అబద్ధమే చెప్పారని అంటుంది. ఆ విషయం వదిలెయ్ మీనా.. ఇప్పుడు మాత్రం తాను తాగలేదు అని బాలు ఎంత బతిమాలినా మీనా వినదు. సరే ఎవరు నమ్మినా నమ్మకపోయినా తానేంటో తనకు తెలుసని బాలు వెళ్లిపోతాడు. అయితే మీనాలో సందేహం మొదలవుతుంది.

గుణ కుట్ర బట్టబయలు

బాలుని ఓదార్చిన ఫ్రెండ్స్, మౌనిక

అటు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లిన బాలు ఇంట్లో జరిగిన విషయం చెబుతాడు. తన తండ్రి కొట్టబోయాడని, మీనా కూడా తాను చెప్పింది వినడం లేదని అంటాడు. ఫ్రెండ్స్ అతన్ని ఓదారుస్తారు. నువ్వు ట్రిప్ కు వెళ్లినప్పుడు, పగటి సమయంలో తాగవని మాకు తెలుసు అంటారు. మీరైనా నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ అని బాలు అంటాడు. అప్పుడే మౌనిక అతనికి ఫోన్ చేస్తుంది.

నువ్వు కూడా మీ వదినలాగే నన్ను అనుమానిస్తున్నావా అని బాలు అనడంతో.. నీ మీద నమ్మకం ఉందన్నయ్యా.. నువ్వు తప్పు చేయవని తెలుసు అని బాలుని మౌనిక ఓదారుస్తుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత నా ఇంట్లో ఒక్కరైనా నా మాట నమ్మినందుకు సంతోషంగా ఉందని ఫ్రెండ్స్ తో బాలు అంటాడు. నీ విషయంలో ఏదో కుట్ర జరిగిందనిపిస్తోంది.. అసలు ఆ వీడియో ఎవరు తీశారో కనిపెట్టాలని ఫ్రెండ్స్ అంటారు.

పూలు డెలివరీ చేయడానికి వెళ్లిన మీనాను చూసి ఆగుతాడు గుణ. నువ్వు గ్రేట్ అక్క.. మీ ఆయన వీడియో అంత వైరల్ అవుతున్నా ఏమీ జరగనట్లు నీ బిజినెస్ నువ్వు చేసుకుంటున్నావని అంటాడు. అతన్ని కొట్టడానికి వెళ్తుంది మీనా. నేను తాగుబోతు అని.. శివను నాతో తిరగొద్దని చెప్పావు.. ఆ విషయం నాకు కాదు.. వెళ్లి మీ ఆయనకు చెప్పు అంటూ మీనాను గుణ దెప్పి పొడుస్తాడు.

ఇంతలో మౌనిక మీనాకు ఫోన్ చేసి బాలు అన్నయ్య అలా చేయడని చెప్పడంతో ఆమెలో అనుమానం మరింత ఎక్కువవుతుంది. దీంతో బాలు విషయంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవానికి బయలుదేరుతుంది. బార్ కు కూడా వెళ్తుంది. అక్కడి వాళ్లతో మాట్లాడి అసలు నిజం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో గుణ కుట్ర బయటపడేలా కనిపిస్తుంది. అంతటితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరిగా, బాలు నిజాయితీని మీనా, మౌనిక నిరూపించారు. గుణ కుట్ర బయటపడటంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. ముగింపు ఎలా ఉంటుందో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు ఎదురుచూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.