
📌 Key Points
- “గున్నగున్నవోయె” ఫోక్ సాంగ్ యూట్యూబ్‌లో కోటి వ్యూస్‌కు చేరువలో దూసుకుపోతోంది.
- సోషల్ మీడియాలో ఈ పాటపై లక్షలాది రీల్స్, షార్ట్స్ వైరల్‌గా మారాయి.
- లచ్చుమక్క బొడుగు అద్భుత గాత్రంతో సింగర్‌గా పరిచయం, సంగీత దర్శకత్వం మల్లిక్ తేజ.
- వైష్ణవి సోని, ఈశ్వర్ సాయి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ పాటకు మరింత హైప్ తెచ్చింది.
తెలుగునాట జానపద పాటల జోరు మామూలుగా లేదు! ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తూ, యూట్యూబ్‌లో కోటి వ్యూస్‌కు చేరువలో దూసుకుపోతున్న “గున్నగున్నవోయె” సాంగ్ గురించి తెలుసుకుందాం. ఈ ఫోక్ సెన్సేషన్ వెనుక ఉన్న అద్భుతమైన కథను చూద్దాం.
“గున్నగున్నవోయె” సాంగ్: కోటి వ్యూస్‌కు చేరువలో!
Folk Song : ప్రస్తుతం ఎక్కడచూసినా జానపద పాటలే వినిపిస్తున్నాయి. కొన్ని ఫోక్ సాంగ్స్ సినిమా పాటలను మించిపోతున్నాయి. కొన్ని ఫోక్స్ యూట్యూబ్ లో కోట్ల వ్యూస్ తో దూసుకుపోతుంటే మరికొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇలా గతంలో ”రాను బొంబైకి రాను”, ”ఓ పిలగ యెంకటేశు..” వంటి పాటలు ఓ ఊపు ఊపాయి. ఇప్పుడు ఇదే బాటలో ”గురియన్నే సీరెగట్టి.. గుద్దినట్టు గోసివెట్టి.. గున్నగున్నవోయే గునుకపూల సిన్నది” అంటూ సాగే తెలంగాణ ఫోక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటపై చాలామంది రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.
బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది
చల్ బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జానపదం!
చల్ బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది
చల్ పందిరి గుంజ సాటకెళ్లి
ఈ సూపర్ హిట్ వెనుక ఉన్న సృష్టికర్తలు వీరే!
పల్లెటూరి ప్రేమను అంటే కాస్త మొరటుగా సాగే ప్రేయసి ప్రియుడి సరసాలను ఈ పాటలో చక్కని పదాలతో వివరించారు. అమ్మాయి వివిధ రంగుల చీరలు కట్టి అందంగా ముస్తాబై వెళుతుంటే ఆమెను ప్రియుడు పలు రకాలుగా పిలిచినట్లుగా సాగుతుంది. అయితే ”గురియవన్నె సీరెగట్టి..గుద్దినట్టు గోసివెట్టి” అంటూ మొదటి చరణంపై సోషల్ మీడియాలో రీల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. కేవలం లిరిక్స్ మాత్రమే కాదు మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది… అందుకే ఈ ఫోక్ జనాల్లోకి బలంగా వెళ్లింది. యూట్యూబ్ లో కోటి వ్యూస్ కి చేరువచ్చింది ఈ సాంగ్.
అచ్చ తెలంగాణ యాసలో సాగే ఈ గున్నగున్నవోయె సిన్నది సాంగ్ యూట్యూబ్ లో ఎంవి మ్యూజిక్ ఆండ్ మూవీస్ ఛానెల్లో ఉంది. ఈ పాటకు లిరిక్స్, మ్యూజిక్ తో పాటు డైరెక్షన్ చేసింది ఎస్వి మల్లిక్ తేజ… ప్రొడ్యూసర్ ఒర్సు (RK). అందమైన పదాలతో కూడిన ఈ పాట సరికొత్త గొంతులో మోగింది… అందుకే ఇంత అద్భుతంగా వచ్చింది. లచ్చుమక్క బొడుగు ఈ పాట ద్వారా సింగర్ గా పరిచయం అవుతున్నారు. గున్నగున్నవోయె సాంగ్ ను వైష్ణవి సోని, ఈశ్వర్ సాయి డ్యాన్స్ మరో స్థాయికి తీసుకెళ్లాయి. మై విలేజ్ షో గంగవ్వ, సింగర్ లచ్చుమక్క బొడుగు కూడా మధ్యలో కనిపిస్తూ మరింత పల్లెటూరు టచ్ ఇచ్చారు.
“గున్నగున్నవోయె” సాంగ్ సృష్టిస్తున్న రికార్డులు అద్భుతం. జానపద పాటలకు వస్తున్న ఆదరణకు ఇది నిదర్శనం. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ అప్‌డేట్స్ కోసం వేచి చూడండి!

