
📌 Key Points
- మధ్యప్రదేశ్‌లో హల్దీ వేడుకలో 21 ఏళ్ల యువతి మృతి.
- పసుపుతో పాటు పర్ఫ్యూమ్ పూయడం వల్ల అలర్జీ వచ్చిందని అనుమానం.
- చికిత్స పొందుతూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి.
- కుటుంబ సభ్యులు పెళ్లి రోజునే అంత్యక్రియలు నిర్వహించారు.
మధ్యప్రదేశ్‌లో జరిగిన హల్దీ వేడుకలో 21 ఏళ్ల పెళ్లి కూతురు రాఖీ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. పసుపుతో పాటు పూసిన పర్ఫ్యూమ్ అలర్జీకి కారణమైందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.
హల్దీ వేడుకలో విషాద ఘటన
మధ్యప్రదేశ్‌లోని ఖన్‌గోర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కస్రావాడ్ అనే గ్రామంలో జరిగిన హల్దీ వేడుక వికటించి 21 ఏళ్ల రాఖీ అనే యువతి మృతి చెందింది. పెళ్లికి ముందు ఆచారం ప్రకారం రాఖీ ఇంట్లో హల్దీ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో పెళ్లి కూతురితో పాటు ఇతర బంధువులు పాల్గొన్నారు. ఫంక్షన్ లో అతిధులు, బంధువులు రాఖీకి పసుపుతో పాటు ఓ పర్ఫ్యూమ్ కలిపి పూయగా అది వికటించింది. పెళ్లి కూతురు గొంతు వాచిపోవడంతో పాటు పెదవులు ఉబ్బిపోయాయి. శరీరం అంతటా ఎర్రటి దద్దుర్లు వచ్చాయి. దీంతో వెంటనే తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న సమయంలోనే గొంతు మరింత వాచిపోయింది.
ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యానికి ఎక్కుడ ఖర్చు అవ్వడంతో డబ్బులు లేక యువతి కుటుంబ సభ్యులు డబ్బులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. అంబులెన్స్ లో వెళుతున్న సమయంలోనే ఆరోగ్యం మరింత విషమించి యువతి మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఇంటిముందు వేసిన మండపాన్ని తొలగించి, పెళ్లి జరిపించాల్సిన రోజే అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఘటన యువతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఖర్గోన్ జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్ దౌలత్ సింగ్ చౌహాన్ స్థానిక వైద్యాధికారి నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. యువతికి రాసిన పసుపు, పర్ఫ్యూమ్ ల శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.
వైద్యం అందక పెళ్లి కూతురు మృతి
ఘటనపై విచారణకు ఆదేశం
ఈ హృదయ విదారక ఘటన సమాజంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇలాంటి అనూహ్య సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ దుర్ఘటన గుర్తుచేస్తుంది.


