
పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతోంది. సినిమా విజయోత్సవ సభలో దర్శకుడు జ్యోతి కృష్ణ సినిమా విజయం గురించి, నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ పాత్రల గురించి మాట్లాడారు.
Key Points
హరి హర వీరమల్లు సినిమాకు ఇద్దరు దర్శకత్వం
పవన్ కళ్యాణ్, కీరవాణిని సినిమా హీరోలుగా పేర్కొన్నారు
నిధి అగర్వాల్ ఐదు సంవత్సరాలుగా సినిమా కోసం వేచి చూసింది
సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది
హరి హర వీరమల్లు విజయోత్సవం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన సినిమా ‘హరి హర వీరమల్లు’. భారీ అంచనాల నడుమ థియేటర్లలో జూలై 24న అడుగుపెట్టింది హరి హర వీరమల్లు . జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలుకాగా హరి హర వీరమల్లు సినిమాకు టాక్ బాగానే ఉంది.
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో సత్తా చాటుతోంది హరి హర వీరమల్లు మూవీ. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, ఏఎమ్ జ్యోతి కృష్ణ ఇద్దరు దర్శకత్వం వహించారు. పవన్ కల్యాణ్‌కు జోడీగా హీరోయిన్ నిధి అగర్వాల్ చేసింది. సినిమాకు మంచి టాక్ వస్తున్న సందర్భంగా హరి హర వీరమల్లు విజయోత్సవ సభ నిర్వహించారు మేకర్స్.
ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. “థియేటర్లలో అభిమానులు, ప్రేక్షకుల స్పందన చూసి చాలా సంతోషం కలిగింది. సినిమాని ముగించిన తీరు అద్భుతంగా ఉంది, రెండవ భాగం చూడాలనే ఆసక్తి కలుగుతోందని చాలామంది ఫోన్ చేసి ప్రశంసించారు” అని అన్నారు.
జ్యోతి కృష్ణ కామెంట్స్
“చిన్న చిన్న పిల్లలు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా. పవన్ కల్యాణ్ గారి సినిమా అంటేనే అందరూ కలిసి చూస్తారు. పవన్ కల్యాణ్ గారితో ఇలాంటి మంచి సినిమా చేయడం గర్వంగా ఉంది” అని జ్యోతి కృష్ణ చెప్పారు.
“ఈ సినిమాకి ఇద్దరు హీరోలు.. ఒకరు పవన్ గారు, ఇంకొకరు కీరవాణి గారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ గారు 18 నిమిషాల ఫైట్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేశారు. పెద్దగా సంభాషణలు లేకుండా దాదాపు 30 నిమిషాల ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్‌ని కీరవాణి గారు తన సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లారు” అని జ్యోతి కృష్ణ తెలిపారు.
నిధి అగర్వాల్ యొక్క పాత్ర
“నిధి అగర్వాల్ గారు ఐదేళ్లుగా ఈ సినిమాను నమ్మి నిలబడ్డారు. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ సపోర్ట్‌ను మరువలేను. మా నాన్న రత్నం గారు తన మొదటి సినిమా హిట్ అయినప్పుడు ఎంత ఆనందపడ్డారో.. మళ్లీ అంతటి ఆనందాన్ని ఇన్నాళ్లకు ఆయన ముఖంలో చూశాను. ఈ సినిమా ఆయనకు ఎంతటి డ్రీమ్ ప్రాజెక్టో ఆ సంతోషంలోనే తెలుస్తోంది” అని జ్యోతి కృష్ణ వెల్లడించారు.
“ఈ సినీ ప్రయాణంలో నా భార్య, మా అమ్మ ఇచ్చిన సపోర్ట్‌ని ఎప్పటికీ మరచిపోలేము. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన పవన్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను” అని నిర్మాత ఏఎం రత్నం కుమారుడు, దర్శకుడు ఏఎం జ్యోతి కృష్ణ చెప్పుకొచ్చారు.
మొత్తంమీద, హరి హర వీరమల్లు సినిమా ప్రేక్షకులను అలరించింది. దర్శకుడు జ్యోతి కృష్ణ, నిధి అగర్వాల్, మరియు మొత్తం బృందం యొక్క కృషి విజయవంతమైంది.


