
ఐపీఎల్ మొదటి సీజన్‌లో హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన చెంపదెబ్బ ఘటనకు సంబంధించిన వీడియో 17 ఏళ్ళ తర్వాత బయటపడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Key Points
17 ఏళ్ల తర్వాత హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య చెంపదెబ్బ ఘటన వీడియో బయటపడింది.
ఐపీఎల్ మొదటి సీజన్‌లోని ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో హర్భజన్ శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ సంఘటన తర్వాత ఇద్దరూ మంచి స్నేహితులుగా మారినప్పటికీ, ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది.
17 ఏళ్ల నాటి ఘటన వీడియో బయటపాటు
హర్భజన్ సింగ్, శ్రీశాంత్‌ల మధ్య జరిగిన ఐపీఎల్ చెంపదెబ్బ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ దాదాపు 17 ఏళ్లుగా దాచిపెట్టారు. దాన్ని తాజాగా ఆర్కైవ్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్‌లోని ఒక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్) ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.
ఆ తరువాత శ్రీశాంత్‌ను హర్భజన్ చెంపదెబ్బ కొట్టాడన్న విషయం మాత్రమే తెలుసు. కానీ, అందుకు కారణాలు మాత్రం ఎవరికి తెలియలేదు. ఆ సంఘటన సమయంలో లైవ్ జరుగుతున్నప్పుడు అడ్వర్టైజ్‌మెంట్స్ చూపించారు. అవి ముగిసి లైవ్ స్ట్రీమింగ్‌కు వచ్చిన తర్వాత కేవలం శ్రీశాంత్ ఏడుస్తున్న దృశ్యాలు మాత్రమే కనిపించాయి.
ఆ సంఘటన క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. వారంతా ఒకే జట్టుకు ఆడుతున్న భారత సహచరులు. సీనియర్ ఆటగాడు హర్భజన్ తన యువ సహచరుడిపై చేయి ఎత్తాల్సి రావడానికి కారణం ఏమై ఉంటుంది? అనే ప్రశ్న ఇప్పటికీ అందరిలో మెదులుతూనే ఉంది.
హర్భజన్, శ్రీశాంత్ మధ్య జరిగిన సంఘటన
కానీ, ఆ తర్వాత హర్భజన్ , శ్రీశాంత్ మంచి స్నేహితులుగా మారిన సంగతి తెలిసిందే. అయితే, 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ మైఖేల్ క్లార్క్‌కు చెందిన బియాండ్ 23 పాడ్ కాస్ట్‌లో ఈ వీడియోను ప్రసారం చేశారు.
“ఏం జరిగిందో చెప్తాను. నేను మీకు వీడియో ఇస్తాను. దాన్ని వెనక్కి తీసుకున్నాను. భజ్జీ నాకు చాలా మంచి స్నేహితుడు. నేను అతడిని ప్రేమిస్తున్నాను. అది మైదానంలో జరిగింది. నేను అక్కడే ఉన్నాను. అది భజ్జీ, అది శ్రీశాంత్” అని మోదీ చెప్పారు.
“ఆట ముగిసి, కెమెరాలను నిలిపివేశారు. నా సెక్యూరిటీ కెమెరాల్లో ఒకటి మాత్రమే ఆన్‌లో ఉంది. జట్టు ఆట ముగియగానే ఆటగాళ్లు ఒకరికొకరు కరచాలనం చేసుకుంటూ సందడి చేశారు. ఇక శ్రీశాంత్, భజ్జీ విషయానికి వస్తే.. హర్భజన్ అతనితో ‘ఇక్కడకు రండి’ అని చెప్పి, అతనికి బ్యాక్ హ్యాండ్ ఇచ్చాడు” అని మోదీ తన షోలో క్లార్క్‌తో అన్నారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
ఆ వీడియోలో మ్యాచ్ అనంతరం ఒక జట్టు ఆటగాళ్లు మరో జట్టుతో కరచాలనం చేస్తుండగా శ్రీశాంత్‌ను హర్భజన్ వెనుక నుంచి కొట్టాడు. అది అందరిని షాక్‌కు గురి చేసింది. అయితే ఏమైందో అర్థం కానీ శ్రీశాంత్ కూడా వెనక్కి తగ్గలేదు. సీనియర్ స్పిన్నర్ హర్భజన్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో శ్రీశాంత్‌ను ఇర్ఫాన్ పఠాన్, మహేల జయవర్ధనే పట్టుకుని వెనక్కి లాగారు.
ఆ తర్వాత హర్భజన్ వద్దకు పఠాన్ కూడా వెళ్లాడు. తర్వాత శ్రీశాంత్‌ను గ్రౌండ్ బయట కలవమన్నట్లుగా సైగ చేశాడు. అప్పుడు జరిగిన ఈ సంఘటన అంతా ఇప్పుడు మరోసారి చర్చగా మారింది.
17 ఏళ్ళ తర్వాత బయటపడిన ఈ వీడియో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా చర్చనీయాంశంగానే మిగిలిపోయాయి.


