|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

`హరి హర వీరమల్లు` 4 రోజుల కలెక్షన్లు.. హిట్‌ కావాలంటే ఇంకా ఎన్ని కోట్లు రావాలో తెలుసా?

Published: 28-07-2025, 12:18 PM
`హరి హర వీరమల్లు` 4 రోజుల కలెక్షన్లు.. హిట్‌ కావాలంటే ఇంకా ఎన్ని కోట్లు రావాలో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా విడుదలై నాలుగు రోజులు అయ్యింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. సినిమా ఇప్పటి వరకు ఎంత కలెక్షన్లు సాధించిందో, హిట్ కావడానికి ఎంత అవసరమో తెలుసుకుందాం.

Key Points

1

హరి హర వీరమల్లు 4 రోజుల్లో 105 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

2

సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి ఇంకా 130 కోట్లు రావాల్సి ఉంది.

4

వీఎఫ్ఎక్స్ విమర్శలకు సమాధానంగా సినిమాకు మెరుగులు దిద్దారు.

హరి హర వీరమల్లు బాక్స్ ఆఫీస్ వసూళ్లు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన `హరి హర వీరమల్లు` థియేటర్లలో రచ్చ చేస్తోంది. ఈ మూవీ పవన్‌ అభిమానులను అలరిస్తోంది. కామన్‌ ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

అయితే టీమ్‌ మాత్రం సినిమాకి మెరుగులు దిద్దారు. ఫైనల్‌ వెర్షన్‌ యాడ్‌ చేశారు. కొంత ట్రిమ్‌ చేశారు. కొన్ని వీఎఫ్‌ఎక్స్ కి సంబంధించి అప్‌ డేటెడ్‌ సీన్స్ ని యాడ్‌ చేశారు. అలా వీఎఫ్‌ఎక్స్ విషయంలో ఉన్న విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.

ఇదిలా ఉంటే `హరి హర వీరమల్లు` సినిమాకి ఇప్పటి వరకు ఎంత కలెక్షన్లు వచ్చాయి. ఎన్ని కోట్లు వసూళు చేశాయనేది చూస్తే. ఈ మూవీ డీసెంట్‌ నెంబర్స్ ని వసూలు చేస్తోంది.

గురువారం (జులై 24న) ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. కాకపోతే రెండో రోజు నుంచి తగ్గాయి. నెగటివ్‌ టాక్‌ ఇంపాక్ట్ పడింది. మూడో రోజు పెరగడం విశేషం.

సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్

నాల్గో రోజు కూడా ఈ మూవీకి మంచి వసూళ్లు వచ్చాయి. పది కోట్లకుపైగానే కలెక్షన్లని రాబట్టినట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.105 కోట్లు రాబట్టినట్టు సమాచారం.

ఈ లెక్కన `హరి హర వీరమల్లు` యాభై కోట్లకుపైగా షేర్‌ని సాధించింది. సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే ఇంకా రూ.130కోట్ల(గ్రాస్‌) వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది. రూ. 125కోట్లు బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఉన్నట్టు సమాచారం.

మరి అంత భారీ వసూళ్లని రాబట్టగలదా అనేది చూడాలి. అప్పుడే సినిమా బయ్యర్లు సేఫ్‌లో ఉంటారు. నిర్మాత ఊపిరి పీల్చుకుంటారు. లేదంటే నష్టాలు తప్పవు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందిన `హరి హర వీరమల్లు` మూవీకి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా, నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. బాబీ డియోల్‌ విలన్‌గా చేశారు.

పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రేక్షకుల స్పందన

సునీల్‌, రఘుబాబు, నాజర్‌, కబీర్‌ సింగ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఏఎం రత్నం నిర్మించారు. ఈ నెల 24న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. హిందీ వెర్షన్‌ ఆగస్ట్ 1 నుంచి రిలీజ్‌ కాబోతున్నట్టు తెలుస్తోంది.

17 శతాబ్దం నేపథ్యంలో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ ఆగడాలను ప్రధానంగా చేసుకుని, హిందువులుగా బతకాలంటే జిజియా పన్ను కట్టాలనే నిబంధన పెట్టిన నేపథ్యంలో దాన్ని వీరమల్లు ఎలా ఎదుర్కొన్నారు.

కొహినూర్‌ వజ్రాన్ని తీసుకురావడం కోసం ఆయన చేసే జర్నీ ప్రధానంగా ఈ మూవీని రూపొందించిన విషయం తెలిసిందే. క్రిష్‌ ఈ మూవీని స్టార్ట్ చేసి మధ్యలోనే తప్పుకున్నారు, ఆ తర్వాత జ్యోతికృష్ణ సినిమాని పూర్తి చేశారు.

చివరిగా, హరి హర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ వసూళ్లు మరియు భవిష్యత్తు ప్రదర్శనను బట్టి సినిమా హిట్ అవుతుందో లేదో నిర్ణయించబడుతుంది. నిర్మాతలు, బయ్యర్లు ఆశించే లాభాలను సాధించగలదా అన్నది చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.