
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల తేదీని చిత్రబృందం ఖరారు చేసింది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేసింది.
Key Points
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూలై 24న విడుదల.
క్రిష్ దర్శకత్వంలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు.
రిలీజ్ డేట్ ప్రకటనతో పోస్టర్ విడుదలై సోషల్ మీడియాలో హైప్ పెరిగింది.
ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.
హరిహర వీరమల్లు విడుదల తేదీ ఖరారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) ఒకటి. క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ(Jyothi Krishna)లు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం(AM Rathnam) నిర్మించారు. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ యాక్టర్ బాబి డియోల్(Bobby Deol) కీలక పాత్ర పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్‌ఎమ్ కీరవాణి(MM Keeravani) సంగీతం అందించారు. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎడతెగని వాయిదాలు పడుతూనే వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫైనల్‌గా ఇప్పుడు ఓ విడుదల తేదీని ప్రకటించారు చిత్రబృదం.
ఈ మేరకు సోషల్ మీడియా(Social Media) వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘ఒకరు అధికారం కోసం పోరాడుతారు.. ఒకరు ధర్మం కోసం పోరాడుతారు.. వారసత్వాల ఘర్షణ ప్రారంభమవుతుంది.. సత్యం, విశ్వాసం మరియు స్వేచ్ఛ కోసం యుద్ధానికి సాక్ష్యమివ్వడం కోసం హరిహర వీరమల్లు జూలై 24న వరల్డ్ వైడ్‌గా రాబోతుంది.. ఒక చారిత్రక అనుభవం వేచి ఉంది’ అని రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇక పోస్టర్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు విలన్‌గా నటించిన బాబీ డియోల్ ఫొటోని కూడా పోస్టర్‌లో ఉంచారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
పోస్టర్‌తో పెరిగిన ఆసక్తి
నటీనటుల గురించి
చివరగా, హరిహర వీరమల్లు జూలై 24న విడుదల కానున్నట్లు ప్రకటించడంతో అభిమానుల ఆనందం పట్టవీలు లేకుండా పెరిగింది. పోస్టర్ ప్రభావం చూడదగ్గదే.


