|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

HHVM2 Title: `హరి హర వీరమల్లు` మూవీ పార్ట్ 2 టైటిల్‌ ఇదే.. షూటింగ్‌ అప్‌డేట్‌, రిలీజ్‌ ఎప్పుడంటే?

Published: 24-07-2025, 2:21 AM
HHVM2 Title: `హరి హర వీరమల్లు` మూవీ పార్ట్ 2 టైటిల్‌ ఇదే.. షూటింగ్‌ అప్‌డేట్‌, రిలీజ్‌ ఎప్పుడంటే?

పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్రం విడుదలైంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మొదటి భాగం విడుదలైన తర్వాత, రెండో భాగం టైటిల్ మరియు షూటింగ్ అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి.

హరి హర వీరమల్లు మొదటి భాగం విడుదల

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `హరి హర వీరమల్లు` మూవీ ఐదేళ్లు పురిటినొప్పులు అనుభవించి ఎట్టకేలకు ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

నేడు గురువారం ఈ చిత్రం ప్రపంచ వాప్తంగా విడుదలైంది. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్స్ ప్రదర్శించారు. దీనికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా అసలు రిజల్ట్ ఏంటనేది ఈ రోజు తేలనుంది.

`హరి హర వీరమల్లు`లో పవన్‌ కళ్యాణ్‌ యాక్షన్స్ హైలైట్‌గా నిలిచాయి. ఆయన ఎలివేషన్స్  బాగున్నాయి. పాటలు ఓకే అనిపించాయి. బీజీఎం చాలా కొత్తగా ఉంది. అదొక హైలైట్‌గా నిలిచింది.

దీనికితోడు విజువల్స్ మరో అసెట్‌గా చెప్పొచ్చు. చాలా గ్రాండియర్‌గా ఉన్నాయి. థియేటర్ ఎక్స్ పీరియెన్స్ వాహ్‌ అనిపిస్తుంది. కాకపోతే స్లోగా ఉండటం, సెకండాఫ్‌లో కాస్త డల్ గా ఉండటం మైనస్‌గా చెప్పొచ్చు.

ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇవ్వాల్సింది.  క్లైమాక్స్ ముగింపు ఇంకా బాగా చేయాల్సింది. ఓవరాల్‌గా పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్ అనే చెప్పాలి.

యుద్ధభూమి: రెండో భాగం టైటిల్ మరియు షూటింగ్ అప్‌డేట్

ఇదిలా ఉంటే `హరి హర వీరమల్లు` రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విడుదలైంది మొదటి పార్ట్. `యుద్ధం వర్సెస్‌ ధర్మం` అనే ట్యాగ్‌ లైన్‌తో దీన్ని రూపొందించారు.

ఇక ఈ మూవీకి రెండో పార్ట్ కూడా ఉంది. ఈ విషయాన్ని టీమ్‌ వెల్లడించింది. ఫస్ట్ పార్ట్ ఎండింగ్‌లో కూడా ఆ విషయాన్ని స్పష్టం చేశారు.

అదే సమయంలో రెండో పార్ట్ టైటిల్‌ని రివీల్‌ చేశారు. దీనికి `యుద్ధభూమి`గా నిర్ణయించారు. `హరి హర వీరమల్లుః యుద్ధభూమి` పేరుతో రెండో భాగాన్ని తెరకెక్కించనున్నారు.

వీరగా నటించిన పవన్‌ కళ్యాణ్‌, ఔరంగజేబ్‌గా నటించిన బాబీ డియోల్‌ ఎదురుపడటంతో మొదటి భాగం ముగుస్తుంది. ఆ ఎదురుపడే సీన్‌ పీక్‌లో ఉంటుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య చోటు చేసుకునే యుద్ధమే రెండో పార్ట్ గా ఉండబోతుందని అర్థమవుతుంది.

అయితే ఈ రెండో పార్ట్ కి సంబంధించిన షూటింగ్‌ అప్‌ డేట్‌ కూడా వెల్లడించింది టీమ్‌. ఇప్పటికే 20 నుంచి 30 శాతం షూటింగ్‌ కంప్లీట్‌ చేసినట్టు తెలిపారు పవన్ కళ్యాణ్‌.

సినిమా విజయంపై రెండో భాగం ఆధారపడి ఉంటుందా?

ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని తెలిపారు. రెండో భాగం ఉంటుందా? లేదా అనేది మొదటి పార్ట్ సక్సెస్‌ మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు.

సినిమా బాగా ఆడితే కొనసాగిస్తామని, లేదంటే ఉండబోదనే విషయాన్ని పవన్‌ చెప్పకనే చెప్పేశారు. కానీ చూడబోతుంటే రెండో పార్ట్ రావడం కష్టమే అని చెప్పొచ్చు.

పవన్‌ కళ్యాణ్‌ వీరమల్లుగా నటించిన `హరి హర వీరమల్లు` చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సినిమాకి సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌ అయినట్టు సమాచారం.

ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించగా, ఔరంగజేబ్‌గా, నెగటివ్‌ రోల్‌లో బాబీ డియోల్‌ నటించారు. సునీల్‌, నాజర్‌, రఘుబాబు, కబీర్‌సింగ్‌ వంటివారు ముఖ్య పాత్రలు పోషించారు.

మొత్తంమీద, హరి హర వీరమల్లు మొదటి భాగం విడుదలైంది. రెండో భాగం యుద్ధభూమి టైటిల్ తో రానుంది. సినిమా విజయంపై రెండో భాగం నిర్మాణం ఆధారపడి ఉంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.