|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హన్సిక లైఫ్ లో షాకింగ్ ట్విస్ట్! భర్తకు ఇది రెండో పెళ్లి.. మొదటి భార్య ఎవరో తెలిస్తే షాక్!

Published: 11-03-2026, 11:35 PM
హన్సిక లైఫ్ లో షాకింగ్ ట్విస్ట్! భర్తకు ఇది రెండో పెళ్లి.. మొదటి భార్య ఎవరో తెలిస్తే షాక్!
  • హన్సిక-సోహైల్ విడాకులు మంజూరు! కోర్టు నిర్ణయం, కారణాలపై రకరకాల ఊహాగానాలు!
  • గతంలో హన్సిక స్నేహితురాలిని పెళ్లాడిన సోహైల్.. ఇప్పుడు హన్సికతోనూ బంధం తెంచుకున్నాడు!
  • విడాకుల తర్వాత హన్సిక భరణం తీసుకోలేదని సమాచారం.. కారణం వ్యక్తిగతమా?
  • సోహైల్, రింకీ విడాకులకు హన్సిక కారణమంటూ గతంలో వచ్చిన వార్తలు కొట్టిపారేసిన నటి!

టాలీవుడ్ లో మరో షాకింగ్ సంఘటన! హీరోయిన్ హన్సిక మోత్వాని, ఆమె భర్త సోహైల్ విడిపోయారు. వీరి విడాకులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా!

హన్సిక-సోహైల్ విడాకుల వెనుక అసలు కారణాలేంటి?

Hansika Motwanni : హీరోయిన్ హన్సిక ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 19 ఏళ్ళు అయినా ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తుంది. 2022లో హన్సిక సోహైల్ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్లుగా వాళ్ళు విడిపోతారని, హన్సిక – సోహైల్ విడాకుల ప్రాసెస్ కూడా మొదలుపెట్టారని వార్తలు వచ్చాయి. నిన్న మార్చ్ 11న వారికి కోర్టు విడాకులు మంజూరు చేసింది.

దీంతో హన్సిక సోహైల్ విడిపోయారు. ఈ విడాకులలో హన్సిక భరణం కూడా తీసుకోలేదని సమాచారం. అయితే హన్సిక భర్త సోహైల్ కి గతంలోనే పెళ్లయి విడాకులు అయింది. ఇది సోహైల్ కి రెండో పెళ్లి. రెండో విడాకులు.

సోహైల్ మొదటి భార్య ఎవరో తెలుసా? హన్సిక ఫ్రెండే!

సోహైల్ గతంలో హన్సిక ఫ్రెండ్ రింకీ బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రింకీ -సోహైల్ పెళ్ళిలో హన్సిక కూడా సందడి చేసింది. ఈ పెళ్ళితోనే వారిద్దరూ పరిచయం అయ్యారు. ఆ తర్వాత రింకీతో అభిప్రాయ బేధాలు వచ్చి విడాకులు తీసుకున్న సోహైల్ హన్సికతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు.

భరణం తీసుకోని హన్సిక.. విడాకులపై రకరకాల ఊహాగానాలు!

అయితే సోహైల్ – రింకీ విడాకులకు హన్సికనే కారణం అని, రింకీతో పెళ్లి తర్వాతే హన్సిక సోహైల్ కి దగ్గరయింది, హన్సిక వల్లే వాళ్లిద్దరూ విడిపోయారని గతంలో వార్తలు రాగా హన్సిక అవన్నీ తప్పుడు వార్తలు అని స్పందించింది. సోహైల్ గతంలోనే హన్సిక ఫ్రెండ్ ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోగా ఇప్పుడు హన్సికతో కూడా విడాకులు తీసుకోవడం గమనార్హం.

హన్సిక, సోహైల్ విడాకుల వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. త్వరలో మరిన్ని అప్డేట్స్ అందిస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.