
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఈవెంట్‌లో పలువురు ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం.
Key Points
తిరుపతిలో ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగనుంది.
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిధులుగా పాల్గొననున్నట్లు వార్తలు.
ఈవెంట్ తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర బృందం సూచన.
పవన్ కల్యాణ్ అభిమానులు ఈ వార్తతో సంతోషంలో మునిగి తేలుతున్నారు.
గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) ఒకటి. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి భాగం ఈ జూన్ 12న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం ‘హరిహర వీరమల్లు’ నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రీ రిలీజ్‌కు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న న్యూస్ మేరకు.. HHVM సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారట మేకర్స్. తిరుపతిలో ఈ ఈవెంట్ జగనుందని తెలుస్తుండగా.. దీనికి ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi), సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పాల్గొననున్నారని తెలుస్తోంది. అలాగే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌పై కూడా త్వరలో అప్‌డేట్ ఇవ్వనున్నట్లు టాక్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ముఖ్య అతిధులు ఎవరు?
తేదీ వివరాలు
చివరగా, హరిహర వీరమల్లు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన వార్తలు పవన్ కళ్యాణ్ అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించబడనున్నాయి.


