
జ్యోతి పుర్వాజ్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘కిల్లర్’ సినిమా నుండి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ అండ్ ఐస్’ నవంబర్ 16న విడుదల కానుంది. గన్‌తో జ్యోతి పుర్వాజ్ హాట్ లుక్‌లో ఉన్న ఫైరింగ్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
Key Points
జ్యోతి పుర్వాజ్ హీరోయిన్‌గా ‘కిల్లర్’ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ సై-ఫై థ్రిల్లర్‌కు పుర్వాజ్ దర్శకత్వం వహించారు.
ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ అండ్ ఐస్’ నవంబర్ 16న విడుదల కానుంది.
జ్యోతి హాట్ లుక్‌లో గన్ పట్టుకున్న ఫైరింగ్ పోస్టర్ రిలీజ్ చేయబడింది.
‘కిల్లర్’ సినిమా కథా నేపథ్యం, నటీనటులు
‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి మేడమ్‌గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న జ్యోతి పుర్వాజ్(Jyoti Purvaj) హీరోయిన్‌గా మారనుంది. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ చిత్రాలు తెరకెక్కించిన పుర్వాజ్ (Purvaj)దర్శకత్వంలో రాబోతుంది. ‘కిల్లర్’ (Killer)టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో జ్యోతి, పుర్వాజ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సెన్సేషనల్ సై-ఫై థ్రిల్లర్‌లో విశాల్ రాజ్, గౌతమ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఏయు అండ్ఐ అంగ్ మెర్జ్ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు ప్రజయ్ కామత్, పద్మనాభరెడ్డి. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు చిత్రబృందం. మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసినట్లు తెలుపుతూ.. ఫస్ట్ సింగిల్ ఫైర్ అండ్ ఐస్ నవంబర్ 16న రాబోతున్నట్లు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇక ఇందులో జ్యోతి బ్లాక్ డ్రెస్ ధరించి హాట్ లుక్‌లో కనిపిస్తూ గన్ పట్టుకుని ఉండగా.. చుట్టూరా మంటలు వస్తున్నాయి. ఈ పోస్ట్‌కు ‘‘భారతదేశం మొట్టమొదటి సూపర్ లేడీ.. తీసుకురాబోతున్న తుఫానును మీరు తట్టుకోలేరు’’ అని చెప్పి ప్రేక్షకుల్లో అంచనాలు డబుల్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరిలో హీట్ పుట్టిస్తోంది.
ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ అండ్ ఐస్’ విడుదల తేదీ
జ్యోతి పుర్వాజ్ ఫైరింగ్ పోస్టర్.. అంచనాలు రెట్టింపు
‘కిల్లర్’ చిత్రం నుండి వచ్చిన ఈ ఫైరింగ్ పోస్టర్ అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. “తట్టుకోలేని తుఫాను రాబోతుంది” అనే ట్యాగ్‌లైన్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. నవంబర్ 16న రాబోయే ఫస్ట్ సింగిల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

