
టాలీవుడ్ లో ప్రస్తుతం హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్ వర్మ మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. భవిష్యత్ సినిమాల కోసం తీసుకున్న అడ్వాన్స్‌లపై చెలరేగిన ఈ వివాదం, ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ఆరోపణలకు దారితీసింది.
Key Points
హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్ వర్మ మధ్య తీవ్ర ఆర్థిక వివాదం.
భవిష్యత్ చిత్రాల కోసం రూ.10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకుని మోసం చేశారని నిర్మాత ఆరోపణ.
ప్రశాంత్ వర్మ తన వాటా ఎగ్గొట్టారని, ఎలాంటి అగ్రిమెంట్లు లేవని చెబుతున్నారు.
నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రశాంత్ వర్మ నుండి రూ.200 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారు.
నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిర్యాదులోని అంశాలు
టాలీవుడ్ లో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వర్సెస్ ఆ సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి మధ్య పంచాయితీ నడుస్తోంది. హనుమాన్ తరువాత తమకు అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలు చేస్తా అని ప్రశాంత్ రూ.10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకుని చెయ్యడం లేదని నిర్మాత ఫిల్మ్ చాంబర్ లో ఫిర్యాదు చేశాడు. రూ.10.23 కోట్లు ఖర్చుపెట్టించి వేరే ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న అక్టోపస్ ను కొనిపించారని, అయితే ఆ సినిమా NOC ఇప్పించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఐదు సినిమాల లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చ్యునిటీస్ ప్రశాంత్ వర్మ నుండి 200 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.
అయితే తాను ఆ సినిమాలు చేస్తా అని ఎక్కడా చెప్పలేదని,అగ్రీమెంట్లు కూడా లేవని ప్రశాంత్ వర్మ చెబుతున్నారు. అక్టోపస్ విషయంలో ఏదైనా ఇష్యూ ఉంటే ఒరిజినల్ ప్రొడ్యూసర్ తో తేల్చుకోవాలని అంటున్నారు. తనకు 15.82 కోట్లు మాత్రమే అందాయని, అవి అడ్వాన్స్ కాదు హనుమాన్ లో తన షేర్ అని చెప్పారు. హనుమాన్ నుండి తనకు ఇంకా రావాలని పేర్కొన్నారు. హనుమాన్ నుండి తనకు ఇంకా చాలా రావాలని అది ఎగ్గొట్టడానికే ఈ కథ అల్లుతున్నారని ప్రశాంత్ వర్మ ఛాంబర్ కు చెప్పారు. హనుమాన్ లో తన వాటా ఎగ్గొట్టి డార్లింగ్, సంబరాల ఏటి గట్టు, బిల్ల రంగ భాష సినిమాలకు డబ్బులు డైవర్ట్ చేశారని ప్రశాంత్ వర్మ ఆరోపించారు.
ప్రశాంత్ వర్మ వాదనలు, ఆరోపణలు
‘హనుమాన్’ షేర్‌పై ఇరువర్గాల మధ్య విభేదాలు
హనుమాన్ సినిమా సక్సెస్ తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ వివాదం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఫిల్మ్ చాంబర్‌లో ఫిర్యాదులు, ఎదురుదాడితో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.


