
📌 Key Points
- భోగి మంటలు దుష్ట శక్తులను తొలగిస్తాయని నమ్మకం.
- పిల్లలకు భోగి పండ్లు పోయడం ఒక శుభకరమైన ఆచారం.
- సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ వస్తుంది.
- భోగి పండుగ కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకుంటారు.
భోగి పండుగ సంక్రాంతి పండుగకు ముందు వచ్చే ఒక ముఖ్యమైన పండుగ. ఇది మన సంస్కృతిలో ఒక భాగం. ఈ రోజున ప్రజలు భోగి మంటలు వేసి, పాత ఆలోచనలను విడిచిపెట్టి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతారు.
భోగి పండుగ ప్రాముఖ్యత
నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా సంక్రాంతి (Sankranti 2026) పండుగను కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన నాడు మకర సంక్రాంతిని జరుపుకుంటాము. బంధువులు, స్నేహితులకు మనసారా భోగి శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి పండుగకి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటాము. భోగి పండుగ నాడు భోగి మంటలు వేయడం, పిల్లలకు భోగి పండ్లు పోయడం ఇలా వివిధ రకాల సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటాము. అయితే భోగి (Bhogi 2026) నాడు మీ బంధువులు, స్నేహితులకు మనసారా శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? అయితే ఈ కోట్స్ మెసేజ్‌లపై (Happy Bhogi Wishes and Quotes) ఒక లుక్ వేసేయండి.
భోగ భాగ్యాలను ఇచ్చే భోగి,
సరదాలను తీసుకొచ్చే సంక్రాంతి,
కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటున్నాను.
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు.
ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే మకర సంక్రమణం,
జనులకి వెలుగునిచ్చే రవికిరణం.
కనుమ కనువిందుగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.
భోగి మంటల విశిష్టత
కష్టాలను దహించే భోగి మంటలు,
భోగాలను అందించే భోగి పండ్లు,
వాకిట్లో అందమైన రంగవల్లులు,
ఇలా ఎప్పటికీ మీకు ఉండాలి సంతోషాలు… అందరికీ భోగి శుభాకాంక్షలు.
భోగి మంటల్లో గత సంవత్సరం బాధలు, కష్టాలన్నీ కాలిపోయి,
కొత్త సంవత్సరం ఆనందాలు రావాలని,
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు…
భోగి మంటల వెలుగులు జీవితంలోని చీకటిని తొలగించి, ప్రకాశమంతమైన జీవితాన్ని ఇవ్వాలని, కొత్త సంవత్సరంలో కొత్త ఆరంభాలను తీసుకురావాలని ఆశిస్తున్నాను… భోగి పండుగ శుభాకాంక్షలు.
ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంతోషాలు, ఆనందాలు అందివ్వాలని కోరుకుంటున్నాను.. భోగి పండుగ 2026 శుభాకాంక్షలు.
మీ ఇల్లు ఆనందంతో కలకల్లాడాలని, కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను.. భోగి పండుగ శుభాకాంక్షలు.
భోగి పండ్ల ఆచారం
భోగి రోజు మీ కష్టాలు మంటల రూపంలో కాలిపోవాలని కోరుకుంటున్నాను.. నిత్యం మీ ఇంట సంతోషాలు కురవాలని ఆశిస్తున్నాను… హ్యాపీ భోగి.
గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మీ జీవితంలో ఆనందం ఉండాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను… భోగి పండుగ శుభాకాంక్షలు.
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, మీకు మేలు కోరే వారికి ఆరోగ్యం, సంపద, సంతోషాలు కలగాలని కోరుతూ.. హ్యాపీ భోగి.
నూతన ప్రారంభానికి ఒక శుభదినం, అదృష్టాన్ని, భోగభాగ్యాలను అందించే పర్వదినం, సిరిసంపదలతో విరజిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.. భోగి శుభాకాంక్షలు.
ఈ భోగి మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను.. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు.
గతానికి వీడ్కోలు పలుకుతూ, రేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలికే భోగి పండుగ సందర్భంగా హ్యాపీ భోగి.
భోగి పండుగతో బాధలన్నీ మటుమాయం కావాలి, ప్రపంచం శాంతి, సౌఖ్యాలకు నిలయంగా మారాలి.. భోగి శుభాకాంక్షలు.
భోగి పండుగ మీకు సంతోషాన్ని, అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను.. భోగి పండుగ శుభాకాంక్షలు.
భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా మీరు, మీ కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. భోగి శుభాకాంక్షలు..
ఈ భోగి పండుగ మీ జీవితంలో సుఖ సంతోషాలను నింపాలని కోరుకుంటూ, మీ కుటుంబానికి మరియు మీకు శుభాకాంక్షలు. శుభం భూయాత్!


