
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా థియేటర్లలో విడుదలైంది. ప్రీమియర్ షోలు చూసిన నెటిజన్లు ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ రివ్యూల ఆధారంగా సినిమా ఎలా ఉందో చూద్దాం.
Key Points
పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమాకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ వీఎఫ్ఎక్స్ లోపాలతో కొంత నిరాశపరిచిందని నెటిజన్లు అంటున్నారు.
కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు.
వీఎఫ్ఎక్స్ తో సహా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, చూడదగిన సినిమా అని నెటిజన్ల అభిప్రాయం.
ట్విటర్‌లో హరి హర వీరమల్లు రివ్యూలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే ఏ రేంజ్‌లో అంచనాలు, ఇంట్రెస్ట్ తెలిసిందే. అలాంటిది, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న తొలి సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, ఏఎమ్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేసింది.
యానిమల్ విలన్ బాబీ డియోల్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేశాడు. ఇక ఎన్నో ఏళ్లుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న హరి హర వీరమల్లు ఫైనల్‌గా ఇవాళ (జులై 24) థియేటర్లలో విడుదల కానుంది.
అయితే, రిలీజ్‌కు ఒకరోజే ముందు అంటే బుధవారం (జులై 23) రాత్రి నుంచే హరి హర వీరమల్లు పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. అవి చూసిన నెటిజన్స్ టాక్ ఎలా ఉందో హరి హర వీరమల్లు ట్విటర్ రివ్యూ లో చూద్దాం.
నెటిజన్ల అభిప్రాయాలు: ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు
“ఫస్టాఫ్ చాలా బాగుంది. సెకండాఫ్ మొదటి 40 నిమిషాలు యావరేజ్‌గా ఉంది. చివరి 40 నిమిషాలు బాగుంది. కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు హార్ట్ లాంటిది. కుస్తీ ఫైట్ సీన్, ప్రీ క్లైమాక్స్ ఫైట్స్ అదిరిపోయాయి. సాంగ్స్ బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ బాగోలేదు. ఓవరాల్‌గా బ్యాడ్ వీఎఫ్ఎక్స్‌తో మంచి సినిమా హరి హర వీరమల్లు” అని ఎక్స్ యూజర్ చెప్పాడు.
“హరి హర వీరమల్లు ఫస్టాఫ్. రియల్లీ చాలా బాగుంది. గ్రేట్ పాయింట్. క్రిష్ జాగర్లమూడికే మొత్తం క్రెడిట్ దక్కుతుంది. సప్రైజే అది” ఒకరు నెటిజన్ రాసుకొచ్చారు. “ఇప్పుడే ఫస్టాఫ్ పూర్తి అయింది. బ్యాంగర్ అంతే.. ఎమ్ఎమ్ కీరవాణి నుంచి ఈ రేంజ్ బీజీఎమ్ ఊహించలేదు. బ్లాక్ బస్టర్ హరి హర వీరమల్లు” అని మరో యూజర్ రివ్యూ ఇచ్చారు.
వీఎఫ్ఎక్స్, ఫైట్ సీన్స్, బీజీఎంపై ప్రతిస్పందన
“హరి హర వీరమల్లు ఎలా ఉంది. జెన్యూన్ రివ్యూస్ ప్లీజ్” అని ఒకరు ట్విటర్‌లో అడిగితే పలు రకాలుగా స్పందించారు నెటిజన్స్. దానికి ఒకరు “కొన్ని లోపాలను పక్కన పెడితే ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్‌లో వరస్ట్‌గా ఉన్న వీఎఫ్ఎక్స్ ఆడియెన్స్ వ్యూని దెబ్బతీశాయి. ప్రీ క్లైమాక్స్ బాగుంది. ఎండింగ్ కూడా పర్వాలేదు. కీరవాణి గారికి హ్యాట్సాఫ్. ఆయన బీజీఎమ్ చాలా సీన్లను లేపింది. ఓవరాల్‌గా ఒకసారి చూసే సినిమా” అని రాసుకొచ్చారు.
ఇలా హరి హర వీరమల్లు సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. సినిమా బాగుంది. కానీ, గ్రాఫిక్స్ అస్సలు బాగాలేదని అంటున్నారు. అలాగే, ఫైట్ సీన్స్, కీరవాణి బీజీణ్ అదిరిపోయిందని చెబుతున్నారు.
మొత్తం మీద, హరి హర వీరమల్లు సినిమాకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొన్ని అంశాల్లో అద్భుతంగా ఉండగా, కొన్ని అంశాల్లో నిరాశపరిచింది. అయినప్పటికీ, పవన్ కల్యాణ్ అభిమానులకు ఇది చూడదగిన సినిమా.


