
Key Points
జూన్ 8న తిరుపతిలో హరిహర వీరమల్లు ప్రీ-రిలీజ్ ఈవెంట్.
SV యూనివర్సిటీ తారకరామ క్రీడా మైదానంలో ఈవెంట్.
ఈవెంట్‌లో హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదల.
తిరుపతిలో భారీ ఈవెంట్
HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 న రిలీజ్ కి రెడీ అయింది. అయిదేళ్లుగా సాగి ఎట్టకేలకు రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీ ఉండటంతో మూవీ యూనిట్ సింపుల్ గా ప్రమోషన్స్ చేస్తుంది. అయితే సౌత్ లో ఒకటి, నార్త్ లో ఒకటి రెండు భారీ ఈవెంట్స్ ని పెట్టాలని ముందే ప్లాన్ చేసారు.
ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి టాక్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలోని SV యూనివర్సిటీ తారకరామ క్రీడా మైదానంలో జూన్ 8న సాయంత్రం నిర్వహించనున్నారు అని సమాచారం. ఇప్పటికే స్థలం పర్మిషన్ కోసం పోలీసులకు దరాఖాస్తు కూడా చేశారని తెలుస్తుంది.
జూన్ 8న ట్రైలర్ విడుదల
ఈ మేరకు జూన్ 7 రాత్రి పవన్ కళ్యాణ్ తిరుమల చేరుకొని 8 ఉదయం వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే హరిహర వీరమల్లు ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ తిరుమల దర్శనం
ఇక నార్త్ లో కాశీలో హరిహర వీరమల్లు ఈవెంట్ నిర్వహిస్తారని టాక్ వినిపిస్తుంది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తుంటే హరిహర వీరమల్లు వాయిదా పడుతుంది అని రూమర్స్ కూడా వస్తున్నాయి. మరి జూన్ 12 సినిమా రిలీజ్ అవుతుందా, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందా చూడాలి.
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌కు ముందు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో అభిమానులకు సర్‌ప్రైజ్. తిరుపతిలో జరిగే ఈవెంట్‌లో ట్రైలర్ విడుదలతో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతుంది.


