
గుండెనిండా గుడి గంటలు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బాలు చేసిన మోసాలు బయటపడతాయి. రోహిణి ఈ విషయాన్ని ప్రభావతికి చెప్పడంతో ఇంట్లో ఉద్రిక్తత పెరుగుతుంది.
Key Points
బాలు కారు అమ్ముకుని ఆటో నడుపుతున్న విషయం రోహిణికి తెలుస్తుంది.
రోహిణి ఈ విషయాన్ని ప్రభావతికి చెప్పి, బాలును బోనులో పెట్టాలనుకుంటుంది.
ప్రభావతి ఇంటిని కోర్టులా మార్చి, బాలును ప్రశ్నిస్తుంది.
రోహిణి మరియు బాలు మధ్య సన్నివేశంలో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంటుంది.
రోహిణికి బాలు సీక్రెట్ బయటపడుతుంది
బాలు ఆటో ఎక్కుతుంది రోహిణి. తాను కారు అమ్మేసి ఆటో నడుపుతోన్న విషయం బయటపడకుండా రాజేష్‌కు ఫోన్ చేసి కొత్త నాటకం ఆడుతాడు బాలు. వెంకటేష్ అనే స్నేహితుడు చెల్లెలి పెళ్లి కోసం తన కార్ తీసుకున్నాడని, వాడి తమ్ముడి ఆటో ఒక్క రోజు నడపమని తనకు ఇచ్చాడని రోహిణి వినపడేలా కావాలనే మాట్లాడుతాడు బాలు. చూసేవాళ్లు తాను కారు కాకుండా ఆటోనడుపుతున్నానని అనుకుంటారని అంటాడు. బాలు ఆటో రోహిణి ఎక్కిన విషయం క్లూస్ ఇస్తూ రాజేష్‌కు అర్థమయ్యేలా వివరిస్తాడు.
ఎక్కడికి వెళ్లాలని రోహిణితో పాటు ఎక్కిన మరో అమ్మాయిని అడుగుతాడు బాలు. క్వీన్ బ్యూటీ పార్లర్ అని చెప్పబోతుండగా ఆమె నోరు మూస్తుంది రోహిణి. మన పార్లర్ అని అంటుంది. పార్లర్‌కు కొంచెం దూరంలో ఆటో ఆపేసి దిగుతుంది. డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతుంటే రెండు వందలు కిరాయి అని బాలు అంటాడు.
అప్పుడే బాలుకు తెలిసిన వ్యక్తి వచ్చి కారు అమ్మేశావంటా నిజమేనా అని అతడిని అడుగుతాడు. రోహిణి వెళ్లిపోయిందనుకొని కారు అమ్మేసి…తెలిసిన వాళ్ల ఆటో కిరాయికి తీసుకొని నడుపుతున్నానని బాలు అంటాడు. అతడి మాటలను ఓ కారు చాటుకూ దాక్కొని రోహిణి వింటుంది. ఈ సీక్రెట్‌ను వెంటనే ఇంట్లో అందరిని చెప్పాలని అనుకుంటుంది.
మనోజ్ దగ్గరకు వచ్చి బాలు కారు అమ్మేసి ఆటో నడుపుతోన్న విషయం చెబుతుంది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కొన్న కారు అమ్మేసేటప్పుడు ఇంట్లో వాళ్లకు బాలు సమాధానం చెప్పాలి కదా అని రోహిణి అంటుంది. కారు అమ్మేసిన డబ్బులు ఏమయ్యాయో నిలదీయమని మనోజ్‌ను రెచ్చగొడుతుంది. పోయి పోయి బాలు నోట్లో నోరు ఎవరైనా పెడతారా, తాను అడగనని మనోజ్ భయపడిపోతాడు. వాడికి ఇవ్వాలని డబ్బులు గుర్తుచేస్తారని, తాను అడగనని అంటాడు.
