|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హన్సిక విడాకులు తీసుకున్నట్లేనా? ఇన్‌స్టా నుంచి పెళ్లి ఫొటోలన్నీ డిలీట్.. మూడేళ్లలోపే ఎవరి దారి వారిది

Published: 05-08-2025, 5:17 AM
హన్సిక విడాకులు తీసుకున్నట్లేనా? ఇన్‌స్టా నుంచి పెళ్లి ఫొటోలన్నీ డిలీట్.. మూడేళ్లలోపే ఎవరి దారి వారిది

టాలీవుడ్ నటి హన్సిక మోత్వానీ మరియు సోహెల్ కతూరియా విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వైరల్ గా ప్రచారంలో ఉన్నాయి. హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పెళ్లి ఫోటోలను తొలగించడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది.

Key Points

1

హన్సిక మోత్వానీ తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది.

2

మూడేళ్లలోనే హన్సిక, సోహెల్ విడాకుల వార్తలు వస్తున్నాయి.

4

సోహెల్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను ప్రైవేట్‌గా మార్చుకున్నాడు.

ఇన్‌స్టా నుంచి పెళ్లి ఫోటోలు డిలీట్

టాలీవుడ్ నటి హన్సికా మోత్వానీ, ఆమె భర్త సోహెల్ కతూరియా తెగదెంపులు చేసుకుంటున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలుసు కదా. మూడేళ్లలోపే వీళ్ల పెళ్లి పెటాకులైనట్లే కనిపిస్తోంది. తాజాగా హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన పెళ్లి ఫొటోలను డిలీట్ చేయడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి.

హన్సిక మోత్వానీ విడాకులు తీసుకోబోతున్నట్లు కొన్నాళ్లుగా పుకార్లు వస్తున్నాయి. అంతేకాదు ఆమె తన తల్లి దగ్గరికి తిరిగి వెళ్లిందని కూడా తెలుస్తోంది. దీంతో ఆమె పెళ్లి పెటాకులైనట్లే అన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. ఇక ఇప్పుడు హన్సిక ఇన్‌స్టాలోనూ వాళ్ల పెళ్లి ఫొటోలు కనిపించకుండా పోయాయి. దీంతో విడాకుల పుకార్లు నిజమేనన్నది తేలిపోయింది.

గతంలో జియో సినిమాలో వచ్చిన ఆరు ఎపిసోడ్‌ల రియాలిటీ సిరీస్ ‘హన్సికాస్ లవ్ షాదీ డ్రామా’ని చూసిన చాలా మందికి ఇది ఆశ్చర్యం కలిగించింది. ఈ షోలో సోహెల్ పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద హన్సికకు ప్రపోజ్ చేయడం నుండి వారి గ్రాండ్ వెడ్డింగ్ వరకు వారి లవ్ స్టోరీ అభిమానులకు బాగా ఆకట్టుకుంది.

మూడేళ్లలోనే విడాకుల వార్తలు

ఈ షోలో వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని చూపించారు. నిజానికి సోహెల్‌కు ఇది రెండో పెళ్లి. హన్సిక కంటే ముందు ఆమె ఫ్రెండ్ గా భావించే రింకీ బజాజ్‌తో వివాహమైంది. అయితే సోహెల్.. హన్సిక సోదరుడికి కూడా మంచి స్నేహితుడు కావడంతో మొదటి పెళ్లి విఫలమైన తర్వాత ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు.

కొన్నాళ్లుగా సోహెల్, హన్సిక మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలిసింది. మరోవైపు 2023 నుండి సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేని సోహెల్, ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను ప్రైవేట్‌గా మార్చుకున్నాడు. ఇది వారి మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. హన్సిక మాత్రం ఈ ఊహాగానాలపై మౌనంగా ఉంది.

హన్సిక గానీ, సోహెల్ గానీ ఈ పుకార్లపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ వారి డిజిటల్ సెలెన్స్, ఆన్‌లైన్ ప్రవర్తనలో మార్పులు వారి మధ్య బంధం గురించి సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

హన్సిక, సోహెల్ మధ్య విభేదాలు

హన్సిక మోత్వానీ బాల నటిగా తన కెరీర్ మొదలుపెట్టి, అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ ‘దేశముదురు’ (2007)తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలో ‘ఒరు కల్ ఒరు కన్నడి’, ‘వేలాయుధం’, తెలుగులో ‘దేనికైనా రెడీ’, ‘100’, ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ వంటి చిత్రాలతో పలు భాషల్లో నటించి స్టార్‌గా ఎదిగింది.

ఆమె ఇటీవల నటించిన సినిమాలు ‘మహా’ (2022), ‘105 మినిట్స్’, ‘గార్డియన్’ (2024), ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ (2023). అటు సోహెల్ కతూరియా ఒక వ్యాపారవేత్త. ఆయన అవంతే టెక్స్‌వరల్డ్ అనే దుస్తుల ఎగుమతి వ్యాపారాన్ని ప్రారంభించాడు. అలాగే, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలను కూడా నిర్వహిస్తున్నాడు. హన్సికతో కలిసి షో ప్రొడక్షన్స్, వ్యాపార కార్యకలాపాలను కూడా చూసుకుంటున్నాడు.

హన్సిక, సోహెల్ విడాకుల వార్తలపై ఇంకా స్పష్టత లేదు. వారి సోషల్ మీడియా చర్యలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఈ జంట భవిష్యత్తు ఏంటో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.