|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డివోర్స్ రూమర్స్ వేళ హన్సిక ఎమోషనల్ పోస్ట్ వైరల్..కొత్త పాఠాలు నేర్చుకున్నా అంటూ..

Published: 11-08-2025, 10:51 AM
డివోర్స్ రూమర్స్ వేళ హన్సిక ఎమోషనల్ పోస్ట్ వైరల్..కొత్త పాఠాలు నేర్చుకున్నా అంటూ..

నటి హన్సిక మోత్వాని తన 34వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. భర్త సోహైల్ ఖతూరియాతో విడాకుల పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Key Points

1

హన్సిక 34వ పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్.

2

భర్త సోహైల్‌తో విడాకుల పుకార్లు వైరల్.

4

సోహైల్ పుకార్లను ఖండించగా, హన్సిక స్పందించలేదు.

హన్సిక ఎమోషనల్ పోస్ట్ వైరల్

నటి హన్సిక మోత్వాని శనివారం రోజు తన 34వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. భర్త సోహైల్ ఖతూరియాతో విడాకుల పుకార్లు వినిపిస్తున్న వేళ, హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాగ్రౌండ్ లో సముద్రం ఫోటోపై భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

హన్సిక తన పోస్ట్ లో ఇలా పేర్కొంది. “మీరు పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలతో నా హృదయం ప్రేమతో నిండిపోయింది. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. ఈ సంవత్సరం నేను అందగకుండానే కొత్త పాఠాలు నేర్పింది. నాలో ఉన్న నాకు తెలియని శక్తిని తెలిసేలా చేసింది. హృదయం నిండింది, ప్రశాంతంగా ఉంది” అని పేర్కొన్నారు.

విడాకుల పుకార్లు

ఈ పోస్ట్ పెట్టే ముందు కొన్ని రోజులకే, హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ నుండి భర్త సోహైల్‌తో ఉన్న పెళ్లి ఫోటోలు, వీడియోలను తొలగించారు.  మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, వివాహం జరిగి రెండేళ్లు కూడా పూర్తి కాకముందే ఇద్దరూ వేరుగా ఉంటున్నారని సమాచారం.

హన్సిక తన తల్లితో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. సోహైల్ తన తల్లిదండ్రులతో ఉంటున్నారు. 2022 డిసెంబరులో వివాహం జరిగినప్పుడు మొదట ఇద్దరూ సోహైల్ కుటుంబంతోనే ఉన్నారు. కానీ పెద్ద కుటుంబంలో కలిసి ఉండడంలో సమస్యలు రావడంతో, అదే భవనంలో ఒక ఫ్లాట్‌కి మారారు. కానీ వీరి మధ్య సమస్యలు మాత్రం పెరిగాయట. హన్సిక ఈ విషయంపై స్పందించకపోయినా, సోహైల్ మాత్రం “ఇది నిజం కాదు” అని మూడు మాటల్లో ఖండించారు.

సోషల్ మీడియా చర్చ

హన్సిక మోత్వాని, సోహైల్ ఖతూరియా 2022 డిసెంబరులో వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకథను హన్సికాస్ లవ్ షాదీ డ్రామా పేరుతో ఆరు ఎపిసోడ్‌ల రియాలిటీ సిరీస్‌గా తీశారు. ఇది 2023 ఫిబ్రవరిలో జియోసినిమా ద్వారా విడుదలైంది. ఈ సిరీస్‌లో ఐఫిల్ టవర్ కింద ప్రపోజల్‌ నుండి, గ్రాండ్ వెడ్డింగ్ వేడుకల వరకు అన్ని ముఖ్యమైన క్షణాలను చూపించారు. సోహైల్‌కు ఇది రెండో వివాహం కాగా, ఆయన మాజీ భార్య పేరు రింకీ బజాజ్.

హన్సిక, సోహైల్ విడాకుల విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హన్సిక ఎమోషనల్ పోస్ట్ అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఈ జంట భవిష్యత్తు ఏంటో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.