
Key Points
హరిహర వీరమల్లు సినిమా జులై 24న విడుదలవుతోంది.
పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా నార్త్ ఇండియా ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు.
ముంబైలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది.
నార్త్ ఇండియాలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు
Hari Hara Veeramallu : గత అయిదేళ్లుగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు జులై 24న రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ప్రమోషన్స్ కేవలం హీరోయిన్, నిర్మాత మాత్రమే చేస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేస్తుండటంతో సౌత్ లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, నార్త్ లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారని వార్తలు వచ్చాయి. నార్త్ లో పవన్ కి పొలిటికల్ గా భారీగా ఫ్యాన్స్ ఏర్పడ్డ సంగతి తెలిసిందే. మోదీ సైతం పవన్ ని తుఫాన్ అని అభివర్ణించడం, కేంద్ర మంత్రులు సైతం పవన్ కి ప్రాధాన్యత ఇవ్వడం, సనాతన ధర్మం కోసం పవన్ పోరాడటంతో నార్త్ లో పవన్ కి పొలిటికల్ గా ఫ్యాన్స్ బాగానే ఏర్పడ్డారు. దీంతో కాశీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారని, యోగి ఆదిత్యనాథ్ వస్తారని వార్తలు వచ్చాయి.
పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలు కారణం
ఇటీవల జులై 21 సోమవారం నాడు సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని ప్రకటిచారు మూవీ యూనిట్. నార్త్ ఈవెంట్ పై క్లారిటీ రాలేదు. నేడు నిర్మాత ఏఎం రత్నం మీడియాతో మాట్లాడగా నార్త్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి క్లారిటీ ఇచ్చారు.
ముంబైలో ప్రెస్ మీట్ సాధ్యత
ఏఎం రత్నం మాట్లాడుతూ.. నార్త్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏపీ ప్రభుత్వంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హీరో లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే బాగోదు. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టట్లేదు. ఒక ప్రెస్ మీట్ మాత్రం ముంబైలో పెట్టే ఆలోచన చేస్తున్నాము అని తెలిపారు. దీంతో నార్త్ లో పవన్ వెళ్తాడు, అక్కడ పవర్ ఫుల్ గా మాట్లాడతాడు అని ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. మరి ఇక్కడ హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడో చూడాలి.
చివరగా, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ పరిమితం అయ్యాయి. నార్త్ ఇండియాలోని అభిమానులకు నిరాశ, హైదరాబాద్ ఈవెంట్‌పై ఆసక్తి పెరిగింది.