బాలు మనల్ని ఎన్నో సార్లు అవమానించాడని, ఇంట్లోవాళ్లను మోసం చేస్తే ఊరుకోనని, ఎక్కడ చెప్పాలో అక్కడే చెబుతానని ప్రభావతి దగ్గరకు వెళుతుంది రోహిణి. ఎప్పుడు ఇంట్లో అందరి నోళ్లు మూయించే బాలు నోరు ఈ రోజు నేను మూయించబోతున్నానని సంబరపడుతుంది. బాలు ఆటో నడుపుతున్న సంగతి ప్రభావతికి చెబుతుంది. అసలు బాలుకు కారు లేదని, అమ్మేశాడనే నిజం ప్రభావతికి చెబుతుంది.
నేను, నా ఫ్రెండ్ బాలు ఆటో ఎక్కామని, మాకు అడ్డంగా దొరికిపోయాడని అంటుంది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మావయ్యే కదా ఆ కారు కొనిచ్చాడని బాలును ప్రభావతి ముందు ఇరికిస్తుంది. అవును ఇప్పటికీ ఆ అప్పుకు వడ్డీ కడుతున్నామని, అలా ఎలా అమ్మేస్తాడు, బాలుకు ఏ హక్కు ఉందని ప్రభావతి అంటుంది.
ప్రభావతి కోపంతో బాలును ప్రశ్నిస్తుంది
కారు అమ్మేసి ఆ డబ్బులు ఏం చేశాడు? మీనా పుట్టింట్లో ఇచ్చాడా? మరదలు, బావమరిది చదువులకు ఇచ్చాడా నిలదీయండి అని ప్రభావతిని రెచ్చగొడుతుంది. ఈ సారి వాడు నాకు దొరికాడు…ఎవరు అడిగితే బయటపడతాడో వాళ్లతోనే అడిగిస్తానని ప్రభావతి అంటుంది.
పూలు కొనడానికి ఓ ముసలావిడ బాలు ఆటో ఎక్కుతుంది. పూలు కొన్న తర్వాత ఆమెను షాప్ దగ్గర దించి కిరాయి డబ్బులు తీసుకుంటానని అంటాడు. పూల సంచులు అన్ని లోపల పెట్టి ఆమెకు సాయం చేస్తాడు. ఆమె యాభై రూపాయలు ఎక్కువగా ఇస్తుంది. తన కిరాయికి మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోనని బాలు అంటాడు. బాలు ఆటో నడపటం మీనా చూసి షాకవుతుంది. కారు ఏమైంది…ఆటో నడపటం ఏంటి అని ఆలోచనలో పడుతుంది.
బాలు, మీనా కోసం ఆవేశంగా ఇంట్లో ఎదురుచూస్తుంటుంది ప్రభావతి. మీనా ఇంట్లో అడుగుపెట్టగానే ఆమెపై నిప్పులు చెరుగుతుంది ఇక నుంచి బాలును కూడా పూలకొట్టులోనే కూర్చోమని అంటుంది. బాలు పూల కొట్టులో కూర్చోవడం ఏంటి? కారు ఉందిగా అని రవి అంటాడు. ఉందా…అన్నట్లే ఉంది సెటైర్లు వేస్తుంది. కారు పోయి ఆటో అయ్యిందటగా అని అంటుంది.
అప్పుడే అక్కడికి సత్యం రావడంతో…ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మీ ముద్దుల కొడుకుకు మీరు కారు కొనిస్తే దానిని అమ్మేసి ఆటో తోలుతున్నాడని సత్యంతో అంటుంది ప్రభావతి. కారు అమ్మేసి ఆ డబ్బులు బాలు ఏం చేశాడని గొడవ చేస్తుంది. బాలు ఆటో నడుపుతున్న విషయం నీకు తెలుసా అని మీనాను అడుగుతాడు సత్యం. అవునని మీనా బదులిస్తుంది. ఇద్దరు తోడు దొంగలు అని ప్రభావతి అంటుంది. బాలు ఆటో నడపటం ఇందాక తాను మార్కెట్‌లో చూశానని, అప్పుడే ఈ నిజం తెలిసిందని మీనా అంటుంది. అప్పుడే బాలు వస్తాడు.
