|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హరిహర వీరమల్లు సినిమా టికెట్‌ ధరల తగ్గించాలి: డీవైఎఫ్‌ఐ డిమాండ్‌

Published: 24-07-2025, 3:51 AM
హరిహర వీరమల్లు సినిమా టికెట్‌ ధరల తగ్గించాలి: డీవైఎఫ్‌ఐ డిమాండ్‌

హరిహర వీరమల్లు సినిమా టికెట్ల ధరలు అధికంగా ఉండటంపై డీవైఎఫ్ఐ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలకు అధిక ధరలు, సామాన్య ప్రజలకు భారంగా ఉన్నాయని ఆరోపించింది.

Key Points

1

హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరలు అధికంగా ఉన్నాయని డీవైఎఫ్ఐ ఆరోపణ.

2

బెనిఫిట్ షోలకు రూ.700 నుంచి రూ.1000 వరకు టికెట్ ధరలు నిర్ణయించడంపై డీవైఎఫ్ఐ మండిపాటు.

4

డీవైఎఫ్ఐ తక్షణమే టికెట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసింది.

డీవైఎఫ్ఐ ఆరోపణలు

సాక్షి, అమరావతి: హరిహర వీరమల్లు సినిమా కోసం పెంచిన టికెట్‌ ధరలను తక్షణమే తగ్గించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర శాక అధ్యక్ష, కార్యదర్శులు వై.రాము, జి. రామన్నలు డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిత్యావసరాలతో సహా అన్ని ధరలు చుక్కలంటుతున్నాయని, చివరికి వినోదం కోసం సినిమా వీక్షించే అవకాశం కూడా సామాన్యలకు లేకుండా ఇష్టమొచ్చినట్లుగా వసూలు చేసుకునే అవకాశం కల్పించడం దారుణమని పేర్కొన్నారు.

బెనిఫిట్‌ షోల పేర‍్ట ఒక్కో టికెట్‌కు రూ. 700 నుంచి రూ. 1000 వసూలు చేయడం దారుణమని, ఈ దోపిడీ విధానానికి స్వస్తి చెప్పాలన్నారు. మిగిలిన రోజుల్లో కూడా టికెట్‌ ధరలు రూ. 177 నుంచి రూ.377 వరకు పెంచి సామాన్యులకు సైతం  సినిమా చూసే అవకాశం లేకుంటా చేస్తున్నారని మండిపడ్డారు.

అధిక టికెట్ ధరలపై విమర్శ

సామాన్యులకు సినిమా చూడటం కష్టం

హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరలను తగ్గించాలని డీవైఎఫ్ఐ చేసిన డిమాండ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని భావిస్తున్నారు. సామాన్య ప్రజలకు సినిమా చూసే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.