
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం జూన్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కౌంట్ డౌన్ పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో పవన్ కళ్యాణ్ అద్భుతమైన లుక్ లో కనిపిస్తున్నారు.
Key Points
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రం జూన్ 12న విడుదలవుతోంది.
చిత్ర యూనిట్ తాజాగా కౌంట్ డౌన్ పోస్టర్‌ను విడుదల చేసింది.
పోస్టర్లో పవన్ కళ్యాణ్ గంభీరంగా కనిపిస్తున్నారు.
సినిమా రిలీజ్‌కు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలాయని చిత్ర యూనిట్ తెలిపింది.
కౌంట్ డౌన్ పోస్టర్ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక దీనికి దర్శకులు జ్యోతి కృష్ణ(Jyothi Krishna) అలాగే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాని రెండు భాగాలుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయిపోయింది. ఇక ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ఏ ఎం రత్నం(AM Ratnam) నిర్మాణం వహించారు.
పవన్ కళ్యాణ్ గంభీరమైన లుక్
అలాగే ఈ జూన్ 12న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ మూవీ నుంచి కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘ఇంకా 13 రోజులు మిగిలి ఉన్నాయి.. నిప్పు మరియు నిర్భయంలో చెక్కబడిన వారసత్వం. ధర్మ స్ఫూర్తి పెద్ద తెరపై ఉదయించనుంది.. జూన్ 12, 2025 నుండి ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లలో హరిహర వీరమల్లు రాబోతుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. పవన్ కళ్యాణ్ పొడవాటి మీసం, గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‌తో గంభీరంగా కనిపిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్‌లో చార్మినార్‌తో పాటు రెండు కత్తులు ఉన్నాయి.
జూన్ 12న గ్రాండ్ రిలీజ్
A post shared by PawanKalyan.k🔵 (@pawankalyan.konidella)
హరిహర వీరమల్లు చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. కౌంట్ డౌన్ పోస్టర్ విడుదలతో అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది. జూన్ 12న విడుదలయ్యే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో దుమ్ము రేపుతుందో చూడాలి.


