|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హరిహరి వీరమల్లు: మీడియా ప్రతినిధులపై పోలీసుల దురుసు ప్రవర్తన

Published: 22-07-2025, 1:20 AM
హరిహరి వీరమల్లు: మీడియా ప్రతినిధులపై పోలీసుల దురుసు ప్రవర్తన

హరిహరి వీరమల్లు సినిమా ప్రీ-లాంచ్‌ ఈవెంట్‌లో పోలీసుల దురుసు ప్రవర్తన కలకలం రేపింది. పవన్ కళ్యాణ్ అభిమానులపై లాఠీచార్జ్‌ చేస్తుండగా మీడియా ప్రతినిధులపై కూడా దాడి జరిగింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Key Points

1

హరిహరి వీరమల్లు ప్రీ-లాంచ్‌లో పోలీసుల దురుసు ప్రవర్తన.

2

పవన్ కళ్యాణ్ అభిమానులపై లాఠీచార్జ్‌ సమయంలో మీడియాపై దాడి.

4

మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌.

ప్రీ-లాంచ్‌లో తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్: మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో సోమవారం జరిగిన హరిహరి వీరమల్లు ప్రీ లాంచ్‌ కార్యక్రమానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడమేగాక లాఠీచార్జ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే పవన్‌ కళ్యాణ్‌ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేస్తుండగా దానిని కవర్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులపై మాదాపూర్‌ అడిషనల్‌ డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు వైఖరిపై రంగారెడ్డి జిల్లా ఎల్రక్టానిక్‌ మీడియా జాయింట్‌ సెక్రటరీ మహమ్మద్‌ షకిల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మీడియాపై పోలీసుల దాడి

క్షమాపణల డిమాండ్‌

పోలీసుల దురుసు వైఖరిపై మీడియా తీవ్రంగా స్పందించింది. క్షమాపణలు కోరుతూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.