తాను ఓ చిన్న తప్పు చేస్తే డైనింగ్ టేబుల్‌ను కోర్టు బోనులా మార్చి నన్ను ప్రశ్నల మీద ప్రశలు వేసి నిలబెట్టి కడిగేశాడుగా…ఈ రోజు ఆ సీన్ రిపీట్ కావాల్సిందేనని ప్రభావతి అంటుంది. డైనింగ్ టేబుల్‌ను బోనుగా మార్చి బాలును అందులో నిలబెడుతుంది. అడిగితే పోయేదానికి ఇదంతా అవసరమా అని సత్యం అంటాడు. ఆ రోజు బాలు నన్ను నిలదీసినప్పుడు మీరు ఏం మాట్లాడలేదు…నాకో ఓ న్యాయమా…నీ కొడుకుకు న్యాయమా అని ప్రభావతి అంటుంది.
రోహిణి మరియు బాలు మధ్య ఉద్రిక్తత
ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి నాతో పార్లర్ పెట్టిస్తే ఆ డబ్బు తెచ్చి ఇచ్చే దాకా నిద్రపోనివ్వలేదుగా అని బాలుపై ద్వేషాన్ని రోహిణి బయటపెడుతుంది. మరి అవే ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కారు కొనిస్తే ఎలా అమ్మేస్తాడు…అది అందరి డబ్బు…దానికి ఏం సమాధానం చెబుతావని బాలును నిలదీస్తుంది రోహిణి. నేను నోరు విప్పితే బోనులో ముద్దాయి మారిపోతాడని బాలు అంటాడు. బాలు వైల్డ్‌గా మారడంతో తన గురించి ఏం నిజం తెలిసిపోయిందో రోహిణి కంగారు పడుతుంది.
బాలు కారు నడుపుతున్నాడని మీరు ఎవరు చెప్పారని ప్రభావతిని అడుగుతుంది మీనా. చూసిన వాళ్లు అని ప్రభావతి అంటుంది. ఆ చూసినవాళ్లు చరిత్ర కథలు కథలుగా నేను చెప్పాలా అని బాలు అంటాడు. దేవుడా…బోనులో నేను నిలబడే పరిస్థితి రాకూడదని రోహిణి కంగారు పడుతుంది. బాలుకు తన గురించి ఏం నిజం తెలిసిపోయిందోనని భయపడుతుంది.
కారు అమ్మేసి ఆ డబ్బు దాచేసి కారు అద్దెకు తీసుసుకొని నడుపుతున్నావు కదా అని బాలును లాయర్‌లా ప్రశ్నిస్తుంది ప్రభావతి. బాలు ఏం చేసిన దానికి ఓ అర్థం ఉంటుందని మీనా అంటుంది. వీడు ఏమైనా కారణజన్ముడా…ప్రతి దానికి అర్థం ఉండటానికి ప్రభావతి ఫైర్ అవుతుంది.
నిజంగా కారు అమ్మేశావా అని బాలును అడుగుతాడు సత్యం. తప్పలేదు నాన్న బాలు బదులిస్తాడు. నాకున్న కొన్ని సమస్యల వల్ల కారు అమ్మాల్సివచ్చిందని, మీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఈ నిజం మీకు చెప్పలేకపోయానని తండ్రితో అంటాడు బాలు. కానీ తాను ఏ తప్పు చేయలేదని బదులిస్తాడు. కారు అమ్మేసిన డబ్బు ఎక్కడ దాచిపెట్టావు…వాటిని ఏం చేశావని ప్రభావతి నిలదీస్తుంది.
శివ వల్లే బాలు కారు అమ్మేయాల్సివచ్చిందనే నిజం మీనాకు చెబుతాడు రాజేష్. గుణతో జరిగిన గొడవ గురించిబయటపెడతాడు. ఇందులో బాలు తప్పేం లేదని మీనాకు వివరిస్తాడు రాజేష్. గుణతో పాటు శివ సంగతి తాను చూస్తానని మీనా అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
రోహిణి తన కుటుంబాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంది. బాలు తన తప్పులకు బాధ్యత వహిస్తాడా? ప్రభావతి తన కోపాన్ని అదుపులో ఉంచుకుంటుందా? ఇవన్నీ తెలియాలంటే గుండెనిండా గుడి గంటలు సీరియల్ చూడండి.


