|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రకృతి సృష్టించిన విపత్తులో వారిద్దరు కలుసుకుంటారు.. క్లైమాక్స్ అందుకే అలా: హరి హర వీరమల్లు డైరెక్టర్ జ్యోతికృష్ణ

Published: 28-07-2025, 1:19 AM
ప్రకృతి సృష్టించిన విపత్తులో వారిద్దరు కలుసుకుంటారు.. క్లైమాక్స్ అందుకే అలా: హరి హర వీరమల్లు డైరెక్టర్ జ్యోతికృష్ణ

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైంది. ఈ సినిమాలోని కథాంశం, ముఖ్యంగా క్లైమాక్స్ గురించి డైరెక్టర్ జ్యోతికృష్ణ వివరణ ఇచ్చారు. సినిమాలో వీరమల్లు వేద జ్ఞానంతో ఎలా ప్రకృతి శక్తులను అదుపులో ఉంచుకున్నాడో తెలుసుకుందాం.

Key Points

1

హరిహర వీరమల్లు వేదాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించాడు.

2

వీరమల్లు వాస్తుశాస్త్రం ద్వారా ప్రకృతి శక్తులను అదుపులో ఉంచుకున్నాడు.

4

క్లైమాక్స్ ఒక క్లిఫ్ హ్యాంగర్‌గా రూపొందించబడింది, సీక్వెల్‌కు ఆస్కారం ఉంది.

వీరమల్లు వేద జ్ఞానం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ‘హరి హర వీరమల్లు’ జూలై 24న విడుదలై తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది. తర్వాత మందకోడిగా కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే, మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తులు హిందూ దేవాల‌యాల‌ను నాశ‌నం చేసిన చారిత్ర‌క క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి స్పంద‌న బాగానే ఉంది.

ఈ సంద‌ర్భంగా హరి హర వీరమల్లు సినిమా గురించి డైరెక్టర్ జ్యోతికృష్ణ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. “వేద గ్రంథాల‌ను నాశ‌నం చేసిన‌ప్పుడు ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ( పవన్ కల్యాణ్ ) బ‌లంగా నిల‌బ‌డ్డాడు. మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల ఇబ్బందుల‌ను ధైర్యంగా ఎదుర్కొన్నాడు” అని డైరెక్టర్ తెలిపారు.

ప్రకృతి శక్తులపై అధికారం

“వేదాల‌లోని జ్ఞానాన్ని అంతా సంపాదించుకుని త‌నే ఒక వేద పండితుడిగా మార‌టంతో వాటిని నాశనం చేయ‌టానికి వీలుకాకుండా ఉండిపోయింది. వీర‌మ‌ల్లు చిన్న‌ప్ప‌టి నుంచి గుడిలో పెరిగాడు. అందువ‌ల్ల వేద జ్ఞానాన్ని సంపాదించుకుని శ‌క్తివంత‌మైన వ్య‌క్తిగా ఎదిగాడు” అని జ్యోతికృష్ణ చెప్పారు

ఇంకా జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. “వీర‌మ‌ల్లు త‌న వేద జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని వాస్తుశాస్త్రంతో భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం వంటి పంచ భూతాలను అవ‌గ‌తం చేసుకుని ధ‌ర్మ‌ సంబంధ‌మైన జీవన విధానాన్ని నిర్మించ‌టంలో త‌న వంతు పాత్ర‌ను పోషించాడు. అత‌ని దూర‌దృష్టి, నైపుణ్యం మ‌రెవ‌రితోనూ పోల్చ‌లేవివి. అందుకు చాలా ఉదాహ‌ర‌ణ‌లు సినిమాలో అంత‌ర్భాగంగా మ‌న‌కు క‌నిపిస్తాయి” అని పేర్కొన్నారు.

ఉత్కంఠభరిత క్లైమాక్స్

“గుల్ఫ‌మ్ ఖాన్ (క‌బీర్ దుహాన్ సింగ్‌)ను కొండ‌పై జ‌రిగే ప్ర‌మాదం నుంచి కాపాడుతాడు, అలాగే యాగం చేస్తుంటే దాన్ని అడ్డుకోవాల‌ని చూసే వారి నుంచి యాగానికి ఏమీ కాకుండా ర‌క్షించి వ‌రుణ దేవుడు క‌రుణించేలా చేసి వ‌ర్షం కురిసేలా చేస్తాడు. అలాగే రాత్రి స‌మ‌యంలో తోడేళ్లు దాడి చేయ‌టానికి వ‌చ్చిన‌ప్పుడు వాటితో మాన‌సిక‌మైన సంభాష‌ణ చేసి ఎవ‌రికీ ఏమీ కాకుండా చూస్తాడు. ఇవ‌న్నీ వీర‌మ‌ల్లుకి వేద త‌త్వాల నుంచి వచ్చిన ప్రేర‌ణ అని అర్థ‌మ‌వుతుంది” అని జ్యోతి కృష్ణ వెల్లడించారు.

“ఇక సినిమా చివ‌ర‌లో వీర‌మ‌ల్లు, ఔరంగ‌జేబు పాత్ర‌లు క‌లుసుకోవ‌టం అనేది అసాధార‌ణంగా జ‌రుగుతుంది. ప్ర‌కృతి సృష్టించిన విప‌త్తులో వారిద్దరూ క‌లుసుకుంటారు. ఇదే ఉత్కంఠ‌భ‌రిత‌మైన తుది పోరుకు వేదిక అనాలి. అందుక‌నే క్లైమాక్స్‌ను ఓ క్లిప్ హ్యాంగ‌ర్‌లా తెర‌కెక్కించాం. ఇది రాబోయే భాగానికి కొన‌సాగింపు ఉంటుంద‌నే అర్థానిస్తుంది” అని జ్యోతి కృష్ణ తెలిపారు.

హరిహర వీరమల్లు సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని, ఇది సీక్వెల్‌కు దారితీస్తుందని డైరెక్టర్ తెలిపారు. ప్రకృతి విపత్తు నేపథ్యంలో జరిగే ఈ పోరు చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.