|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నరేష్, ఫరియా ‘గుర్రం పాపిరెడ్డి’ రివ్యూ: శవాల మార్పిడితో కోట్లు కొల్లగొట్టే వింత కథ!

Published: 20-12-2025, 3:44 AM
నరేష్, ఫరియా 'గుర్రం పాపిరెడ్డి' రివ్యూ: శవాల మార్పిడితో కోట్లు కొల్లగొట్టే వింత కథ!
  • గుర్రం పాపిరెడ్డి డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది.
  • శవాలు మార్పిడి ద్వారా కోట్లు సంపాదించాలనే విచిత్రమైన కథాంశంతో సినిమా తెరకెక్కింది.
  • నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో, బ్రహ్మానందం, యోగి బాబు కీలక పాత్రల్లో నటించారు.
  • ఫస్టాఫ్ అంతా కామెడీగా సాగుతూ శ్మశానంలోని శవాలకు, పూర్వ సంస్థానాల కథకు లింక్ చేస్తుంది.

మురళీ మనోహర్ దర్శకత్వంలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం నటించిన ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా థియేటర్లలో విడుదలైంది. శవాలు మార్చి కోట్లు కొల్లగొట్టే విభిన్నమైన కామెడీ థ్రిల్లర్ కథతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథా నేపథ్యం, ఆసక్తికర మలుపులు

తెలుగులో లేటెస్ట్‌గా తెరకెక్కిన సినిమా గుర్రం పాపిరెడ్డి. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు తదితరులు నటించిన ఈ సినిమాకు మురళీ మనోహర్ కథ, దర్శకత్వం వహించారు. డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి గుర్రం పాపిరెడ్డి రివ్యూలో తెలుసుకుందాం.

టైటిల్: గుర్రం పాపిరెడ్డి

నటీనటులు: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, ప్రభాస్ శ్రీను, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు

సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి

సినిమాటోగ్రఫీ: అర్జున్ రాజా

నటీనటుల ప్రదర్శన, ప్లస్ పాయింట్స్

ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్

కథ, దర్శకత్వం: మురళీ మనోహర్

నిర్మాతలు: వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ)

విడుదల తేది: 19 డిసెంబర్ 2025

డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా తెలుగులో వచ్చిన లేటెస్ట్ సినిమా గుర్రం పాపిరెడ్డి . నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్‌గా బ్రహ్మానందం, యోగి బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మురళీ మనోహర్ కథ, దర్శకత్వం అందించారు. డిసెంబర్ 19న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో నేటి గుర్రం పాపిరెడ్డి రివ్యూ లో తెలుసుకుందాం.

డార్క్ కామెడీ థ్రిల్లర్ గా గుర్రం పాపిరెడ్డి

అందుకు శ్రీశైలంలోని శ్మశానంలో నుంచి ఓ శవాన్ని బయటకు తీసుకొచ్చి శ్రీనగర్‌లో ఉన్న కళింగ పోతురాజు సమాధిలో పెట్టాలనుకుంటాడు. ఈ పనికోసం గొయ్యి (జీవన్ కుమార్), చిలిపి (వంశీధర్ గౌడ్), మిలట్రీ (రాజ్ కుమార్ కసిరెడ్డి)ని తన టీమ్‌లో చేర్చుకుంటాడు పాపిరెడ్డి.

శవాన్ని మార్చేందుకు శ్రీశైలం వెళ్లిన పాపిరెడ్డి టీమ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అసలు శవాన్ని ఎందుకు మార్చాలనుకున్నారు? దానికి డబ్బు రావడానికి సంబంధం ఏంటీ? స్వాతంత్య్రానికి ముందు నాటి కళింగ-బాలిక-చెర సంస్థానాల నేపథ్యం ఏంటీ? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

ఫస్టాఫ్ అంతా శవాల్ని మార్చడంతో సాగుతూ చాలా కామెడీ జెనరేట్ చేస్తుంది. శ్మశానంలోని శవాలకు స్వాతంత్ర్యం కంటే ముందు నాడు ఉన్న మూడు సంస్థానాల కథకు బాగా లింక్ చేశారు. ఈ క్రమంలో వచ్చే రాజ కుటుంబీకులు హైగ్రీవ (జాన్ విజయ్), నీలగ్రీవ (ప్రదీప్ రుద్ర) పాపిరెడ్డి కోసం వెతకడం, ఈ ముగ్గురికి ఉన్న నేపథ్యం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

గుర్రం పాపిరెడ్డి సెకండ్ పార్ట్‌కు ఇచ్చిన లీడ్ బాగుంటుంది. ఇకపోతే నరేష్ అగస్త్య నటన చాలా బాగుంది. విభిన్న గెటప్పులలో మంచి ఈజ్‌తో అదరగొట్టాడు. జాతి రత్నాలు చిట్టి ఫరియా అబ్దుల్లా గ్లామర్‌తోపాటు నటనతో మెప్పించింది.

సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం, ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే తెలివైన వాడు తెలివిలేనివాళ్లతో తెలివి తక్కువ పని చేస్తే వచ్చే గందరగోలం, హాస్యం ఎలా ఉంటాయో చెప్పే సినిమానే గుర్రం పాపిరెడ్డి.

మొత్తంగా, ‘గుర్రం పాపిరెడ్డి’ డార్క్ కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగింది. వినూత్న కథ, నటీనటుల నటన, కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా సెకండ్ పార్ట్‌కు ఇచ్చిన లీడ్ మరింత ఉత్సుకతను పెంచుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.